85.25 శాతం
23,921
83.24
భూపాలపల్లి 28,737
రెండో విడతలో పోటెత్తిన ఓటర్లు
● ఉదయం 9గంటల నుంచి 11 గంటల మధ్య పెరిగిన పోలింగ్ శాతం
24,068
84.55
చిట్యాల28,466
4,015
86.38
పలిమెల4,648
భూపాలపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
9 గంటలకు పెరిగిన పోలింగ్..
జిల్లాలోని భూపాలపల్లి, పలిమెల, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయినప్పటికీ తొలుత పోలింగ్ అంతంత మాత్రంగానే జరుగగా.. 9 గంటల నుంచి 11 గంటల వరకు ఊపందుకుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 26.40 శాతం.. 9 గంటల నుంచి 11 గంటల వరకు 62.37, పోలింగ్ ముగిసే సమయం ఒంటిగంట వరకు 85.25 శాతం నమోదైంది. మహిళల ఓటింగ్ 84.65 శాతం నమో దు కాగా.. పురుషుల శాతం 85.89 నమోదైంది.
టేకుమట్ల మండలంలో అధిక శాతం..
జిల్లాలోని నాలుగు మండలాల్లో ఎన్నికలు జరుగగా భూపాలపల్లి మండలంలో 83.24 శాతం పోలింగ్ నమోదు కాగా, టేకుమట్ల మండలంలో అధికంగా 88.72 శాతం నమోదైంది.
అత్యధికంగా కలికోటలో 91.88 శాతం
చిట్యాల మండలం వరికోల్‌పల్లిలో 93 శాతం, టేకుమట్ల మండలం కలికోట జీపీలో అత్యధికంగా 94.4 శాతం పోలింగ్ నమోదైంది.
18,522
88.72
టేకుమట్ల20,877
పోలైన ఓట్లు
పోలింగ్ శాతం
85.25 శాతం
85.25 శాతం
85.25 శాతం
85.25 శాతం


