ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలి
కాళేశ్వరం: ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. బుధవారం ఆయన మహదేవపూర్ మండలంలోని బొమ్మాపూర్, సురా రం, మహదేవ్‌పూర్, కాళేశ్వరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. రైతులు తీసుకొస్తున్న ధాన్యం తేమ శాతం రోజువారీగా నిర్ధారించి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను తప్పనిసరిగా 24 గంటలలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తేమ శాతం నమోదు రిజిస్టర్, డైలీ ప్రొక్యూర్మెంట్ అప్‌డేషన్ రిజిస్టర్లను పరిశీలించి, రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమయానుకూల సంరక్షణకు సంబంధించి అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్ పోస్టును పరిశీలించారు. ఆయన వెంట పౌరసరఫరాల అధికారి కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీసీఓ వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్


