సమన్వయంతోనే ఎన్నికలు విజయవంతం
కాటారం: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నే మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో కలుపుకొని 84.02 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విజయవంతంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, పాత్రికేయులకు, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు కలెక్టర్ కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, కొత్తపల్లి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సరళిపై ఆరా తీసి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి ఉన్నారు.
పోలింగ్ సరళి పరిశీలన
మల్హర్: చివరి విడత ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. బుధవారం మండలంలో తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు. ఆయన వెంట ఎన్నికల డీఎస్పీ నారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
సమన్వయంతోనే ఎన్నికలు విజయవంతం


