నిట్‌లో వర్క్‌షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్ శిరీష్ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్‌పూర్ పాల్గొన్నారు.
కుష్ఠువ్యాధి నిర్మూలనకు
పాటుపడాలి
ములుగు రూరల్: కుష్ఠువ్యాధి నిర్మూలనకు పాటుపడాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిగ్రస్తుల గుర్తింపుపై వైద్య సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఐకమత్యంతో పనిచేసి జిల్లాను కుష్ఠ్టువ్యాధి రహిత జిల్లాగా మార్చాలని సూచించారు. కుష్ఠువ్యాధిపై సమాజంలో మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్చంధ సంస్థలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.


