పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
కాటారం: ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా కొనసాగించడానికి పోలింగ్ స్టేషన్‌లకు కేటాయించిన పీఓ, ఏపీఓలు, సిబ్బంది కృషి చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ తెలిపారు. కాటారం మండలకేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో శుక్రవారం ఎన్నికల విధులపై పీఓ, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు, ఓటింగ్, కౌంటింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్ పోలింగ్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ మాట్లాడుతూ పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఎంపీఓ వీరస్వామి, పీఓ, ఓపీఓలు పాల్గొన్నారు.
మహాముత్తారంలో..
మహాముత్తారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల విధులు, నిర్వహణపై అధికారులు పీఓ, ఓపీలకు అవగాహన కల్పించారు. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని అభ్యంతరాలకు తావివ్వవద్దని వివరించారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ


