తొలి ఓటు అభివృద్ధికి..
కాళేశ్వరం: జిల్లాలో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు యువకులు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పల్లె ప్రగతికి ఓటేయడానికి వచ్చి తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
జీపీ ఎన్నికల్లో ఓటు హక్కు రావడం.. మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. గ్రామ ప్రథమ పౌరుడి ఎన్నికలో డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేశా. ప్రజల కోసం పని చేసే వ్యక్తులను ఎన్నుకుంటే మేలు జరుగుతుంది.
– ఎండీ.సమీర్,
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, హైదరాబాద్
బీటెక్ పూర్తి చేశా. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చాను. గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా న్యాయంగా ఓటు వేశా.
– దూది చంద్రశేఖర్, కాళేశ్వరం
నాన్న కాళేశ్వరం సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. నా తొలి ఓటును ఆయనకు వేయడానికి చైన్నె నుంచి వచ్చా. మొదటిసారిగా ఓటు వేయడం.. అది నాన్నకు వేయడం మరచిపోలేని జ్ఞాపకం. నాన్న (మోహన్‌రెడ్డి) సర్పంచ్‌గా గెలవడం ఆనందంగా ఉంది.
– వెన్నపురెడ్డి దీక్షిత్‌రెడ్డి, కాళేశ్వరం
మల్హర్: మొదటి సారి ఓటు హక్కు వచ్చింది. తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ప్రతీ ఎలక్షన్‌లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకుంటా.
– ఎల్.అవినాష్, తాడిచర్ల, మల్హర్
●
తొలి ఓటు అభివృద్ధికి..
తొలి ఓటు అభివృద్ధికి..
తొలి ఓటు అభివృద్ధికి..


