నేటితో మూడో విడత ప్రచారానికి తెర
సబ్ డివిజన్‌లో ఇలా..
కాటారం
మహాముత్తారం
మహదేవపూర్
మల్హర్
106
93
56
42
15
237
18
47
39
347
14
24
39
388
465
కాళేశ్వరం: మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్‌డివిజన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. మూడో విడతలో మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 12 రోజులుగా హోరెత్తిన ప్రచారం నేడు (సోమవారం) సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది. 81 పంచాయతీల్లో 297 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. మల్హర్ మండలంలో దుబ్బపేట, చిన్నతూండ్ల జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. 79పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీ నేతలు గ్రామాలను చుట్టేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ర్యాలీలు, సమావేశాలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అధికారులు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో 10 మద్యం దుకాణాలు బంద్ చేయడానికి ఎకై ్సజ్‌శాఖ సిద్ధమైంది. ఇప్పటికే గ్రామాల్లో రహస్యంగా మద్యం డంపింగ్, స్టాక్ తరలింపుతో పోరు మరింత వేడెక్కింది.
నేటితో ముగింపు..
సోమవారం సాయంత్రం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార నిషేధం అమల్లోకి రానుండడంతో అభ్యర్థులకు మద్దతుగా పలువురు జిల్లా స్థాయి నాయకులు తిరుగుతూ అభివృద్ధి హామీలు ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వతంత్రులు ప్రజల వద్దకు వెళ్లి తమ తరఫున నిలిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతిచోట పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తోంది. ఆటోలు, ఇతర వాహనాలకు మైకుల మోతతో దద్దరిల్లిన గ్రామాలు నిశబ్ద ప్రచారం, ప్రలోబాలు మొదలు పెట్టనున్నారు.
నేడు మద్యం దుకాణాలు బంద్
కాటారం సబ్‌డివిజన్‌లోని 10 మద్యం దుకాణాలను బంద్ చేయడానికి ఎకై ్సజ్‌శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 17న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ పూర్తయి విజేతలకు ధృవపత్రాలు అందించే వరకూ వైన్‌షాపులు మూసి ఉంచాలి. ప్రచార సమయంలో చివరి రెండు రోజులు కీలకం కావడంతో కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్యం డంపింగ్ చేశారు. 90ఎంఎల్, క్వార్టర్లు, ఆఫ్, ఫుల్ బాటిళ్లు భారీగా స్టాక్ చేసుకుని, పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
హోరాహోరీగా ర్యాలీలు, ఊరేగింపులు
నాలుగు మండలాల్లో 79 జీపీలు, బరిలో 297 మంది సర్పంచ్ అభ్యర్థులు
మల్హర్ మండలంలో ఇద్దరు సర్పంచ్‌లు ఏకగ్రీవం
నేడు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాల బంద్
నేటితో మూడో విడత ప్రచారానికి తెర
నేటితో మూడో విడత ప్రచారానికి తెర


