రేపు సాక్షి ఫోన్ ఇన్
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటున్నా ఉదయం, సాయంత్రం చలి ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, పిల్లలతో పాటు సాధారణ పౌరులు దగ్గు, జలుబుతో పాటు జ్వరం బారిన పడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న మందులు, చికిత్స వివరాలు తెలుసుకునేందుకు నేరుగా జిల్లా వైద్యారోగ్యాశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ కు ఫోన్ చేసే అవకాశాన్ని ‘సాక్షి’ కల్పిస్తోంది. ప్రజలు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి సందేహాలను తీర్చుకోవడమే కాక సలహాలు తీసుకోవచ్చు.
తేది 29–12–2025 (సోమవారం)
సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి 4గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్
94403 25816
రేపు సాక్షి ఫోన్ ఇన్


