సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు
భూపాలపల్లి అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్(పార్టీ కార్యాలయం)లో జిల్లా నాయకులతో కలిసి పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 100 సంవత్సరాల చరిత్రలో అనేక ఉద్యమాలు చేసి ప్రజల మన్నన పొందుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. పట్టణంలోని వివిధ కాలనీలలో పార్టీ నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సోత్కు ప్రవీణ్‌కుమార్, సతీష్, సుగుణ, శ్రీకాంత్, జోసెఫ్, సుధాకర్‌రెడ్డి, జోగేష్, సింహాద్రి, లావణ్య, కృష్ణ, రాజు, అస్లాం, రమేష్‌చారి పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం ఏర్పాటుకు నేడు (శనివారం) జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, అబ్జర్వర్లు సతీష్, గజేంద్ర హాజరవుతారని చెప్పారు.
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కట్ట రాంచంద్రమూర్తి ఎన్నికయ్యారు. జిల్లాకేంద్రంలో శుక్రవారం జిల్లా కమిటీ ఎన్నికల అధికారి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పడగాల అయిలయ్య, ఉపాధ్యక్షులుగా గడ్డం పోషయ్య, ఠాకూరు విక్రమ్‌సింగ్, కట్ల రమణారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా అడప రాజయ్య, కోశాధికారిగా జరుపుల ధన్‌సింగ్‌నాయక్, సహాయ కార్యదర్శులుగా కొండబత్తుల రాజేందర్, పి.నారాయణరెడ్డి, మార్త వెంకటరమణ, లక్ష్మణ్‌రావు, కార్యదర్శులుగా రామారావు, మహేందర్‌రెడ్డి, రామునాయక్ నియామకమయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను సన్మానించారు.
ములుగు రూరల్: మేడారం మహాజాతరకు ముందస్తుగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ 2 డిపో మేనేజర్ రవిచందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ఉదయం ఆరు గంటల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపిస్తామని వివరించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. మేడారం తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం బస్సులు గద్దెల వరకు వెళ్తున్నాయని వివరించారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు
సీపీఐ ఆవిర్భావ ఉత్సవాలు


