వాహనాల దారి మళ్లింపు
ములుగు రూరల్: మల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై వంతెన మరమ్మతు పనుల్లో భాగంగా నేడు(శుక్రవారం) వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు మల్లంపల్లి వంతెన మీదుగా వాహనాల రాకపోకలు నిలిపి వేస్తున్నట్లు వివరించారు. లారీలు, ట్రక్కులు, వ్యాన్లు, గూడెప్పాడు–పరకాల– రేగొండ–జంగాలపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఫ్రీకాస్ట్ గ్రిడర్ల ఏర్పాటుకు భారీ క్రేన్‌లతో పనులు చేపడుతున్న కారణంగా వాహనాలను దారి మళ్లించినట్లు కలెక్టర్ వివరించారు.


