హస్తం హవా
54 స్థానాల్లో కాంగ్రెస్..
మండలాల వారీగా గెలుపొందిన
పార్టీల వివరాలు
తుది విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్‌దే పై‘చేయి’
కాటారం: గ్రామ పంచాయతీ ఎన్నికల తుదిపోరులో హస్తం హవా కొనసాగింది. మొదటి, రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోగా మూడో విడతలోనూ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. రెండో స్థానంలో బీఆర్‌ఎస్, మూడో స్థానంలో ఇతరులు నిలిచారు. మంత్రి శ్రీధర్‌బాబు సొంత మండలం కాటారం గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపొందగా మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలిచినప్పటికీ నాలుగు మండలాల్లో బీఆర్‌ఎస్ కొంత మేర ఉనికిని చాటుకుంది.
జిల్లాలోని కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరిగాయి. 81 సర్పంచ్ స్థానాలకు గాను ఒకటి కాంగ్రెస్ మద్దతుదారుడు, రెండు స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంతో చేజిక్కించుకున్నారు. మిగిలిన 78 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 53 మంది, బీఆర్‌ఎస్ 17, ఇతరులు 7, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందారు.
మండలం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
కాటారం 14 4 1 5
మహదేవపూర్ 14 3 0 1
మహాముత్తారం 15 9 0 0
మల్హర్ 11 1 0 3
మొత్తం 54 17 1 9
రెండో స్థానంలో బీఆర్‌ఎస్
పలుచోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్
నాయకుల వాగ్వాదం


