సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్‌ఎస్
● కండువాలు మార్చిన నాయకులు
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో ద్వితీయ శ్రేణి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్షనేతలు పోటీ పడుతుండడంతో విచిత్ర రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది వ్యక్తులు గురువారం సాయంత్రం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు గురువారం రాత్రి అదే నేతలను తిరిగి బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని పార్టీ కండువా కప్పి ఫొటోలు దిగారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు మళ్లీ వారికే కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఫొటోలు దిగి వారితో నినాదాలు చేయించారు. దీంతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతున్నారో.. ఎవరికి మద్దతు ఇస్తున్నారో అర్థంకాక ఇరుపార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
సాయంత్రం కాంగ్రెస్.. రాత్రి బీఆర్‌ఎస్


