పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
రేగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని రావులపల్లి శివారులోని పాండవులగుట్టలను సీసీఎఫ్ కాళేశ్వరం ప్రభాకర్, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రాపెల్లింగ్, ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు.
ప్రతాపగిరి గుట్టను సందర్శించిన పీసీసీఎఫ్
కాటారం: కాటారం అటవీశాఖ రేంజ్ పరిధిలోని ప్రతాపగిరి గుట్టను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ శుక్రవారం సందర్శించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బందితో కలిసి కాలినడకన గుట్టపైకి చేరుకున్నారు. గుట్ట చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఏకో టూరిజంగా తీర్చిదిద్దడానికి అనుగుణంగా ఉండే అంశాలపై పీసీసీఎఫ్ జిల్లా అటవీశాఖ అధికారులతో చర్చించారు. నివేదికను తయారు చేసి పంపించాలని ఆదేశించారు. పీసీసీఎఫ్ వెంట కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, ఎఫ్‌డీఓ సందీప్, కాటారం ఎఫ్‌ఆర్‌ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, సెక్షన్, బీట్ అధికారులు ఉన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత


