ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఎస్సైతో మాట్లాడుతున్న ఎస్పీ సంకీర్త్
పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ
● కలెక్టర్ రాహుల్ శర్మ
చిట్యాల: మండలంలోని అన్ని గ్రామాలలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ కోరారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించిన సామగ్రిని శనివారం మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో పరిశీలించి మాట్లాడారు. ఆదివారం జరిగే పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులను కోరారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వరి, ఎంపీడీఓ జయశ్రీ, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, ఎంపీఓ రామకృష్ణ, ఏపీఓ హలీంపాషా పాల్గొన్నారు.
శాంతి భద్రతలు కట్టుదిట్టం
చేయాలి: ఎస్పీ సంకీర్త్
ఎన్నికలకు భారీ బందోబస్తు నిర్వహిస్తూ శాంతి భద్రతల పట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సంకీర్త్ అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించాలని అన్నారు. ఇబ్బందులు ఉంటే సంబందిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట సీఐ మల్లేష్, ఎస్సై శ్రావన్‌కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకోవాలి


