100 రోజులు.. 41.28 టీఎంసీలు | - | Sakshi
Sakshi News home page

100 రోజులు.. 41.28 టీఎంసీలు

Dec 31 2025 7:12 AM | Updated on Dec 31 2025 7:12 AM

100 రోజులు.. 41.28 టీఎంసీలు

100 రోజులు.. 41.28 టీఎంసీలు

100 రోజులు.. 41.28 టీఎంసీలు

నేటినుంచి యాసంగి

పంటలకు సాగునీరు

యాసంగి సాగునీరు సరఫరా వివరాలు ఇలా..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్‌లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు.

నేటి ఉదయం 11 గంటలకు

ఎల్‌ఎండీ నుంచి...

ఉమ్మడి వరంగల్‌లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్‌ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్‌ జిల్లా ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు.

ప్రాజెక్టు మొత్తం ప్రతిపాదించింది నీటి కేటాయింపు

దేవాదుల 4,66,600 1,95,095 11.30

ఎస్పారెస్పీ 2,29,623 1,57,038 12.88

(బిలో ఎల్‌ఎండీ)

ఎస్సారెస్పీ–2 96,671 83,039 6.82

చీఫ్‌ ఇంజినీరు ములుగు సర్కిల్‌ పరిధిలో

ఎల్‌ఎండీ నుంచి సరఫరాకు

ఇరిగేషన్‌ శాఖ సన్నద్ధం

వారబందీ పద్ధతి అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement