మరింత లాభాల్లోకి తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

మరింత లాభాల్లోకి తీసుకురావాలి

Dec 24 2025 4:04 AM | Updated on Dec 24 2025 4:04 AM

మరింత

మరింత లాభాల్లోకి తీసుకురావాలి

మరింత లాభాల్లోకి తీసుకురావాలి

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి సంస్థను అధికారులు, కార్మికులు నిరంతరం శ్రమించి మరింత లాభాల్లోకి తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులకు సకాలంలో వేతనాలు అందిస్తూ వారి ఆరోగ్యం, సంక్షేమ పట్ల ప్రత్యేక దృష్టిసారిస్తుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని మాదిరిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా లాభాల బోనస్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాలతో పాటు స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కార్మికుడు 8గంటల పాటు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సంస్థపైన ఉందన్నారు. పట్టణంలో మున్సిపాలిటీతో కలిసి కోతులు, కుక్కల బెదడను నివారించాలని కోరారు. సీఎస్‌ఆర్‌ నిధులతో ఈ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు చేపట్టాలన్నారు.

ఏరియాలో 100లక్షల టన్నుల టార్గెట్‌

భవిష్యత్‌కాలంలో ఏరియాలో 100లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలో ప్రతీ ఏడాది బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో తాడిచెర్ల ఓసీ–2, వెంకటాపూర్‌ పీవీఎన్‌ఆర్‌ ప్రాజెక్ట్‌, భూపాలపల్లిలో ఓసీపీ–1 కింది భాగంలో అండర్‌గ్రౌండ్‌ ఏర్పాటు, ఓసీపీ–2 విస్తీర్ణతతో ఏరియాకు మరో వంద సంవత్సరాల భవిష్యత్‌త్‌ ఉందన్నారు. యాజమాన్యం బొగ్గు ఉత్పత్తితో ఇప్పటికి విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతుందని, సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కుడా సింగరేణి విస్తరించిందన్నారు. కర్ణాటకలో త్వరలో బంగారం, కాపర్‌ వెలికితీతకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీఎం కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జీఎం రాజేశ్వర్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జీఎం సింగరేణి పతాకావిష్కరణ చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులతో కలిసి వారు వేదికపై కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఉత్తమ అధికారులు, కార్మికులకు బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏరియా సేవ అధ్యక్షురాలు సునీతరాజేశ్వర్‌రెడ్డి, అధికారులు కవీంద్ర, జోతి, రవికుమార్‌, నజీర్‌, ఎర్రన్న, శ్యాంసుందర్‌, ప్రాతినిధ్య సంఘాల నాయకులు మధుకర్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో

ఎమ్మెల్యే సత్యనారాయణరావు

మరింత లాభాల్లోకి తీసుకురావాలి1
1/2

మరింత లాభాల్లోకి తీసుకురావాలి

మరింత లాభాల్లోకి తీసుకురావాలి2
2/2

మరింత లాభాల్లోకి తీసుకురావాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement