మేడారంలో భక్త జనసందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛతీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్యాప్ కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహఫంక్తి భోజనాలు చేసి సందడి చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మొదలైన భక్తుల తాకిడి సాయంత్రం వరకు కొనసాగింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కిటకిటలాడారు. భక్తుల రద్దీ పెరగడంతో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సమ్మక్క గద్దె వద్ద భారీకెడ్లను ఏర్పాటు చేసి భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపించారు. వేలాది మంది ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వద్దకు వచ్చే దారిలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలకు పోలీసులు వాహనాలను మళ్లీంచారు.
జాతరలా తరలివచ్చిన భక్తులు
వేలాదిగా వచ్చిన ప్రైవేట్ వాహనాలు
కోలాహలంగా గద్దెల ప్రాంగణం
మేడారంలో భక్త జనసందడి
మేడారంలో భక్త జనసందడి


