సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో వచ్చే నెల 11న నిర్వహించనున్న ఆదివాసీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. మేడారంలో అమ్మవార్ల గద్దెల వద్ద సమ్మేళనం కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు ఆదివాసీ తెగల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీలు, ఆదివాసీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చందా మ హేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుం దెబ్బ ప్రచార కార్యదర్శి మలకం సమ్మయ్య, తాడ్వాయి మండల అధ్యక్షుడు చందా నవీన్, మండల ప్రధాన కార్యదర్శి తాటి సురేష్, మండల ఉపాధ్యక్షుడు చర్ప జునేష్, పిట్టల నగేష్ పాల్గొన్నారు.
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రావణ్‌కుమార్


