శాస్త్రితోనే వేదశాస్త్రాలు పరివ్యాప్తం
హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పా టు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో గురు వందనం, గురుచరణ పూజ, సభ నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, పురాణం మహేశ్వరశర్మ, నరసింహామూర్తి, ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, రామకృష్ణ, రమేశ్‌శర్మ, నాగరాజు శర్మ, జాగర్లపూడి శ్రీరామశర్మ, అయ్యప్పశర్మ, ఫణిశర్మ, సాయి సుందరశర్మ, జగన్మోహనశర్మ, ఆర్యవైశ్య నాయకులు తోట నరసయ్య, గట్టు మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ
విశ్వనాథ శాస్త్రి జయంత్యోత్సవం


