వైభవోపేతంగా కల్యాణ మహోత్సవం
భూపాలపల్లి అర్బన్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీకోదండ రామాలయంలో శనివారం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అత్యంత వైభవోపేతంగా, భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదోక్త విధానాలు, ఆగమ శాస్తోక్త్ర నియమాలను అనుసరించి మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణలు, సంప్రదాయ ఆచారాలతో ఈ కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి దివ్య దర్శనం చేసుకొని, కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారి అపార కృపాశీస్సులను పొందారు. భక్తుల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ దేవస్థానానికి చెందిన అర్చక స్వాములు, వేద పండితులు, సిబ్బంది సమన్వయంతో శాస్తోక్త్రంగా కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించారు. ఈ కల్యాణోత్సవంలో జిల్లా ప్రధాన నాయమూర్తి రమేష్‌బాబు, జడ్జిలు నాగరాజు, దిలీప్‌కుమార్, అఖిల, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ఇతర శా ఖల అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


