పల్లెల్లో చలి పంజా
మంచు తెరలను చీల్చుతూ ఉదయిస్తున్న సూర్యుడు
తెల్లవారుజామున మంచుతో కప్పేసిన పొగమంచు
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో వాతావరణం హీటెక్కింది. మరో వైపు పల్లెల్లో చలి పంజాతో గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి పగటిపూట 28 డిగ్రీలు, రాత్రి పూట 13.5 డిగ్రీలకు తగ్గి చల్లనిగాలులు వీస్తున్నాయి. శనివారం కాళేశ్వరంలో తెల్లవారుజామున మంచుదుప్పటి కప్పేసింది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో చలికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. సాయంత్రం ఆరు దాటితే చలి తీవ్రత పెరగడంతో మూడో విడతలో పల్లెల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రాత్రిపూట ప్రచారాలకు ఆటంకం కలుగుతోంది. – కాళేశ్వరం
పల్లెల్లో చలి పంజా


