తొలిదశల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్..
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సదుద్ధేశంతో జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ భవనం నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ శివారులో రూ.196 కోట్లతో అక్టోబర్ 10న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ పనులు నేటికీ భూమి చదును దశలోనే ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి గతేడాది జూలై 25న శంకుస్థాపన చేశారు. 60 గుంటల్లో పరిశ్రమలు, 37.69 ఎకరాల్లో 197 ప్లాట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.


