ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
కాటారం : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నమోదైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలు, ఎన్నికల సామగ్రి, కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను భద్రపర్చాలని తెలిపారు. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్‌కు పూర్తి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, ఆర్‌ఓలు ఉన్నారు.


