రక్షణ సూత్రాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రక్షణ సూత్రాలు పాటించాలి

Dec 11 2025 8:21 AM | Updated on Dec 11 2025 8:21 AM

రక్షణ

రక్షణ సూత్రాలు పాటించాలి

రక్షణ సూత్రాలు పాటించాలి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక మతిస్థిమితంలేని వ్యక్తి చేరదీత పోలీసులు విధుల్లో జాగ్రత్తగా ఉండాలి

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. రక్షణ తనిఖీ బృందం బుధవారం ఏరియాలోని కేటీకే 8వ గనిని సందర్శించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం మాట్లాడారు. ప్రమాదాలు లేని సింగరేణే లక్ష్యమని అన్నారు. ఇతర సంస్థలకు సింగరేణిని ఆదర్శంగా నిలపాలని కోరారు. కార్యక్రమంలో రక్షణ కమిటీ బృందం అధికారులు శ్రీనాథ్‌, లక్ష్మణ్‌, రాధాకృష్ణ, అప్సర్‌పాషా, కిరణ్‌కుమార్‌, అమరనాథ్‌ పాల్గొన్నారు.

కాటారం: కాటారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన క్రీడాకారులు రాంచరణ్‌, దేవేందర్‌, అభిషేక్‌ 69వ ఎస్‌జీఎఫ్‌ అండర్‌ 19 హ్యాండ్‌ బాల్‌ జిల్లాస్థాయి పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చారు. దీంతో నిర్వాహకులు వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్‌ మాధవి బుధవారం తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటయ్య, బలరాం, మహేందర్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌ అభినందించారు.

భూపాలపల్లి రూరల్‌: మతిస్థిమితంలేని వ్యక్తిని ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు చేరదీశాడు. వివరాలిలా ఉన్నాయి.. భూపాల్లిపల్లి –కాళేశ్వరం ప్రాంతంలో ఓ వ్యక్తి అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో అన్నం సేవా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు తమ సిబ్బందితో కాళేశ్వరం మీదుగా బుధవారం ఖమ్మం వెళ్తుండగా.. మతిస్థిమితం లేని వ్యక్తిని గమనించారు. అతనికి భోజనం పెట్టించి భూపాలపల్లి పోలీసుల సమక్షంలో అతన్ని భూపాలపల్లి నుంచి అన్నం ఫౌండేషన్‌ అంబులెన్స్‌లో ఖమ్మం తరలించారు. ఆహారం అందించి, వైద్యం చేయించి అతను కోలుకున్నాక కుటుంబ వివరాలు తెలిస్తే వారికి చట్టపరంగా అప్పగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

మొగుళ్లపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఎన్నికల పోలీంగ్‌కు వచ్చిన పోలీస్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీంగ్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ సిబ్బంది అప్రమంత్తంగా ఉండాలని తెలిపారు. ఏమైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే సంబంధిత ఉన్నతాధికారులకు సమాచా రం అందించాలని తెలిపారు. ఎన్నికల్లో సుమా రు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏ ర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సీఐ మల్లేష్‌, ఎస్సైలు ఆశోక్‌, శ్రావన్‌కుమార్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

ప్రశాంతంగా ఎన్నికలు

నిర్వహించుకోవాలి

రేగొండ: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణకు 150 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వ ద్ద చట్టవ్యతిరేక చర్యలను అరికట్టేందుకు ప్రత్యే క బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తపల్లిగోరిలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌ కుమార్‌ ఎన్నికల బందోబస్తు బాధ్యతలపై అధికారలకు, సిబ్బందికి సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్‌ చట్టం – సెక్షన్‌ 219 ప్రకారం పోలింగ్‌ కేంద్రం, సమీప ప్రాంతాల్లో ప్రచారం చేయడం నిషేధమని తెలిపారు.

రక్షణ సూత్రాలు పాటించాలి
1
1/2

రక్షణ సూత్రాలు పాటించాలి

రక్షణ సూత్రాలు పాటించాలి
2
2/2

రక్షణ సూత్రాలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement