చివరి విడత ప్రశాంతం
మండలాల వారీగా పోలింగ్ వివరాలు
నాలుగు మండలాల్లో ముగిసిన జీపీ ఎన్నికలు
కాటారం: జిల్లాలో చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. అధికారులు, పోలీసుల ముందస్తు ప్రణాళికతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు సజావుగా సాగాయి. అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో భాగంగా కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 84.02 శాతం పోలింగ్ నమోదైంది. మహాముత్తారం మండలంలో అత్యధికంగా 86.42, కాటారంలో అత్యల్పంగా 82.28 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగు మండలాల్లో 98,052 మంది ఓటర్లు ఉండగా 82,382 మంది త మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా మండలాల్లో పోలింగ్ సరళి, కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, అడిషనల్ కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించారు.
మందకొడిగా మొదలై...
పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ నిర్వాహణకు సిబ్బంది తెల్లవారు జామునే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్‌కు సిద్ధం చేయగా శీతాకాలం కావడంతో చలి కారణంగా ఓటర్లు ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ సరళి మందకొడిగా సాగగా 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద కొంత సమయం వరకు ఓటర్లు బారులుదీరారు. కాటారం మండలంలో చిద్నెపల్లి, ధన్వాడ, జాదారావుపేట, ఒడిపిలవంచ, విలాసాగర్‌తో పాటు మహాముత్తారం, మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఉదయం 11.30 గంటల లోపే పోలింగ్ పూర్తయింది. పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంటలోగా పోలింగ్ పూర్తి కాగా అలోపు కేంద్రంలోకి వచ్చిన ఓటర్లను ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు. నాలుగు మండలాల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 26.11 శాతం, 9 నుంచి 11 గంటల వరకు 61.64 శాతం, పోలింగ్ ముగిసే సమయం 1 గంట వరకు 84.02 శాతం పోలింగ్ నమోదైంది. 40,328 మంది పురుషులు, 42,046 మంది మహిళలు, 8 మంది ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాత్కాలిక గుడారాల్లో పోలింగ్ కేంద్రాలు..
కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో పోలింగ్ నిర్వాహణకు సరైన కేంద్రాలు లేకపోవడంతో తా త్కాలికంగా గుడారాలు వేసి పోలింగ్ నిర్వహించారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా గదులు లేకపోవడంతో టెంట్లతో గుడారాలు వేసి పలు వార్డుల కోసం తాత్కాలిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో టెంట్లు వేయడంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా బయటకు కనిపించింది. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎన్నికల నిర్వాహణలో
పోలీస్ మార్క్..
పలు శాఖల అధికారుల సమన్వయంతో మూడో విడత ఎన్నికలు సజావుగా కొనసాగాయి. మండల పరిషత్ అధికారులు ఎన్నికల నిర్వాహణ కోసం తగిన ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి లోటుపాట్లు కానరాలేదు. ఎన్నికల సిబ్బంది సమయానుకూలంగా ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. కాగా ఎన్నికల నిర్వాహణలో పోలీస్ మార్క్ ప్రత్యేకంగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అసంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఎస్సైతో పాటు 6 నుంచి 8 మంది వరకు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓటు వేసిన వారిని వెంటనే కేంద్రాల నుంచి బయటకు పంపించడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు.
మండలం మొత్తం పోలైన శాతం
ఓట్లు ఓట్లు
కాటారం 30,785 25,331 82.28
మహదేవపూర్ 25,434 21,462 84.38
మహాముత్తారం 20,286 17,532 86.42
మల్హర్ 21,547 18,057 83.80
మరిన్ని ఎన్నికల వార్తలు 8లోu
తుది విడత సర్పంచ్‌లు వీరే 9లోu
84.02 శాతం పోలింగ్ నమోదు
పోలింగ్ సరళి, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
చివరి విడత ప్రశాంతం
చివరి విడత ప్రశాంతం
చివరి విడత ప్రశాంతం


