వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
భూపాలపల్లి: జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించుకునే వేడుకలను శాంతియుతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని పేర్కొన్నారు. వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు భంగం కలగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతుందన్నారు. 31వ తేదీ రాత్రి జనవరి 1వ తేదీన జిల్లా కేంద్రం, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్, స్పీడ్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వారి తల్లితండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీసుశాఖ అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు. రోడ్లపై కేక్ కటింగ్‌లు చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్‌లు నిర్వహించడం చట్టప్రకారం నేరమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


