వాహనాలు కనిపించట్లే..
మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి–పర్లపల్లి బీటి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో రోడ్డు వెంట ప్రయాణించే ప్రయాణికులు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా గుంతలను పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
– మొగుళ్లపల్లి
మొగుళ్లపల్లి మండల కేంద్రం నుంచి బంగ్లాపల్లి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా భారీగా చెట్లు ఉన్నాయి. బంగ్లాపల్లి, వేములపల్లి గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట భయపడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని కోరుతున్నారు.
– మొగుళ్లపల్లి
గోవిందరావుపేట: పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సులో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. మూడు రోజులు క్రిస్మస్ సెలవులు రావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో లక్నవరం జలాశయం కిటకిటలాడింది.
వాహనాలు కనిపించట్లే..
వాహనాలు కనిపించట్లే..
వాహనాలు కనిపించట్లే..


