రెండోసారి పైచేయి
2వ దఫా ఎన్నికల్లోనూ అధికార పార్టీదే హవా
రెండో విడత సర్పంచ్‌లు వీరే..
ఎన్నికల మరిన్ని వార్తలు
9లో..
8లో..
భూపాలపల్లి: రెండో విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మోగించింది. ఏకగ్రీవాలతో పాటు అత్యధిక సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంది. రెండో స్థానంలో బీఆర్‌ఎస్ నిలువగా, మూడో స్థానంలో స్వతంత్రులు నిలిచారు.
46 స్థానాల్లో కాంగ్రెస్..
జిల్లాలోని భూపాలపల్లి, పలిమెల, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని 85 గ్రామ పంచాయతీలకు రెండో దఫా ఎన్నికలు జరిగాయి.ఇందులో 10 స్థానాలను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంతో చేజిక్కించుకున్నారు. మిగిలిన 75 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 36మంది, బీఆర్‌ఎస్ 30మంది, బీజేపీ ఇద్దరు, స్వతంత్రులు ఏడుగురు గెలుపొందారు.
పలిమెల మండలం కాంగ్రెస్ వశం..
పలిమెల మండలంలో 8 గ్రామ పంచాయతీలు ఉండగా పలిమెల మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా మిగిలిన ఏడు పంచాయతీల్లో ఆరు కాంగ్రెస్, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
2 ఓట్ల తేడాతో విజయం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మండలం పెద్దాపూర్ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు మూ ల స్రవంతి కాంగ్రెస్ రెబల్ మద్దతుదారు ముక్కెర సునీతపై రెండు ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, బంధువులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.
ఐదు ఓట్ల తేడాతో..
టేకుమట్ల: మండలంలోని ఆశిరెడ్డిపల్లి సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి జక్కుల కుమారస్వామి 5 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ మద్దతుదారుపై విజయం సాధించారు. బీఆర్‌ఎస్ మద్దతుదారు వెలిశెట్టి సురేష్‌కు 179 ఓట్లు రాగా.. జక్కుల కుమారస్వామికి 184 ఓట్లు వచ్చాయి.
భూపాలపల్లి
చిట్యాల
పలిమెల
టేకుమట్ల
12 13 0 1
15 10 1 0
7 0 0 1
12 7 1 5
కాంగ్రెస్
బీఆర్‌ఎస్
బీజేపీ
ఇతరులు
ఏకగ్రీవంతో కలిపి ఎవరికి ఎన్ని
10 సర్పంచ్ స్థానాల ఏకగ్రీవంతో పాటు 36 స్థానాల్లో గెలుపు
బీఆర్‌ఎస్‌కు 30, బీజేపీకి 2, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం
రెండోసారి పైచేయి
రెండోసారి పైచేయి
రెండోసారి పైచేయి
రెండోసారి పైచేయి


