వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
భూపాలపల్లి అర్బన్: ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభ వాల్‌పోస్టర్‌ను శనివారం జిల్లాకేంద్రంలో ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు. జనవరి 3నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో నిర్వహించనున్నట్లు వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరేపల్లి సుజిత్ తెలిపారు. మహాసభకు జిల్లా నుంచి విద్యార్థులు, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గుజ్జుల ప్రేమ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవితేజ, సిరి, శశ్వంత్, వరుణ్ పాల్గొన్నారు.


