లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
భూపాలపల్లి అర్బన్: వయోవృద్ధుల సంక్షేమం, వారి పరిరక్షణ కోసం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్‌నాయక్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శుక్రవారం జడ్జి దిలీప్‌కుమార్‌నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వయోవృద్ధుల సంక్షేమం, పరిరక్షణ చట్టాన్ని అనుసరిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, ఆర్డీఓ రవి, గవర్నమెంట్ లీడర్ బొట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శ్రీనివాస్, కంప అక్షయ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, న్యాయవాదులు కనపర్తి కవిత, సంగెం రవీందర్ పాల్గొన్నారు.
కాటారంలో..
కాటారం: వయోవృద్ధుల సంక్షేమం, పరిరక్షణ కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఉపయోగపడుతుందని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్.దిలీప్‌కుమార్‌నాయక్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను జడ్జి దిలీప్‌కుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, స్పెషల్ పిపి విష్ణువర్ధన్, అసిస్టెంట్ పీపీ శివకుమార్ పాల్గొన్నారు.


