బందోబస్తులో సమస్యలు రావొద్దు
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: పోలీసు బందోబస్తు విషయంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎం.టీ(పార్క్)విభాగం, డాగ్ స్క్వాడ్ యూనిట్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రికార్డులు, రోజువారీ మెయింటనెన్స్ రిజిస్టర్, ఫ్యూయల్ వినియోగ వివరాలు, వాహనాల స్థితిగతుల గురించి సమగ్రంగా పరిశీలించారు. బందోబస్తు బాధ్యతల్లో వాహనాలకు సమస్యలు లేకుండా పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డాగ్ స్క్వాడ్ విషయంలో కేనైన్‌ల ఆరోగ్య పరిస్థితి, ట్రెయినింగ్ రికార్డులు, స్పందన సామర్థ్యం, విభాగం పనితీరు, పరికరాల లభ్యతను పరిశీలించి యూనిట్‌ను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంకీర్త్ ఆదేశించారు.


