రామాలయంలో పారాయణం | - | Sakshi
Sakshi News home page

రామాలయంలో పారాయణం

Dec 22 2025 2:18 AM | Updated on Dec 22 2025 2:18 AM

రామాల

రామాలయంలో పారాయణం

కాళేశ్వరం: ధనుర్మాసం సందర్భంగా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీరామాలయంలో ఆలయ అర్చకులు ఆరుట్ల రామాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురం చొప్పున పారాయణం పఠిస్తున్నారు. ఆదివారం శ్రీసీత సమేత రామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

ఫిట్‌ ఇండియా కార్యక్రమం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా యువజన సర్వీస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఫిట్‌ ఇండియా మిషన్‌ కార్యక్రమానికి జిల్లా కేంద్రంలో నిర్వహించినట్లు డీవైఎస్‌ఓ చిర్ర రఘు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేడ్కర్‌ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు సండేస్‌ ఆన్‌ బైస్కిల్‌ అనే కార్యక్రమం విద్యార్థులతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రఘు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా కోట్‌ శ్రీనివాస్‌, కార్యాలయ సిబ్బంది శివసాగర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

కాటారం: మండలకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలకు చెందిన నిఖిల్‌ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్‌లో తెలంగాణ ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ అండర్‌ 18 పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు తరఫున నిఖిల్‌ అత్యంత ప్రతిభ కనబర్చాడు. దీంతో నిర్వాహకులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ మాధవి తెలిపారు. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 4 వరకు కర్ణాటకలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో నిఖిల్‌ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. గురుకులం విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల ఖోఖో అసోసియేషన్‌ పెద్దపల్లి జిల్లా అద్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి కుమార్‌, ప్రిన్సిపాల్‌ మాధవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటయ్య, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ బలరాం, పీడీ మహేందర్‌, పీఈటీ మంతెన శ్రీనివాస్‌, కోచ్‌ వెంకటేశ్‌ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

24న జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా మోడ్రన్‌ కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పసుల లక్ష్మణ్‌, పక్కల రాజబాబు ఆది వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మల్హర్‌ మండలం ఎడ్లపల్లి మోడల్‌ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్సాహమున్న మహిళలు, పురుషులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. పోటీల్లో పాల్గొనేవారు 85 కేజీలోపు బరువు ఉండాలని సూచించారు. క్రీడాకారులు ఆధార్‌కార్డుతో పాటు కబడ్డీ కిట్‌ను వెంట తీసుకురావాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని ఈ నెల 26నుంచి ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వివరాలకు 86393 46695, 90106 77080 ఫోన్‌నంబర్లను సంప్రదించాలని సూచించారు.

రామాలయంలో పారాయణం
1
1/2

రామాలయంలో పారాయణం

రామాలయంలో పారాయణం
2
2/2

రామాలయంలో పారాయణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement