పర్సనల్ మేనేజర్‌కు సన్మానం
భూపాలపల్లి అర్బన్: ఏరియా పర్సనల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్యాంసుందర్‌ను మంగళవారం సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు సన్మానించారు. జీఎం కార్యాలయంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ లైసన్ అధికారి భూక్య మోహన్, బ్రాంచ్ కార్యదర్శి హేమనాయక్, నాయకులు సికిందర్‌సింగ్, రాములు, శ్రీనివాస్, రవికుమార్, శోభన్, బలరాం, రమేష్, శ్రీను పాల్గొన్నారు.
ఎస్టీ లైజన్ అధికారిగా భూక్య మోహన్
ఏరియా సింగరేణి ఎస్టీ లైజన్ అధికారిగా భూక్య మోహన్‌ను నియామకమయ్యారు. జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రావు ద్వారా నియామక పత్రాన్ని అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమానికి ముందుంటానని, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు ఏరియా అఽధికారులతో మాట్లాడుతానన్నారు.


