అంగన్‌వాడీలకు మరుగుదొడ్లు
జిల్లాలో ఇలా..
పంచాయతీ తీర్మానం..
మద్దులపల్లి పంచాయతీ భవనంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ
కాళేశ్వరం: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఒంటికి, రెంటికి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చిన్నారులకు ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో నిర్మాణాలను చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. స్వచ్ఛభారత్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం నిధులను వినియోగించాలని ఆదేశించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.52 వేలు వెచ్చించనున్నారు. ఇందులో కేంద్రం వాటా 70 శాతం (రూ.36,600), రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం (రూ.15,600) నిధులను సమకూర్చనున్నారు. దీంతో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. స్కూల్ కాంప్లెక్సుల్లో నిర్వహించే కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్, ఐసీడీఎస్ ద్వారా ఇతర చోట్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని అధికారుల ద్వారా తెలిసింది.
అందరికీ ఇబ్బందే..
జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక చిన్నారులు ఆరు బయటకు వెళ్తున్నారు. కేంద్రాలకు వచ్చిన గర్భిణులు, బాలింతలు, టీచర్లు, ఆయాలు కూడా ఒంటికి, రెంటికి వెళ్లాలంటే అవస్థలు తప్పడంలేదు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న నిధుల ద్వారా నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో అన్ని కేంద్రాల్లో అందరికీ ఇబ్బందులు తప్పనున్నాయి.
మండలాలు 12
ఐసీడీఎస్ ప్రాజెక్టులు భూపాలపల్లి,
మహదేవపూర్
అంగన్‌వాడీ కేంద్రాలు 644
పక్కా భవనాలు 186
అద్దె భవనాలు 244
ప్రభుత్వ భవనాల్లో
కొనసాగుతున్నవి 214
టీచర్లు 604
టీచర్ల ఖాళీలు 40
ఆయాలు 524
ఆయాల ఖాళీలు 120
చిన్నారులు 22,079
మూడేళ్లలోపు పిల్లలు 11,973
మూడు నుంచి
ఐదేళ్లలోపు పిల్లలు 9,691
గర్భిణులు 2,591
బాలింతలు 1,696
గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఎంపీడీఓకు దరఖాస్తు చేయాలి. పలానా అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు అవసరమని తీర్మానం చేయాలి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వచ్చిన ప్రతిపాదనలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపిస్తారు. వాటిని కలెక్టరుకు పంపిస్తే పరిశీలించి మంజూరు చేస్తారు. పనులను ప్రతీ దశలో ఫొటో తీసి పంపాల్సి ఉంటుంది. వాటిని ఎంపీడీఓలు తనిఖీచేసి కలెక్టర్‌కు పంపితే నిధులు విడుదల చేస్తారు. ఈ విషయమై డీడబ్ల్యూఓ మల్లీశ్వరిని ఫోన్‌ద్వారా సంప్రదించగా.. డీఆర్‌డీఏ ద్వారా స్కూల్ కాంప్లెక్సుల్లో నిర్వహించే అంగన్‌వాడీలకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరయ్యాయి. ఐసీడీఎస్ ద్వారా 150 వరకు కేంద్రాలను గుర్తించాం. 64 మరుగుదొడ్లకు మంజూరు చేశారని, 47కు మంజూరు రావాల్సి ఉందన్నారు.
నిధులు మంజూరుచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఒంటికి, రెంటికి
తప్పనున్న ఇబ్బందులు
తీరనున్న అంగన్‌వాడీల కష్టాలు
అంగన్‌వాడీలకు మరుగుదొడ్లు


