చకచకా కోర్టు పనులు..
జిల్లాకేంద్రంలో సమీకృత కోర్టు సముదాయ భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. కోర్టులు నాలుగేళ్లుగా అద్డె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాలు ఇరుకుగా ఉండటం, కనీస సౌకర్యాలు లేక కోర్టు ఉద్యోగులు, అడ్వకేట్లు, కోర్టులను ఆశ్రయించే వారు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే రూ.37 కోట్లతో నిర్మించనున్న సమీకృత కోర్టు భవనాల నిర్మాణ పనులకు గత నెల 1వ తేదీన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్‌సింగ్ శంకుస్థాపన చేశారు. నూతన సంవత్సరంలో భవనం అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మాణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు.


