ఉమ్మడి జిల్లాలో ‘చెయ్యె’త్తిన ఓటర్లు
మొదటి విడతలో ఏకగ్రీవం ఇలా..
మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారుల ఆధిక్యం
సాక్షిప్రతినిధి, వరంగల్ :
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారులకు జైకొట్టారు. రాత్రి 11 గంటలకు ఏకగ్రీవాలు కలిపి 555 గ్రామ పంంచాతీల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 333 కాంగ్రెస్ మద్దతుదారులు, 148 బీఆర్‌ఎస్, 17 బీజేపీ, ఒకటి సీపీఐ మద్దతుదారులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. 56 చోట్ల రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, వారిని సైతం పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు
ఉదయం 9 గంటల నుంచి పోటెత్తిన ఓటర్లు మధ్యాహ్నం వరకు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. పోలింగ్ సమయం 1 గంట దాటినా.. చాలాచోట్ల మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. మెజారిటీ గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల
ఓట్లు లెక్కించారు. రాత్రి 11 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి వరంగల్‌లో మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 53 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 502 పంచాయతీలకు పోలింగ్, కౌంటింగ్ జరిగింది.
జిల్లా గ్రామాలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం ఆదర్స్
హనుమకొండ 69 33 19 08 01 08
వరంగల్ 91 63 24 – – 04
జేఎస్ భూపాలపల్లి 82 50 20 04 – 08
ములుగు 48 36 11 – – 01
జనగామ 110 64 26 – – 20
మహబూబాబాద్ 155 87 48 05 – 15
555 333 148 17 01 56
మొదటి విడతలో హనుమకొండ జిల్లాలో 69 పంచాయతీలకు గాను ఐదు జీపీలు ఏకగ్రీవం కాగా 4 గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. ఒక ఊరిలో సర్పంచ్ మాత్రమే అయ్యారు.
వరంగల్ జిల్లాలో 91 గ్రామ పంచాయతీలకు 11 జీపీలు ఏకగ్రీవమయ్యాయి.
ములుగు జిల్లాలో 48 గ్రామ పంచాయతీలకుగాను 9, జనగామ జిల్లాలో 110 గ్రామ పంచాయతీలకు గాను 10 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు.
జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 82 గ్రామ పంచాయతీలకు గాను 9 పంచాయతీలు, మహబూబాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకుగాను 9 ఏకగ్రీవం అయ్యాయి.
రెండో స్థానంలో బీఆర్‌ఎస్...
56 మంది ఇతరుల విజయం
స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మంతనాలు


