అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
రేగొండ: ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికా రి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం రేగొండ, కొత్తపల్లిగోరి మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో కలెక్టర్ రాహుల్‌శర్మ క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. సమయానికి పోలింగ్ ప్రారంభమై, ముగిసేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం లెక్కింపు పూర్తి చేసి పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సామగ్రి తరలింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో రేగొండ మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్, తహసీల్దార్లు శ్వేత, లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, ఎంఈఓ రాజు, రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ


