పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
– 10,11లోu
గణపురం: మెదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, గాంధీనగర్‌లో సీఎస్‌ఐ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నాదా..లేదా.. అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా నిష్పక్షపాతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
రేగొండ: మండలంలోని పలు గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాలను గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కేంద్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, తహసీల్దార్ శ్వేత పాల్గొన్నారు.
మరిన్ని ఫొటోలు, వార్తలు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్


