ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Dec 28 2025 8:29 AM | Updated on Dec 28 2025 8:29 AM

ఆదివా

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

– 8లోu

న్యూస్‌రీల్‌

సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య...

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు తాజా మాజీ వార్డు కౌన్సిలర్‌ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి(49) హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో తన ఇంటికి బైక్‌పై వెళ్తున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు నాలుగు రోజుల్లోనే ఏడుగురు నిందితులను, తదనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చూపించారు.

9మందికి జీవిత ఖైదు...

2021 జూన్‌ 19న కాటారం మండలం గంగారం గ్రామంలో భూ తగాదా విషయంలో ముగ్గురిని హత్య చేసిన కేసులో 9 మంది నిందితులకు ఈ నెల 23వ తేదీన ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులోని నిందితులు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడాదిలో కోర్టు వెలువరించిన తీర్పుల్లో ఇదే అతి పెద్దది.

సైబర్‌ కేసులు 87 నమోదు..

జిల్లాలో ఈ ఏడాదిలో ఈ నెల 26వ తేదీ వరకు సైబర్‌ నేరాలు జరిగినట్లుగా 537 మంది ఫిర్యాదు చేశారు. అందులో 87 ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యాయి. నమోదైన కేసులకు సంబంధించిన బాధితులకు రూ. 9.54 లక్షలను పోలీసులు తిరిగి ఇప్పించినట్లు తెలిసింది.

మహిళలపై తగ్గిన హత్య, లైంగిక దాడులు

గతేడాదికంటే తగ్గిన రోడ్డు ప్రమాదాలు

జిల్లాలో పెరిగిన చోరీలు

సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య

జిల్లా ప్రజలకు తప్పని సైబర్‌ మోసాలు

ప్రమాదాలు, మరణాలు..

2023 2024 2025

రోడ్డు ప్రమాదాలు 196 223 217

మరణాలు 90 74 79

గాయాలు 95 124 213

జిల్లాలో గతేడాదితో పోలిస్తే చోరీల సంఖ్య పెరగగా.. మహిళలపై వరకట్న వేధింపులు, గృహహింస, హత్యలు, లైంగిక దాడులు కొంతమేరకు తగ్గాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా కొంత మేరకు తగ్గగా, గంజాయి కేసులు గతంలో మాదిరిగానే నమోదయ్యాయి. పోలీసులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది సైబర్‌ నేరాల బారిన పడ్డారు. ఈ ఏడాదిలో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. – భూపాలపల్లి

చోరీ కేసులు

కేసులు 2023 2024 2025

చోరీ కేసులు 86 108 118

ఛేదించిన కేసులు 30 36 56

చోరీ సొత్తు(రూ.) 1,58,44,603 77,75,945 1,20,49,700

రికవరీ సొత్తు(రూ.) 22,72,880 24,85,400 31,87,595

మహిళలపై దాడుల కేసులు...

2023 2024 2025

వరకట్న వేధింపులు, గృహహింస 121 145 117

మహిళలపై హత్యలు 1 6 4

లైంగిక దాడులు 14 18 10

వరకట్న హత్యలు 1 0 1

గంజాయి కేసుల వివరాలు..

2023 2024 2025

నమోదైన కేసులు 12 23 23

పట్టుబడిన గంజాయి

విలువ(రూ.లక్షలు) 2,97,300 45,98,900 33,00,000

అరెస్ట్‌ అయిన వారు 30 78 64

చోరీ సొత్తు రికవరీ అంతంతే..

జిల్లాలో ఈ ఏడాది 118 చోరీ కేసులు నమోదు కాగా చోరీ సొత్తు అంతంత మాత్రంగానే రికవరీ అయింది. గతంతో పోలిస్తే చోరీ కేసులను ఛేదించిన సంఖ్య ఈ ఏడాది పెరిగింది.

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 20251
1/1

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement