భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా గ్రానెట్‌తో ఫ్లోర్ నిర్మాణం పనులు చేపట్టారు. జాతర సమయంలో భక్తులు బంగారం(బెల్లం), కొబ్బరి, నీళ్లతో జారీ పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రానెట్‌పై గ్రౌటింగ్ చేయించే పనులను మొదలు పెట్టారు. దీనివల్ల కాలుకు గ్రిప్ లభించి కిందపడకుండా ఉంటారు. వృద్ధులు, చిన్నారులకు సైతం ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ సారి మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జాతరలో భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలైన ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్నానఘట్టాల రోడ్డు, చిలకలగుట్ట ప్రాంతంలో ప్లాస్టిక్‌తో కూడిన మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతరలో మొత్తం 1,020 మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్


