నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
భూపాలపల్లి రూరల్: సర్పంచ్‌లు నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. మహిళా సర్పంచ్‌లు ఇందిరాగాంధీ స్ఫూర్తితో గ్రామపాలన చేయాలన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పుష్పగార్డెన్‌లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పంచ్‌ల విధులు, ఆదాయ వనరులు సమకూర్చుకొనుట, పంచాయతీల ఏర్పాటు విధానం, పాలనా విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి పంచాయతీలే వేదికలని అన్నారు. వంద శాతం సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించాలని తెలిపారు. గ్రామాల్లో సోలార్ సెట్‌లను ఏర్పాటు చేసి విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని సూచించారు. సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే తమకు తెలపాలని చెప్పారు. మహిళా శక్తిని మించి ఏదీలేదని, మహిళా సర్పంచ్‌లు ఉక్కు మహిళ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా పాలన అందించి ప్రజల మెప్పు పొందాలన్నారు. ప్రతీ నెల నిబంధనల ప్రకారం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధికారులతో, ప్రజలతో సఖ్యతగా మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డుసభ్యులను సన్మానించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 146 మంది లబ్ధిదారులకు రూ.1,46,16,936 కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, భూపాలపల్లి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కిష్టయ్య, శ్రీదేవి, పార్టీ రాష్ట్ర నాయకులు రాంనర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, నాయకులు అప్పం కిషన్, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
సర్పంచ్‌ల శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే సత్యనారాయణరావు
నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి


