నాపాక బ్రహ్మోత్సవాలు షురూ
చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలోని నాపాక ఆలయంలో బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేశ్‌చార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, హోమం చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య దంపతులతో పాటు మండలంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లు నక్క భాస్కర్ ( నైన్‌పాక), బుర్ర చంద్రకళ(గిద్దెముత్తారం), కాసు రమ–కుమార్( వెంచరామి), కాసం మాధవి–రాజిరెడ్డి (అందుకుతండా), పాశం పుష్పలత– కుమార్ (వరికోల్‌పల్లి ) నైన్‌పాక మాజీ ఎంపీటీసీ కట్టెకోళ్ల రమేశ్‌తో పాటు పలు గ్రామాలకు చెందిన దంపతులు పాల్గొన్నారు.
నేడు ఉత్తర ద్వార దర్శనం..
నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలు, భజన ప్రదర్శనలతో పాటు కూచిపూడి భరతనాట్యం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు.
నేడు ఉత్తర ద్వార దర్శనం
భక్తుల కోలాటాలు,
కూచిపూడి భరతనాట్యం
నాపాక బ్రహ్మోత్సవాలు షురూ


