ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలి
భూపాలపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ పనులు నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సోమవారం జిల్లాలోని తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు, ఓటరు మ్యాపింగ్ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
మీ డబ్బు.. మీ హక్కు
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ‘మీ డబ్బు.. మీ హక్కు’ అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 4న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందన్నారు. బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేపట్టారని తెలిపారు.
పర్యాటక బ్రోచర్ ఆవిష్కరణ..
జిల్లాకేంద్రంలో ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ పర్యాటక బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యాటక ప్రదేశాల సమాచారంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యాటకశాఖ 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ చేయడానికి ప్రోత్సాహకుల నుంచి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శా ఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి ఈ పోటీలను నిర్వహిస్తుందన్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా మూడు ఫొటోలు, 60 సెకండ్ల వీడియో 100 పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా గూగుల్ ఫామ్‌లో పర్యాటక వెబ్‌సైట్‌కు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


