వైద్యసేవల్లో భేష్
జీజీహెచ్‌లో మెరుగునపడిన సదుపాయాలు
భూపాలపల్లి: జిల్లాలో వైద్యరంగంలో మెరుగైన సేవలు అందుతుండగా పలు రంగాల్లో మాత్రం అభివృద్ధి పనులు, సేవలు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తుండగా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, ఇండస్ట్రియల్ పార్కు భూమి చదును దశలోనే ఉంది.
మెరుగైన వైద్య సేవలు..
మెడికల్ కళాశాల అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి. మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో రూ.20 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. 340 బెడ్‌లకు సరిపడా అదనపు గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పేషెంట్లకు అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు ఈ ఏడాది జనవరి 27న వెంటిలేటర్ సౌకర్యాన్ని కల్పించారు. రూ.3.40 కోట్లతో సీటీ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఇటీవలే ప్రారంభించారు. ఇటీవల ఎన్‌సీడీ స్కానింగ్ సెంటర్, ట్రాన్స్‌జెండర్ క్లినిక్, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లను ప్రారంభించారు.
నిర్మాణంలో మెడికల్ కళాశాల భవనం
చురుకుగా సాగుతున్న
సమీకృత కోర్టు భవనాల పనులు
నత్తనడకన ఇంటిగ్రేటెడ్ స్కూల్
కాంప్లెక్స్ నిర్మాణం
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు
70 శాతం పూర్తి


