సా..గుతున్న చిన్న కాళేశ్వరం పనులు..
కాటారం సబ్ డివిజన్‌లోని పంట పొలాలకు సాగునీరు అందించాలనే సదుద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నేటికీ పూర్తి కావడం లేదు. రూ.499 కోట్ల వ్యయంతో 2008 సెప్టెంబరు 19న ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు రూ.370 కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులను పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 4.5 టీఎంసీల నీటిని తరలించి 45,280 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పటికీ భూసేకరణలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.
సా..గుతున్న చిన్న కాళేశ్వరం పనులు..


