అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
మొగుళ్లపల్లి: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఎస్పీ సంకీర్త్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలీంగ్ స్టేషన్లను బుధవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సందర్శించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.
పోలింగ్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ


