జిమ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సీఈఆర్ కబ్ల్‌లో ఏర్పాటు చేసిన నూతన జిమ్ సెంటర్‌ను కార్మికులు, కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్‌ను మంగళవారం జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు వేసినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థ అభివృద్ధికి మూలాధారమని తెలిపారు. శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, పని సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే ఆధునిక వసతులతో జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉద్యోగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవ అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు కవీంద్ర, జోతి, ఎర్రన్న, రవికుమార్, శ్యాంసుందర్, రమేశ్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్
రాజేశ్వర్‌రెడ్డి


