జయశంకర్ భూపాలపల్లి
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శం
7
భూపాలపల్లి రూరల్: ఏసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మంజూరునగర్‌లోని కల్వరి చర్చిలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్‌కట్‌చేసి వేడుకలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమఅధికారి మల్లీశ్వరి, పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్, పాస్టర్లు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి


