కల్యాణం కమనీయం
హాజరైన భక్తులు
చిట్యాల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండలంలోని నైన్‌పాక గ్రామం నాపాక ఆలయంలో మంగళవారం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీ సీతారామలక్ష్మణ స్వామి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులు జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఉదయమే అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు. మహిళలు, పిల్లలు కోలాటాలు, భజన ప్రదనర్శలతో పాటు కూచిపూడి నాట్యం చేయడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విజేతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కట్టెకోళ్ల మొండయ్య, సర్పంచ్ నక్క భాస్కర్, ప్రధాన అర్చకులు ప్రభాకరాచార్యులు, రమేష్ చార్యులు, రాకేష్ పాల్గొన్నారు.
దర్శించుకున్న పలువురు ప్రముఖులు
మాజీ ఎమ్మెలే గండ్ర వెంకటరమణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గుమ్మడి శ్రీదేవి–సత్యం, డీసీఓ వాల్యూనాయక్, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ఆర్‌ఐ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ తదితరులు దర్శనం చేసుకున్నారు. కల్యాణాన్ని తిలకించారు.
కోలాటం వేస్తున్న మహిళలు
ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
కల్యాణం కమనీయం
కల్యాణం కమనీయం


