breaking news
Vizianagaram
-
మరీ ఇంత అన్యాయమా..!
కూటమి నాయకులను కలిస్తేనే... ముకుందపురం గ్రామానికి చెందిన 11 మంది వివిధ పింఛన్లకు అర్హులుగా ఉన్నారు. ఇందుకోసం ఐదు రోజుల కిందటే సచివాలయానికి దరఖాస్తుతో పాటు అన్ని వివరాలు అందజేశారు. కాని ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు. కూటమి నాయకులను కలిస్తేనే ఆన్లైన్ చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. – గడే రామారావు, వైఎస్సార్సీపీ నాయకుడు, ముకుందపురంసంతకవిటి: అర్హులైన వారందరూ కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు గడువు తక్కువగా ఇచ్చి, లేనిపోని నిబంధనలు పెట్టినప్పటికీ అర్జీదారులు అష్టకష్టాలు పడి దరఖాస్తులను ఆన్లైన్ చేయించుకునే పనిలో ఉన్నారు. అయితే మండలంలోని మోదుగులపేట సచివాలయ సిబ్బంది మాత్రం అర్జీదారుల దరఖాస్తులను ఆన్లైన్ చేసే పనిలో మెతకవైఖరి కనబరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయ పరిధిలోని ముకుందపురానికి చెందిన 11 మంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల దరఖాస్తులను శుక్రవారం సాయంత్రం వరకు ఆన్లైన్ చేయలేదు. శనివారం సెలవు రోజు అయినప్పటికీ పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ సచివాలయానికి వచ్చి కొందరి దరఖాస్తులను ఆన్లైన్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ముకుందపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు గడే రామారావు, గడే మల్లేశ్వరరావు, తదితరులు సచివాలయానికి చేరుకుని, తమవారి దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేయాలని పట్టుబట్టారు. దీంతో డిజిటల్ అసిస్టెంట్ స్పందిస్తూ.. మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మాకు ఫోన్లు వస్తున్నాయని రుసురుసలాడారు. దీంతో నాయకులు స్పందిస్తూ వైఎస్సార్సీపీ మద్దతుదారులైనంత మాత్రాన వారి దరఖాస్తులను ఆన్లైన్ చేయరా అని ప్రశ్నించారు. గడే త్రినాథ, సూర్యారావు, పాపినాయుడు, కురిటి పారయ్య, కురిటి రమణ, పిన్నింటి తవుడు, గడే తవిటినాయుడు, కురిటి కళావతి, లోలుగు విజయకుమారి, కురిటి రామలక్ష్మి, గడే జ్యోత్స్నలకు సంబంధించిన దరఖాస్తులను ఎందుకు ఆన్లైన్ చేయరో చెప్పాలని కార్యదర్శిని నిలదీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేయడంతో కార్యదర్శి స్పందిస్తూ.. మంగళవారం నాడు అందరి దరఖాస్తులూ ఆన్లైన్ చేయిస్తానని చెప్పడంతో అర్జీదారులు, వైఎస్సార్సీపీ నాయకులు శాంతించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి భవానీశంకర్ వద్ద ప్రస్తావించగా.. సర్వర్ డౌన్ అవ్వడంతో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని, మంగళవారం నాటికి అన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పింఛన్ దరఖాస్తులు ఆన్లైన్ చేయని వైనం కూటమి నాయకులను కలిస్తేనే చేస్తామంటున్న సిబ్బంది నిలదీసిన వైఎస్సార్సీపీ నాయకులు -
పణుకువలస వంతెనపై.. వాహన రాకపోకలు బంద్
● వంతెనకు ఇరువైపులా గోడల నిర్మాణం ● శిథిలమైన వంతెనను పరిశీలించిన ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు తెర్లాం: రాజాం – రామభద్రపురం ఆర్అండ్బీ రోడ్డులో మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను శనివారం ఉదయం నుంచి ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు పూర్తిగా నిషేధించారు. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వంతెనను మండల ఆర్అండ్బీ ఏఈ రాజు తన సిబ్బందితో పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వంతెన పైనుంచి రాకపోకలు సాగించే వాహనాలు వెళ్లకుండా పూర్తిగా బంద్ చేశారు. వంతెన పైనుంచి వాహనాలు రాకుండా ఉండేలా వంతెనకు ఇరువైపులా రోడ్డు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టారు. వంతెన మీదుగా వాహనాలు, ప్రయాణికులు వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీస్ అధికారులు వంతెనకు రెండు వైపులా స్టాఫర్లు, ఇసుకతో నింపిన డ్రమ్ములు ఏర్పాటు చేశారు. -
21 వరకు మద్యం దుకాణాలకు రెన్యువల్ గడువు
విజయనగరం రూరల్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ ఈ నెల 21 వరకు చేపట్టనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బొగ్గులదిబ్బ వద్దనున్న పట్టణ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో మద్యం లైసెన్స్‌దారులతో దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఈ ఏడాది మద్యం దుకాణాల రెన్యువల్‌కు ప్రభుత్వం జీవో 579 జారీ చేసిందని వివరించారు. ఈ జీవోను అనుసరించి జిల్లాలో ఓపెన్ కేటగిరి, గీత కార్మికులకు సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 153 మద్యం దుకాణాలు ఉండగా, గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 50 వేల జనాభా కలిగిన ప్రాంతాల్లోని 17 ఓపెన్ కేటగిరి మద్యం దుకాణాలకు వార్షిక రుసుం రూ. 60.50 లక్షలు, ఆర్ఈటీ రెన్యూవల్ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.88.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 136 ఓపెన్ కేటగిరి దుకాణాలకు వార్షిక ఫీజు రూ.71.50 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని గీత కులాల మద్యం దుకాణాలకు జనాభా ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించినట్టు తెలిపారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు వార్షిక ఫీజు రూ.30.30 లక్షలు, ఆర్ఈటీ రెన్యువల్ ఫీజు రూ.11.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షలలోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 14 దుకాణాలకు వార్షిక ఫీజు రూ.35.80 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.13.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.56.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత లైసెన్స్‌దారులు ఈ నెల 21లోపు రెన్యువల్ చేసుకోవాలని ఆయన తెలిపారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 30న లాటరీ విధానం ద్వారా అర్హులైన వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను లైసెన్స్‌దారులు పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి ఎస్.దొర, జిల్లాలోని వివిధ స్టేషన్ల సీఐలు, ఏ – 4 దుకాణాల లైసెన్స్‌దారులు పాల్గొన్నారు. -
ప్రతీ స్థానంలో పోటీచేద్దాం.. విజయపతాకం ఎగురవేద్దాం
విజయనగరం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైఎస్సార్సీపీ శ్రేణులంతా సన్నద్ధం కావాలని, ప్రతి స్థానంలో పోటీ చేసి విజయపతాకం ఎగురవేద్దామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలోని పూలబాగ్ జగన్నాథ ఫంక్షన్ హాల్లో శనివారం వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రానున్న రోజుల్లో పార్టీ పటిష్టత, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోతం, నూతనంగా నియామకమైన పార్టీ కమిటీలు అనుసరించాల్సిన విధి, విధానాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు దివంగతముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులకు పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డులను అందజేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి హర్షవర్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శోభా హైమావతి, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గొర్లె రవికుమార్, శంబంగి వేణుపాల్, సంగంరెడ్డి బంగారునాయుడు, పార్టీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు ఆవినాష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, జిల్లా పింఛన్ల విభాగం అధ్యక్షుడు డోలా మన్మథకుమార్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు పతివాడ కృష్ణవేణి, పార్టీ నాయకులు వేచలపు చినరామునాయుడు, రొంగలి జగన్నాథం, గులుపల్లి గణేష్, పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, తదితరులు పాల్గొన్నారు. పార్టీయే ప్రధానం రాజకీయాల్లోకి వ్యక్తులు వస్తుంటారు.. వెళ్లిపోతుంటారు. పార్టీయే ప్రధానంగా ప్రజల కోసం పనిచేద్దాం. వక్రబుద్ధితో వ్యాపారాలు, వ్యవహారాలు నడిపితే కొంపముంచుకున్న వారిగా మిగులుతారు. విలువలు కోల్పోయి, నైతికంగా దిగజారిపోతే ఎంతటికై నా తెగిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరం. పార్టీ ఇచ్చేది గుర్తింపు కార్డు కాదు.. నాయకులకు భరోసా. రాష్ట్రంలో జరుగుతున్న దురాగత పాలనను ఎదుర్కొనేందుకు జగనన్న సైనికులుగా గట్టిగా నిలబడదాం. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో జగనన్న సైన్యంగా చేరడం శుభపరిణామం. సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అందరికీ సమాజంలో మంచి గుర్తింపు లభించేలా సముచిత స్థానం కల్పిస్తారు. జిల్లా స్థాయి సమావేశానికి వచ్చిన వారంతా పార్టీపై నమ్మకంతో వచ్చిన వారే. స్థానిక సంస్థల్లో అభ్యర్థుల ఎంపిక అందరి ఆమోదంతో చేయాలి. రెండున్నరేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనను ప్రజలకు వివరించాలి. పింఛన్ల దరఖాస్తుల నమోదులో వివక్షపై ప్రచారం చేయాలి. చంద్రబాబు తన ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తారే తప్ప ప్రజాసంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోరు. ఆయన పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే మనల్ని విజేతలుగా నిలుపుతుంది. – బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్షనేత ‘స్థానిక’ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు జిల్లా వ్యాప్తంగా జగనన్న సైనికులకు గుర్తింపు కార్డులు అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీలోని సభ్యులకు సముచిత స్థానం శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
● 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైంది
● చంద్రబాబుది మోసపూరిత పాలన ● పట్టుదలతో పని చేయాలి ● పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం చంద్రబాబు ప్రభుత్వంలో వెనుకబడిన గిరిజనుల సంక్షేమం పట్టకుండా పోయింది. రెండున్నరేళ్లలో ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఏమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడదాం. వారి సమస్యలపై పోరాటం చేద్దాం. వెన్నుపోటు పార్టీ చేస్తున్న మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరిద్దాం. స్థానిక ఎన్నికల్లో విజయం దక్కించుకుందాం. – పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు ముఖ్యమంత్రి చంద్రబాబుది మోసపూరిత పాలన. సూపర్‌సిక్స్ అట్టర్‌ప్లాప్ అయ్యింది. రెండున్నరేళ్లుగా పింఛన్లు లేవు. నిరుద్యోగ భృతిలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500 ఇవ్వడంలేదు. బియ్యం, నిత్యవాసరాల ధరలు పెరిగిపోయాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, పార్టీని గెలిపించుకుందాం. – కోలగట్ల వీరభద్రస్వామి, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మోసకారి పాలనకు అడ్డుకట్ట వేయడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకంగా తీసుకోవాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలి. ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం కావాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలి. – శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి 2029 ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హమీలు, అసత్య ప్రచారాల కారణంగా ఓటమి పాలయ్యాం. గతంలో ఇలాంటి పరిస్థితిని చూశాం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఏకతాటిపై పని చేద్దాం. బొత్స సత్యానారాయణ నాయకత్వంలో వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం. – కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్.కోట మోసపూరిత హమీలతో కూటమి నేతలు గద్దెనెక్కారు. వాటిని అమలు చేయకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నడుచుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిక్కడు దొరకుడు అన్న చందంగా తిరుగుతున్నారు. నారా లోకేశ్ రక్తచరిత్ర చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసగాళ్లగే మోసగాడులా పాలన సాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒట్టేసిఒక మాట ఓట్టేయకుండా ఓ మాట చెప్పనన్న చందంగా పాలన సాగిస్తే... కూటమినేతలు ఇచ్చిన హమీలను విస్మరించి పాలన సాగిస్తున్నారు. – డాక్టర్ తలే రాజేష్, నియోజకవర్గ సమన్వయకర్త, రాజాం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పాలనను, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో తేడాలను ప్రజలకు వివరించాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇచ్చిన హమీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ పబ్బంగడుపుతోంది. ప్రజలంతా వైఎస్సార్‌షీపీ వైపే చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో పార్టీకి పూర్వవైభం తీసుకొద్దాం. – డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్సీ ఏ రంగంలోనైనా గెలుపు ఇచ్చే గౌరవం వెలకట్టలేనిది. ప్రధాన రాజకీయాల్లో విజయం సాధించిన వారికి దక్కే గౌరవ మర్యాదలు చెప్పనక్కర్లేదు. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలకు ఆయా స్థాయిల్లో అధికారులు, ప్రజలు మర్యాద ఇస్తారు. అది సాధించుకోవాలంటూ కష్టపడి పనిచేయాలి. స్థానిక సమరానికి సన్నద్ధం కావాలి. కూటమి ప్రభుత్వం మోసాలను, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. – బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నెల్లిమర్ల బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పని చేస్తోన్న వైఎస్సార్సీపీలో రానున్న రోజుల్లో కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాం. ఇప్పుడు నియమించిన గ్రామ కమిటీల్లోని సభ్యులతోనే పాలన సాగుతుంది. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ఏకై క లక్ష్యం కావాలి. ప్రజల కూడా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారు. ఓటుతో తమ వ్యతిరేకతను చూపిస్తారు. – బొత్స అప్పనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం -
ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ
● ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో వక్తలువిజయనగరం: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన ఆరో జిల్లా మహాసభలు శనివారం జరిగాయి. ఇందులో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిజం వృత్తి సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు సాధించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ ముందుంటుందన్నారు. డీపీఆర్ఓ పి.గోవిందరాజులు, రాష్ట్ర నాయకులు ఎన్.మధుసూదనరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శివకేశవనాయుడు, అప్పారావు ఎన్నికయ్యారు. -
టిప్పరు దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో నాగావళి తీరంలో గల ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తరలించేందుకు సిద్ధం చేసిన టిప్ప రు శనివారం దగ్ధమైంది. విజయనగరానికి చెందిన ఈ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పాలకొండ ఆగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి జామి సర్వే శ్వరరావు శకటంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వాహనం క్యాబిన్, తొట్టె పూర్తిగా కాలిపోయాయని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సదరు వాహన యజమాని రాగోలు సత్యనారాయణ మాట్లాడుతూ రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు వాపోయారు. -
● చంద్రబాబు టక్కుటమారాలు విజయనగరంలో చెల్లవు
చంద్రబాబు టక్కుటమారా విద్యలు విజయనగరంలో చెల్లవు. బొత్స అంటే ఒక బ్రాండ్. ఎంతోమంది సమస్యలను పరిష్కరించే నాయకుడికి ఇబ్బందిపెట్టాలనుకోవడం అవివేకం. బొత్స సత్యానారయణ నాయకత్వంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ చెక్కు చెదరదు. 23 మంది ఎమ్మెల్యేలను 2014–19 మధ్య చంద్రబాబు దొడ్డిదారిన చేర్చుకున్నా భయపడలేదు. పార్టీ జిల్లాస్థాయి సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావడం జగన్మోహన్రెడ్డిపై ఉన్న నమ్మకానికి అద్దంపడుతోంది. కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, ఎంపీపీ, ఎంపీటీసీ, వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం. ఇంటింటికీ వెళ్లి వెన్నుపోటు టీడీపీ నిజస్వరూపాన్ని చెబుదాం. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, వైఎస్సాసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ -
కనులపండువగా కోడూరుమాత యాత్ర
బాడంగి: మండలంలోని కోడూరు గ్రామంలో కోడూరుమాత యాత్ర శనివారం వైభవంగా సాగింది. వేలాది మంది భక్తులు కోడూరు మాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. దివ్యబలిపూజల్లో పాల్గొన్నారు. విశాఖ అగ్రపీఠం చాన్సలర్ జొన్నాడ జ్ఞానప్రకాష్, దుగ్గుంపూడి బాలసౌరి తదితర గురువులు వినిపించిన శాంతి సందేశాలను శ్రద్ధగా ఆలకించారు. భక్తులు తలనీలాలు సమర్పించారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా బొబ్బిలి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. భక్తులకు వీలుగా ఆర్టీసీ అధికారులు శ్రీకాకుళం, పాలకొండ, సాలూరు, పార్వతీపురం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. పండగ విజయవంతంగా ముగియడంపై కోడూరు చర్చి ఫాదర్ పీటర్ సింహాచలం సంతోషం వ్యక్తంచేశారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
గుమ్మలక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన రాష్ట్ర రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, పత్తిక చంద్రమోహన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా జిల్లా నుంచి పాల్గొన్న 50 మంది క్రీడాకారుల్లో 18 మంది గోల్డ్ మెడల్స్‌ను, 20 మంది సిల్వర్ మెడల్స్‌ను, 12 మంది కాంస్యం మెడల్స్‌ను పొందారని తెలిపారు. పైడితల్లి జాతరలో 21 పనులకు టెండర్ల ఆహ్వానం విజయనగరం క్రైమ్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు దేవదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. సిరిమాను సంబరం, తొలేళ్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాటు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. చదురగుడి, వనంగుడులలో ఎలక్ట్రికల్ పనులు, చలువ పందిళ్లు వేయటానికి, క్యూ లైన్లు, వనంగుడిలో ఆర్చి, లడ్డూ ప్రసాదం తయారీ వంటి 21 పనులు చేయించేందుకు ఈ నెల 16వ తేదీలోపు టెండర్లను దేవదాయ శాఖ కోరుతోందని ఈఓ శిరీష తెలిపారు. వివిధ రకాల పనులు, వాటి వ్యయాల బట్టి, వంద నుంచీ యాభై వేల రూపాయల వరకు దేవస్థానం పేరుతో డీడీ తీసి టెండర్‌కు జతపరచి బాక్స్‌లో వేయాలని తెలిపారు. కార్మికుడి మృతి కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ కర్మాగారంలో అస్వస్థతతో కాంట్రాక్టు కార్మికుడు చింత గౌరినాయుడు (45) శనివారం మృతి చెందాడు. దీనికి సంబంధించి సీఐ టి.వి.విజయకుమార్ తెలిపిన వివరాలు.. వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన మృతుడు చింత గౌరినాయుడు శారడ కర్మాగారంలో చిన్నారావు అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద గత కొద్ది కాలంగా రాయి కొట్టే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే శనివారం పనికి వచ్చి మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంట్లో నలతగా వుందని తోటి కార్మికులకు చెప్పి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలోనే వాంతులు చేసుకోవడంతో తోటి కార్మికులు గమనించి వెంటనే కొత్తవలసలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. బాలింత..సీతంపేట: మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన ఐదు నెలల బాలింత కె.రేణుక (36) శనివారం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బీపీ పూర్తి స్థాయిలో పడిపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. రేణుక అంగన్వాడీ హెల్పర్‌గా పని చేస్తుంది. ఐదు నెలల కిందట కుమార్తెకు జన్మనిచ్చింది. ఈమె మృతితో భర్త కిషోర్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతి మెరకముడిదాం : మండలంలోని బిళ్లలవలస గ్రామంలో శనివారం రామాలయం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతి చెందిన మహిళ బిళ్లలవలస గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ వుండేదని, హిందీలో మాట్లాడేదని, ఎవరు తినేందుకు ఏమి పెట్టినా తినేది కాదని గ్రామస్తులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రామాలయం వద్ద విగత జీవిగా పడి వుందని తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో బుదరాయవలస ఎస్ఐ తన సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ ప్రాంతానికి చెందినది అన్న వివరాలు తెలియరాలేదు. దీంతో గ్రామస్తులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. -
జాతీయ లోక్ అదాలత్ సక్సెస్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ● అదాలత్‌లో 7051 కేసులు పరిష్కారంవిజయనగరం లీగల్; రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌కు హాజరై న్యాయమూర్తి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృధా కాకుండా వారి జీవితాలలో ప్రశాంతత కలిగి ఉంటారన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని కోర్టులైన విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 7051 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 162, క్రిమినల్ కేసులు 6866, ప్రీ లిటిగేషన్ కేసులు 23 ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 9,73,16,602 లక్షల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు సీనియర్ న్యాయవాదులు పీఏఎన్ రాజు, పంపాన రవికుమార్, కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి చైర్మన్ దుర్గయ్య, కుటుంబ న్యాయ స్థానం అదనపు జిల్లా న్యాయమూర్తి ఓ.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాల్గవ శ్రేణి అదనపు న్యాయమూర్తి, శ్రీధర్, సీనియర్ సివిల్ జడ్జి రమేష్‌నాయుడు, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి బుజ్జి, మొబైల్ కోర్ట్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ఖతేజా చక్రవర్తి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, ఇజి.శ్రీ విద్య, మూడవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, నలితం రమేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లాన రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, కోర్టు సిబ్బంది, వివిధ శాాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, న్యాయ వాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
● కార్యకర్తలే పార్టీకి బలం
కార్యకర్తలే పార్టీకి బలం. వారు బలంగా ఉన్నంత వరకు పార్టీని ఎవరూ టచ్చేయలేరు. చంద్రబాబుకు మొదటి నుంచి కుటుంబాల మధ్య చిచ్చు పెట్డడం, విడగొట్టడం అలవాటు. పిల్లనిచ్చిన సొంతమామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎన్నో కుటుంబాలను విడగొట్టాడు. ప్రజా నాయకుడు బొత్స సత్యనారాయణ. ఎంతోమందిని నాయకులుగా తీర్చిదిద్దిన బొత్స ఓ రాజకీయ విశ్వవిద్యాలయం వంటి వారు. స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా విజయకేతనం ఎగురవేద్దాం. 2029 ఎన్నికల్లో విజయనగరంలో టీడీపీకి సమాధి కట్టడం ఖాయం. రెడ్‌బుక్ పాలన సాగిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లు కుమిలికుమిలి ఏడ్చేరోజు వస్తుంది. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
తోటపల్లికి నీటి తాకిడి
గరుగుబిల్లి: తుఫాన్ ప్రభావంతో ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 104.25 మీటర్లగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బ్యారేజీకి 8,497 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా మూడు గేట్లును ఎత్తి 7,691 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువకు 800 క్యూసెక్కులు, పాత కుడి కాలువకు 40, పాత ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మట్టి వినాయకుడినే పూజించాలి విజయనగరం గంటస్తంభం: వినాయక చవితిని పర్యావరణహితంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలను నివారించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని, ప్రభుత్వ మార్గదర్మకాలు పాటించాలని కోరారు. జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్షించారు. -
విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు
విజయనగరం టౌన్: విఘ్న నాయకునికి పూజలు నిర్వహించే వారంతా విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అడుగడుగునా ఆయా స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ ఉద్యోగి సమాచారాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. నిఘా నేత్రంతో నిశిత పరిశీలన చేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరింది. నిబంధనలు పాటించాలని పేర్కొంది. మండపాలు ఏర్పాటు చేసే వారందరూ సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతులకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మండపం వద్ద ఎల్లప్పుడూ నిర్వహకులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సమయాల్లో ప్రజలు మండపం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉంచాలి. సాధ్యమైన చోట మండపం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచాలి. లౌడ్ స్పీకర్లు, డీజేలు ఉపయోగించేటప్పుడు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. విగ్రహ ఊరేగింపు నిర్వహించే ముందు పోలీసు శాఖకు సమాచారమందించి, వారు సూచించిన మార్గం, సమయాన్ని మాత్రమే పాటించాలి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి వినాయక మండపానికి నిర్వహకులు ఒక బాధ్యత గల వ్యక్తిని నోడల్ పర్సన్‌ను నియమించాలి. మొబైల్ నెంబర్, పూర్తి వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌కు ముందుగానే అందజేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు అసాంఘిక కార్యకలాపాలకు తావీయ్యొద్దు అడుగడుగునా నిఘా నేత్రం : ఎస్పీ దామోదర్ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరి మనోభావాలు దె దెబ్బతినకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటూ ప్రత్యేకంగా నిఘా నేత్రంతో పరిశీలన చేస్తుంటుంది. మండపాలకు అనుమతులు తప్పనిసరిగా ఉచితంగా తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుమానాస్పద పరిస్థితులు తలెత్తినా వెంటనే డయల్ 112/100కి సమాచారమివ్వాలి. – ఏఆర్ దామోదర్, ఎస్పీ -
‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు
● బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్‌పై స్వతంత్ర విచారణ జరపాలి విజయనగరం గంటస్తంభం: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే బాల సంజీవని పథకాన్ని కొద్ది మంది బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు పరిమితం చేయడం సరికాదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ విమర్శించారు. బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ టెండర్లలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఐ నాయకులతో కలిసి కలెక్టరేట్లో డీఆర్ఓ, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన టెండర్ల మొత్తం వార్షిక విలువ సుమారు రూ.172.80 కోట్లు కాగా, కిట్ ధరలు పెరిగాయని తెలిపారు. ట్రైబల్ కిట్ఽ ధర రూ.350 నుంచి రూ.446కు, సాధారణ కిట్ ధర రూ.241 నుంచి రూ.283.19కు పెరగడం వల్ల సుమారు రూ.29.22 కోట్ల మేర అదనపు ప్రజాధనం భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు. టెండర్ నిబంధనల్లో సొంత తయారీ యూనిట్, ఫుడ్ సేప్టీ లైసెన్స్, ఉత్పత్తి సామర్థ్యం వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తయారీ యూనిట్లు లేని సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అనర్హతకు గురైన సంస్థలకు తిరిగి ఎలా అర్హత కల్పించారో విచారించాలన్నారు. పలువురు బిడ్డర్లు ఒకే ధరను కోట్ చేయడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జోన్ విధానాన్ని రద్దు చేసి జిల్లా వారీగా టెండర్లు నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక గ్రూపులకు పథకాన్ని అప్పగించాలని అశోక్ డిమాండ్ చేశారు. టెండర్లపై ఆర్థిక ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు పొందురూ అప్పలరాజు, బూర వాసు పాల్గొన్నారు. -
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. ఏటా ఖరీఫ్ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి. ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా మొర నువ్వైనా వింటావా.. గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ. ఇట్లు.. గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు – రాజాం -
ఓ బొజ్జ గణపయ్యా... ఉండ్రాళ్లు పెట్టలేమయ్యా..
ఓ బొజ్జ గణనాథుడా.. రావయ్యా..రా.. ఏటా ఖరీఫ్ ప్రారంభించి నాట్లు పడిన వెంటనే నువ్వు వస్తావని వెయ్యి కళ్లతో ఎదురు చూసేవాళ్లం. వర్షాలు అనుకూలించి పంటలు ఆశాజనకంగా ఉన్న వేళ ఆనందంతో నీ ఉత్సవాలు వైభవంగా చేసి, ఇష్టంగా కొలిచి, నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకం, పప్పుబూరెలు నైవేద్యంగా పెట్టేవాళ్లం. వాటిని ఆరగించి, మూసిక వాహనంపై ప్రయాణిస్తూ భక్తులకు వరాలు కురిపించేవాడి. ఈ ఏడాది వర్షాలు లేవు. వరినాట్లు సరిగ్గా పడలేదు. ఎరువుల కొరత, అధిక ధరలు. ఏమీ చేయాలో తోచని పరిస్థితి. ఈ తరుణంలో నీకు కష్టాలు చెప్పుకుందామనుకునేలోపే నిన్ను పిలవడానికే బాధేస్తుంది. వినాయక చవితికి వచ్చే నీకు ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు, కుడుములు, పానకాలు పెట్టలేని స్థితి ఏర్పడింది. బెల్లం ధర అమాంతంగా పెరిగిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో రూ.45లు ఉండే బెల్లం ధర ఇప్పుడు రూ.80 పలుకుతోంది. పప్పుల, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా మొర నువ్వైనా వింటావా.. గతంలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతీ ఇంటికి నగదుసాయం అందేది. ఇప్పుడు ఏ సాయం లేదు. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. బెల్లానికి బదులు పంచదారతో ఉండ్రాళ్లు చేద్దామంటే పంచదార సైతం కిలో రూ.75లు పలుకుతోంది. కందిపప్పు కిలో ధర రూ.140లు పైబడి ఉంది. గతంలో రేషన్ దుకాణాల్లో పండగ సమయాల్లో బెల్లం, పంచదార, కందిపప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు. మేం ఎలాగూ కొనలేం... తినలేం. నీకు నైవేద్యం పెడదామన్నా ధరలు తట్టుకోలేకపోతున్నాం. పోనీ ఉత్తి బియ్యిం పిండి ఉండ్రాలు పెడదామంటే బియ్యం కిలో ధర రూ.60లు నుంచి రూ.70లు ఉంది. ఈ ధరాఘాతంలో మేం ఎలా బతికేది. మా మొర విని, ఈ ఏడాది నీ బొజ్జ నిండేట్టు పెట్టలేని మా బతుకులకు ఆర్థిక భరోసా కల్పించే కొత్త ఆసరా ఇవ్వ తండ్రీ. ఇట్లు.. గట్టిగా పిలవలేక పిలుస్తున్న నీ భక్తులు -
వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గదల సన్యాసినాయుడు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బెల్లాన చంద్రశేఖర్‌ను నియమించినట్లు తెలిపింది. -
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ తిరుపతితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: చెన్నై విమానం రాజమండ్రికి మళ్లింపు -
కూన సంతకంతో ‘సిల్వర్’ సర్టిఫికెట్!
విజయనగరం అర్బన్: మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో క్రీడా అర్హతల్లో అవకతవకలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అర్హత ఉన్నప్పటికీ పోస్టులకు దూరమైన అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. మరో అనుమానాస్పద ఫారం–2 వెలుగులోకి వచ్చింది. జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో కేవలం పాల్గొన్న అభ్యర్థికి ఏకంగా ‘సిల్వర్ మెడల్’ సాధించినట్టు ఫారం–2 జారీ చేయడం, ఆ పత్రంపై నిబంధనల్లో పేర్కొన్న అధికారి కాకుండా రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు కూన రవికుమార్ సంతకం ఉండటం వివాదాస్పదంగా మారింది. ‘పార్టిసిపేషన్’ మాత్రమే.. మెడల్ సృష్టించారు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన కోట లీలా శివజ్యోతి 2021 డిసెంబర్ 24 నుంచి 28 వరకు అనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నారు. ఈ పోటీలకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఆమెకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మాత్రమే లభించినట్లు తెలుస్తోంది. అయితే.. అదే పోటీలో ఆమె రెండో స్థానం సాధించి సిల్వర్ మెడల్ గెలిచినట్లు పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్‌బాల్ సంఘం నుంచి ఫారం–2 జారీ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ధృవపత్రంపై రాష్ట్ర క్రీడా సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంతకం చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. పోటీలో పాల్గొన్నట్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉండగా.. అదే పోటీలో రెండో స్థానం సాధించినట్లు ఫారం–2 ఎలా జారీ అయింది? అసలు సిల్వర్ మెడల్ సాధించినట్లు నిర్ధారించే ఆధారం ఏమిటి? అన్న ప్రశ్నలు క్రీడావర్గాల్లో వినిపిస్తున్నాయి. ఫారం–2 ఆధారంగానే ఉద్యోగమా? డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో కేవలం పోటీల్లో పార్టీసిపేషన్ సర్టిఫికెట్లకు ప్రాధాన్యం ఉండదు. అభ్యర్థి సాధించిన క్రీడా ప్రతిభ, పొందిన స్థానం, నిబంధనల్లో నిర్దేశించిన ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక జరగాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ అత్యున్నత క్రీడా ప్రతిభకు సంబంధించిన ధృవపత్రాలతో పాటు సంబంధిత ఫారాలను సమర్పించాలని అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాల్గొన్నట్లు ఉన్న ధృవపత్రంతో సిల్వర్ మెడల్ స్థాయి క్రీడా అర్హతను చూపించడం ఎలా సాధ్యమైందన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఈ ఫారం–2 ఆధారంగానే అభ్యర్థికి డీఎస్సీ–2025లో ఉద్యోగం లభించినట్లు తెలుస్తోంది. స్థానికతపైనా అనుమానాలు అభ్యర్థి స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. అయితే, విశాఖ జిల్లా స్థానికతతో 42 సంవత్సరాల వయసులో స్కూల్ అసిస్టెంట్ మేథమెటిక్స్ పోస్టు నియామక ఆదేశాలు వచ్చాయి. భర్త చొక్కాపు సత్యనారాయణ విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు ఇదే సాఫ్ట్‌బాల్ క్రీడా అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా కూడా భర్త సత్యనారాయణ వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అధ్యక్షుడి సంతకం.. నిబంధనల్లో మాత్రం కార్యదర్శి! 2025 క్రీడా కోటా మార్గదర్శకాల్లోని ఫారం–2లోనే.. ఆ ధృవపత్రం నేషనల్ ఫెడరేషన్ సెక్రటరీ లేదా సంబంధిత స్టేట్ అసోసియేషన్ సెక్రటరీ వ్యక్తిగతంగా సంతకం చేసినప్పుడే చెల్లుబాటు అవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అభ్యర్థి సమర్పించినట్లు చూపుతున్న ఫారం–2లో సంతకం చేసిన వ్యక్తి హోదా ప్రెసిడెంట్‌గా ఉంది. దీంతో ప్రెసిడెంట్ సంతకంతో జారీ చేసిన ఫారం–2ను అధికారులు క్రీడా ధృవపత్రంగా ఎలా పరిగణిస్తారన్న ప్రశ్న క్రీడావర్గాల నుంచి తలెత్తుతోంది. -
బొత్స సత్యనారాయణ మరోసారి కంటతడి.. కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగం జిల్లా సర్వసభ్య సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కంటతడి పెట్టారు. నమ్మినవారే మోసం చేశారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న శ్రీను అంశంపై అమర్నాథ్ మాట్లాడుతుండగా బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు.ఆ తర్వాత ఈ సమావేశంలో బొత్స మాట్లాడుతూ... వెన్నుపోటు పార్టీ అరాచకాలు ప్రజలకు తెలియాలని అన్నారు. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కార్యకర్తలంతా తలెత్తుకుని తిరిగేలా చేస్తారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. తన సహచరులు కేంద్ర మంత్రులుగా ఉన్నారని చెప్పారు. తనను పిలిచినా వెళ్లకుండా విలువలు కాపాడుకున్నానని అన్నారు. 2 రోజుల క్రితం కూడా..బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పార్టీ మారడంతో ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘నమ్మినవాళ్లు మోసం చేశారు’’ అంటూ బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. మళ్లీ శనివారం ఆయన కంటతడి పెట్టడం గమనార్హం.ఇదీ చదవండి: భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు -
ఆయన మనకెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎన్నాళ్లనుంచో ఉన్న మాకే పదవుల్లేవు.. ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది... ఇంకా మా భవిష్యత్తే మాకు అర్థం కావడం లేదు.. ఇక్కడ ఉన్నవాళ్లకి ఏదీ అర్థం కాకపోతుంటే మళ్లా ఆయన, ఆయన కుమార్తె వచ్చి ఏం చేస్తారు..? మళ్లీ ఆయనను తెచ్చి మా మీద రుద్దడం ఎందుకు.. మా నియోజకవర్గాల్లో... గ్రామాల్లో.. మండలాల్లో మా పనులు మేము చేసుకోలేమా? ఆయనొచ్చి ఏం ఉద్ధరిస్తారు.. ఎందుకొచ్చిన లంపటం మాకు.. ఇదీ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యకర్త్తల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. గత పదిహేనేళ్లుగా టీడీపీ కార్యకర్త దగ్గర్నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖరుకు కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం గవర్నర్‌గా ఉన్న అశోక్ గజపతిరాజు సైతం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేసినవారే. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఏ రకంగా తమ పార్టీలో ఇముడ్చుకోవాలన్నది టీడీపీ క్యాడర్‌కు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈయనను తెచ్చి ఎందుకు నెత్తిన ఎక్కించుకోవాలన్న ప్రశ్నలు టీడీపీ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్నాయి. అదెలా కుదురుతుంది: బేబీ నాయిన మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయిన కూడా జెడ్పీచైర్మన్ చేరికను వ్యతిరేకించినట్లు తెలిసింది. వాస్తవానికి తాము గతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉండేవాళ్లమని, అప్పట్లో బొత్స సత్యనారాయణ, ఆయనతో బాటు మజ్జి శ్రీనివాసరావు తదితరులు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరడాన్ని సహించలేకనే తాము టీడీపీలో చేరామని, అలాంటపుడు మళ్లీ ఇప్పుడు ఆయనను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని బేబీ నాయిన అధిష్టానాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరితే బొబ్బిలి రాజకీయాల్లో వేలుపెట్టి గ్రూపులు కట్టి తమకు ఇబ్బంది పెట్టడం.. పార్టీలో గ్రూపులు కట్టడం వంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయని బేబీనాయిన వాదించినట్లు తెలిసింది. కానీ, టీడీపీ అధిష్టానం ఆయనను ఊరడించి మజ్జి శ్రీనివాసరావును చేర్చుకున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తదితరులు కూడా చిన్న శ్రీను రాకను అయిష్టంగానే స్వాగతించినట్టు బోగట్టా. ఇదీ చదవండి: ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టీడీపీ షాక్..! -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈనెల 12న ఉదయం 10 గంటలకు నగరంలోని పూల్‌బాగ్ జగన్నాథ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహిస్తామని పార్టీ జిల్లా కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశానికి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శలు, పార్టీ మండలాధ్యక్షులు, పార్టీ కమిటీ సభ్యులు, నియోజకవర్గ/మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల సభ్యులు, పార్టీ కమిటీలలో వివిధ హోదాల్లో ఉన్న సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సోషల్ మీడియా సైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది. నేడు జాతీయ లోక్ అదాలత్ విజయనగరం లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబందిత కేసులు, సివిల్ కేసులతో పాటు, ఇతర కేసులను సైతం పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఫూల్‌బాగ్ కాలనీ హనుమాన్ నగర్‌లోని ఎంఆర్వీఆర్జీఆర్పీజీ బాయ్స్ హాస్టల్ ప్రాంగణంలోని నూతన కోర్టు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే కార్యక్రమాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ విజయనగరం గంటస్తంభం: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన ‘మట్టి వినాయకుడు పర్యావరణ పరిరక్షణకు మన వంతు’ పోస్టర్లు, కరపత్రాలను శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈఈ సరిత మాట్లాడుతూ, పీవోపీ విగ్రహాలు, రసాయన రంగులకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. -
గిరిజనులకు అన్యాయం చేస్తారా?
● పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి రామభద్రపురం: చంద్రబాబు ఇచ్చేయమంటే దశాబ్దాల కాలంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములు స్వాధీనం చేసుకుని పరిశ్రమల పేరిట పెత్తందార్లకు కట్టబెట్టి గిరిజనులకు అన్యాయం చేసేస్తారా? అని పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామభద్రపురం మండలంలోని కాకర్లవలస వద్ద గిరిజన రైతుల పంటలను రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి నిరా్ద్క్షిణ్యంగా ధ్వంసం చేయడం ఘోరమని మండిపడ్డారు. భూమి మీద సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఎంతో కాలం కష్టపడి పండించిన పంటలు పోలీసు ఫోర్స్ ఉపయోగించి దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన ఆర్డీవో, తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంటలు అధికారులే ధ్వంసం చేయించి అడ్డుకున్న గిరిజన రైతులను అక్రమ అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెత్తందార్లు ఎలా చెబితే అలా ప్రభుత్వం చేస్తే పేదల ఉసురు తగులుందన్నారు. గిరిజనులు భూములు వదిలేదిలేదని, ధ్వంసం చేసిన పంటలకు సంపూర్ణ నష్టపరిహారం అందించి న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు. -
తప్పిన పెనుప్రమాదం
రామభద్రపురం: మండలకేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని విజయనగరం వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది, దీంతో అప్పటికే విద్యుత్ సరఫరా అవుతున్న స్తంభం పక్కకు ఒరిగిపోయి ఆ పక్కనే ఉన్న బట్టల షాపు బోర్డు మీద పడి అలా ఉండిపోయింది.బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీ కొట్టిన వెంటనే పక్కకు తప్పించి దూరంగా తీసుకెళ్లి నిలిపాడు. ఆ సమయంలో ఆక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపేశారు.ఏ మాత్రం స్తంభంతో పాటు వైర్లు కింద పడినా అదే సమయంలో బస్సులో పదుల సంఖ్యలో ప్రయాణికులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. అలాగే బట్టల దుకాణాం షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం తప్పింది. మరో వైపు రోడ్డుపై రాకపోకలు సాగించే పాదచారులు,వాహనాలకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో హమ్మాయ్యా ఏ దేవుడు రక్షించాడో అంటూ అంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ శాఖాధికారులు వెంటనే స్పందించి కొత్త స్తంభం ఏర్పాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
విశాఖపట్నం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని మారికవలసలో జరిగిన ఈ సంఘటనపై పీఎంపాలెం ఇన్స్పెక్టర్ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్ అవెన్యూలోని 202వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం చైతన్య తండ్రి రవికుమార్ మృతి చెందాడు. అప్పటి నుంచి చైతన్య మానసికంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనికి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న మనస్పర్థలు కూడా తోడయ్యాయని, ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్లారు. శుక్రవారం తెల్ల వారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య పక్కన లేకపోవడంతో మరో బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య తువ్వాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎస్.కోట వాసి -
‘స్థానిక’ పోరుకు సన్నాహాలు
విజయనగరం రూరల్: జిల్లాలోని 27 మండలాల్లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్‌కు ముందున్న వివరాల మేరకే ఫొటోలతో కూడిన గ్రామీణ ఓటర్ల జాబితాను శుక్రవారం అన్ని కార్యాలయాల వద్ద ప్రచురించారు. జిల్లాలోని 27 మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ముమ్ముర ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తొలుత ఫొటో ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం మండల పరిషత్ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయం వద్ద అధికారులు ప్రచురించారు. 2021వ సంవత్సరంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీల పదవీకాలం ఈ నెల 23న, జెడ్పీటీసీల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టింది. విజయనగరం జిల్లా పరిధిలో విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 449 ఎంపీటీసీ స్థానాలకు, 27 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, చంద్రబాబు సర్కారు ఆలోచన ప్రకారం ఎంపీపీల ఎన్నిక నేరుగా ప్రజలతో నేరుగా ఎన్నికోబడితే, మండలానికో ఎంపీపీ చొప్పున 27 మంది ఎంపీపీలు ఎన్నిక కానున్నారు. అలాగే, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాగా ఉన్న విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు ఈ నెల 25 నుంచి కొత్త జిల్లా పరిషత్‌లుగా అవతరించనున్నాయి. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఏర్పాట్లు పాత ఓటర్ల జాబితా ప్రకారం స్థా నిక ఎన్నికల నిర్వహణకుసర్కా రు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. సర్ ప్రక్రియలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. వీటిని పట్టించుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సమాచారంఅసెంబ్లీ నియోజక వర్గాలు: 07 మండలాలు: 27 ఎంపీటీసీలు: 449 ఎంపీపీలు: 27 జెడ్పీటీసీ స్థానాలు: 27 పోలింగ్ కేంద్రాలు: 7,398 పురుష ఓటర్లు: 6,36,006 మహిళా ఓటర్లు: 6,49,664 ఇతరులు: 34 మొత్తం ఓటర్లు: 12,85,704 ఓటర్ల జాబితా ప్రచురణ ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1994 నియమ నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు జిల్లాలోని జెడ్పీ ప్రాదేశిక నియోజక వర్గాలకు, మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను శుక్రవారం మండల పరిషత్, జెడ్పీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. జెడ్పీటీసీ నియోజకవర్గాలకు సంబందించి ఓటర్ల జాబితాను జెడ్పీ సీఈవో ఎ.లోవరాజు జెడ్పీ కార్యాలయం వద్ద ప్రచురించారు. ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రచురించిన ఓటర్ల జాబితాను ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఫొటో ఓటర్ల జాబితా ప్రచురించిన అధికారులు ఈ నెల 23న ఎంపీటీసీలు, 24న ముగియనున్న జెడ్పీటీసీల పదవీకాలం -
బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ
విజయనగరం అర్బన్/రాజాంసిటీ: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం, రాజాంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. తమ డిమాండ్లను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. 5 రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని, వివక్షతో కూడిన పీఎల్ఐ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ నిర్ణయాలను యూనియన్లతో చర్చించిన తర్వాతే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యుఎఫ్‌బీయూ కన్వీనర్, కో ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్, ఎస్‌వీఐ రీజనల్ సెక్రటరీ, ఇతర సంఘాల, బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విజయనగరంలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ర్యాలీ -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత సోషల్ మీడియా సైనికులపై ఉందని వైఎస్సార్సీపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నా రు. విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేకే టీడీపీ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం సోషల్ మీడియా కేవలం పోస్టులు పెట్టే వేదిక మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం కలింగించే శక్తివంతమైన సాధనమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను వాస్తవాలతో ప్రజలకు చేరవేయాలని పార్టీ సోషల్‌మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ ఎదుగుదలలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి ఇది బలమైన ఆయుధంగా నిలిచిందని గుర్తుచేశారు. విజయనగరం జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాల్లో ఒకటని, ఇక్కడ జరిగే ప్రతి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రజలకు వివరించాలని, కూటమి దుష్ఫ్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బలంగా తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మేల్యే బొత్స అప్పలనరసయ్య, బొత్స అనూష, బొత్స సందీప్, రాజాం నియోజకవర్గ పరిశీలకుడు కె.వి.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి యూత్ వింగ్ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వై.వాసునాయుడు, ఎస్.కోట యూత్ వింగ్ అధ్యక్షుడు వాకాడ సతీష్ దొర, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, కెల్ల సురేష్, నియోజకవర్గాల అధ్యక్షులు కనకల కృష్ణ, ఎ.వీరస్వామి, ఎడ్ల కిశోర్, సీరాపు వంశీరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, మండలాల సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. సోషల్ మీడియా సైనికులు సమర్థంగా పనిచేయాలి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ -
అంతర్ జిల్లా సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం
బొబ్బిలి రూరల్: 13వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా సాఫ్ట్ బాల్ పోటీలు శుక్రవారం పారాది జెడ్పీహెచ్ స్కూల్లో ప్రారంభమయ్యాయి.రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక పటుత్వం లభిస్తుందని,రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. విద్యార్ధి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కనబర్చాలని, చదువుతో పాటు క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలని తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేబినాయన, డీఈఓ మాణిక్యం నాయుడు, డీఎస్పీ గోవిందరావు ఆయా శాఖల అదికారులు పాల్గొన్నారు. -
ఆకతాయిల దాడిలో వంటమనిషికి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: కళాశాల విద్యార్థుల మధ్య రేగిన పాతకక్షలు రచ్చకెక్కగా, ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని ఒక అమాయక వంట మనిషి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీ సమీప ప్రధాన రహదారిపై కలకలం రేపింది. స్థానిక కల్యాణ మంటపంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల వేడుకల అనంతరం, కేటరింగ్ సామగ్రితో ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న వంట మనిషిని, మరో విద్యార్థిని కొందరు యువకులు మార్గమధ్యంలో అడ్డగించారు. సదరు విద్యార్థితో పాత విషయాలపై వాగ్వాదానికి దిగి భౌతిక దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న వంట మనిషి గమనించి, వారిని వారించేందుకు జోక్యం చేసుకోగా.. ఉన్మాదంతో రగిలిపోయిన ఆకతాయిలు వంటమనిషిపై కూడా విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న సిమెంట్ రేకుల ముక్కలు, పిడికిళ్లతో దారుణంగా కొట్టడంతో ఆ వంట మనిషి తల, పెదవికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడిని గమనించిన ఓ స్థానిక ఆటో డ్రైవర్ తక్షణమే స్పందించి పార్వతీపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన విద్యార్థులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. -
సర్వజనమృత్యు ఘోష..!
● సీతయ్య అనే 40 ఏళ్ల వ్యక్తి మెటబాలజీమ్ అనే వ్యాధితో ఈ నెల 6వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. 8వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ● బి.లక్ష్మి అనే 58 ఏళ్ల మహిళ ఆగస్టు 7వ తేదీన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. 10వ తేదీన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ● 8 నెలల్లో 1070 మంది రోగుల మృతి ● చికిత్స అందించడంలో నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు మరణాలు ఇలా.. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు నెలాఖారు నాటికి ఆస్పత్రిలో 1070 మంది మంది మరణించారు. దీనిని బట్టి వైద్యసేవల తీరును అంచనా వేయవచ్చు. ఒక్క జనవరి నెలలో అత్యధికంగా 175 మంది మరణించారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్యసేవలపై నిర్లక్ష్యం కూడా దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంలేదని పలువురు రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరిన వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. మరణాలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహిస్తున్నాం. వైద్య సిబ్బంది అలసత్వం కారణంగా రోగి మరణించినట్టు తేలితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విజయనగరం ఫోర్ట్: సర్వజన ఆస్పత్రిలో మృత్యుఘోష వినిపిస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, సకాలంలో వైద్య సేవలు అందకపోవంతో అధిక మరణాలు నమోదుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. కేవలం 8 నెలల్లో 1070 మంది సర్వజన ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ మృతిచెందినట్టు వైద్య రికార్డుల్లో నమోదుకావడం కలవరపెడుతోంది. ఆస్పత్రిలో చికిత్స అందించడంలో అలసత్వం కారణంగా అధికమంది రోగులు మృత్యువాత పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం చికిత్స అందించంలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్కానింగ్, ఎక్స్‌రే తీయించడంలోనూ తీవ్ర జాప్యం వ్యాధి నిర్ధారణలో వైద్య సిబ్బంది అలసత్వం వహిస్తున్నట్టు రోగులు చెబుతున్నారు. సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించడంలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం తీయాల్సిన స్కాన్, ఎక్స్‌రేలకు సాయంత్రం వరకు రోగులను ఉంచుతున్నారు. ఎక్స్‌రే, స్కానింగ్ రిపోర్టు వస్తేగాని చికిత్స అందించలేమని వైద్యులు చెబుతున్నారు. వైద్యసేవలు సకాలంలో అందక ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని రోగుల బంధువులు కన్నీరుపెడుతున్నారు. ఆదివారం అయితే పరిస్థితి మరింత ఘోరం.. ఆదివారం అయితే రోగుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎమెర్జెన్సీ వార్డు, ఐసీయూల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరమైతే సకాలంలో చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఆర్ఐ, సీటీస్కాన్ రిపోర్టులు రావడం లేదు. ఈ రిపోర్టులు కోసం సోమవారం వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి. రిపోర్టు రాకపోవడం వల్ల ఏ వ్యాధి తెలియకపోతే ఏ విధంగా వైద్యం చేయగలమని వైద్యులు చెబుతున్నారు. రిపోర్టుల జాప్యం వల్ల రోగుల పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. -
భూ సమస్యలకు త్వరిత పరిష్కారం
● కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశాలువిజయనగరం గంటస్తంభం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సదస్సులో పాల్గొని సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్యం, నైపుణ్యాభివృద్ధిపై సీఎం సమీక్షించారు. సంక్షేమ పథకాల తేదీలతో కూడిన క్యాలెండర్‌ను రూపొందించి ప్రజలకు తెలియాజేయాలని ఆదేశించారు. 22ఏ జాబితాలోని భూ సమస్యలను పరిష్కరించడంతో ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాల భూములకు విముక్తి కల్పించామని సూచించారు. రీసర్వే పూర్తయిన భూములకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో భద్రత కల్పించాలని సూచించారు. నవంబర్ 1 నుంచి రియల్‌టైమ్ ఇంటిగ్రేషన్ చేపట్టాలని, 45 రోజుల్లో బ్యాక్లాగ్ భూ వివరాలను బ్లాక్‌చెయిన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాలని, నియోజకవర్గాల వారీగా జాబ్ఫెయిర్లు నిర్వహించాలని సూచించారు. 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించేలా చర్యలు చేపట్టాలని, పాఠశాల భవనాల భద్రతపై ఆడిట్ నిర్వహించాలని సీఎం ఆదేశించారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఉంచి దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.8మంది మేకల దొంగల అరెస్ట్మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస, కాశీపట్నం, తూరుమామిడి గ్రామాలకు చెందిన పలువురి మేకలు ఇటీవల చోరీకి గురికాగా పోలీస్ స్టేషన్లో నమోదైనప ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో మార్కొండపుట్టి, దుగ్గేరు, పనసభద్ర గ్రామాలకు చెందిన ఆరుగురితో పాటు మరో ఇద్దరూ మైనర్లు ఉన్నారు. వారు దొంగిలించిన 10 మేకలు, రవాణాకు ఉపయోగించిన ఆటో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిలో ఆరుగురిని జుడిషియల్ రిమాండ్‌కు ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. పామాయిల్ గెలల ట్రాక్టర్ బోల్తాకొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి భారీగా గోతుల మయం కావడంతో వాహన చోదకులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో శుక్రవారం రామభద్రపురం సమీపంలో పామాయిల్ గెలలతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో బోల్తా పడింది. ఈ క్రమంల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభవిజయనగరం: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహసభ ఈనెల 11న జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం జరగనున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహాసభకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకటరావు, జి.ఆంజనేయులు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మహాసభలకు జిల్లాలో, నగరంలో ఉన్న జర్నలిస్టు మిత్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు.బి.ప్రసాదరావు, నాగరాజు పాల్గొన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిబొబ్బిలి: క్రైస్తవ ప్రార్ధనల అనంతరం చర్చి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బొబ్బిలి పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన త ప్రమాదంపై సీఐ కె.నారాయణ రావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండ పుట్టి గ్రామానికి చెందిన నారాయణ పురం లక్ష్మయ్య(53)బొబ్బిలిలోని ఐటీఐ కాలనీలో గల చర్చికి వచ్చాడు. ప్రార్థనల అనంతరం తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఫ్లైఓవర్ వైపు వెళ్తుండగా రామభద్రపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం లక్ష్మయ్యను ఢీకొని మీదుగానే వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. లక్ష్మయ్య తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్సై లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విద్యార్థులకు క్రీడా తరహా దుస్తులు
● యూనిఫారానికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన కలెక్టర్సాక్షి, పార్వతీపురం మన్యం: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్యమైన ప్రతిపాదనను సమర్పించారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతమున్న సంప్రదాయ యూనిఫాంల స్థానంలో సౌకర్యవంతమైన స్పోర్ట్స్ తరహా యూనిఫాం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన దర్జీల కొరత వల్ల ప్రస్తుత యూనిఫాంల కుట్టు నాణ్యత సరిగా ఉండడం లేదని, త్వరగా చిరిగిపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల లోగోతో కూడిన గాలి పీల్చే కాటన్ ఫ్యాబ్రిక్ టీ–షర్ట్, ట్రాక్ ప్యాంట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కదిలేందుకు మెరుగైన సౌకర్యం లభించడమే కాక.. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ఈ ప్రతిపాదనను పైలట్ ప్రాజెక్ట్‌గా ముందస్తుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి అనుమతించాలని కోరారు. ● కలెక్టర్ల కాన్ఫరెన్‌న్స్‌లో పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. మన్యం జిల్లాలోని విద్యాశాఖ బడ్జెట్ సమన్వయంతో బాలురు, బాలికలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఇప్పటికే ఎంపిక చేశామని, రాబోయే రెండు వారాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒలింపిక్ క్రీడలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ● యువత నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన ‘నైపుణ్యం’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జిల్లా ఏకంగా 65.8 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ● జిల్లాలో ఈ–ఆఫీస్ ఫైళ్ల సమర్థ నిర్వహణపై సీఎం ప్రశంసించారు. కలెక్టర్‌కు వచ్చే ప్రతి ఫైల్‌ను సగటున కేవలం 5 గంటల వ్యవధిలోనే పరిష్కరించి క్లియర్ చేస్తున్న తీరుపై అభినందనలు తెలిపారు. ప్రజలకు, అర్జీదారులకు వేగంగా న్యాయం జరిగేలా మన్యం జిల్లా చూపిస్తున్న ఈ పనితీరును అందరూ స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలని సూచించారు. ● జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. కేవలం భౌతిక వసతులు, కిట్ల పంపిణీతోనే సరిపెట్టకుండా విద్యార్థులకు అందే విద్యా ప్రమాణాలను పెంచడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ● జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రైతులకు నిలకడైన ఆర్థిక పరిపుష్టి అందించేందుకు చేపడుతున్న ఉద్యాన అభివృద్ధి చర్యలను కలెక్టర్ వివరించారు. పైనాపిల్, జీడిమామిడి, పసుపు పంటల ప్రగతిని తెలియజేశారు. -
పణుకువలసలో వణుకు..!
● ప్రమాదకరంగా వంతెన ● వాహనాల రాకపోకలు నిలిపివేత ● పరిశీలించిన రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులుతెర్లాం: రాజాం–రామభద్రపురం ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. వంతెనకు దక్షిణ దిక్కున ఉన్న రక్షణ గోడ, వంతెన కొంత భాగం శుక్రవారం ఉదయం పూర్తిగా కూలిపోయింది. గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ఆ వర్షానికి వంతెనకు ఓ వైపు శిథిలావస్థకు గురైన రక్షణ గోడ, వంతెనలో సగభాగమంతా పూర్తిగా పడిపోయింది. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఆర్.ధనం, డిఫ్యూటీ తహసీల్దార్ జి.సత్యనారాయణ, ఆర్అండ్బీ ఏఈ రాజు, మాజీ ఎంపీపీ ప్రతినిధి నర్సుపల్లి వెంకటేశ్వరరావులు వెంటనే వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు. వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో మిగిలిన వంతెన భాగం కూడా ప్రమాదకరంగా మారిందని, భారీ వాహనాలు వంతెన పైనుంచి రాకపోకలు సాగిస్తే పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఆ వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వంతెన పైనుంచి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రమాదకరంగా ఉన్న వంతెన పరిస్థితిని కలెక్టర్‌కు తెలియజేస్తానని తహసీల్దార్ ధనం తెలిపారు. పణుకువలస వద్ద ఉన్న వంతెన రక్షణగోడ ఓ పక్క పూర్తిగా పడిపోయిందని, మిగిలిన వంతెన భాగం ప్రమాదకరంగా ఉందన్న విషయాన్ని మాజీ ఎంపీపీ ప్రతినిధి వెంకటేశ్వరరావు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు వంతెన పరిస్థితిని ఏఈ రాజు తెలియజేశారు. వంతెన పైనుంచి భారీ వాహనాలు రాకుండా రెండు వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా చూడాలని పణుకువలస వీఆర్ఏను తహసీల్దార్ ఆదేశించారు. ఇబ్బందిపడుతున్న వాహన చోదకులు, ప్రయాణికులు పణుకువలస వంతెన ఓ పక్క పూర్తిగా కూలిపోవడం, వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కువగా ఈ వంతెనపై నుంచి వెళ్తుంటాయి. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి రాజాం, శ్రీకాకుళం వైపు వస్తున్న వాహనాలు, శ్రీకాకుళం, రాజాం వైపు నుంచి సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు వస్తున్న వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి సాలూరు, బొబ్బిలి వెళ్లేందుకు వస్తున్న బస్సులు పణుకువలస జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నారు. సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి వస్తున్న వాహనాలు తెర్లాం జంక్షన్ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వేగంగా వంతెనకు మరమ్మతులు చేపట్టాలని, లేదా వంతెన పక్క నుంచి వాహనాలు వెళ్లేందుకు డైవర్షన్ ఇప్పించాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు. -
‘అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా ఫోన్ చేయండి’
విజయనగరం: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో బొత్స సమావేశమయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా కార్యకర్తలకు బొత్స దిశా నిర్దేశం చేశారు. ‘ప్రభుత్వ వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి. చట్ట వ్యతిరేకమైన పోస్టులకు, అబద్ధపు ప్రచారాలకు దూరంగా ఉండాలి.ఇక మీదట ప్రతి కార్యకర్త నేరుగా జిల్లా పార్టీ కార్యాలయంలో అనుసంధానం కావాలి. నేను ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను.. ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్తత -
చక్కెర కర్మాగారాన్ని మూసివేయొద్దు
● మూసివేత ప్రకటనను యాజమాన్యం ఉపసంహరించుకోవాలి రేగిడి: ఎల్‌నినో ప్రభావంతో 2027–28 క్రషింగ్ సీజన్‌కు రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం మూసివేస్తున్నామని యాజమాన్యం చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి చక్కెర పరిశ్రమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు చక్కెర కర్మాగారం జీఎం వెంకట సూర్యనారాయణకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తొలుత నిర్వహించిన సమావేశంలో రైతు సంఘ నాయకుడు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం గతంలో మాదిరిగా రైతులకు రాయితీలు ఇచ్చి చెరకు సాగు విస్తీర్ణానికి తగు ప్రణాళికలతో ముందుకు వస్తే రైతులంతా యాజమాన్యానికి సహకరిస్తారని అన్నారు. యాజమాన్యం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంత వరకు దశలవారీగా ఉద్యమం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కింజరాపు సురేష్, చింత సంగంనాయుడు, కెంబూరు కోటేశ్వరరావు, కుమరాపు బలరాంనాయుడు, కర్రి రమణ, మజ్జి అప్పలనాయుడు, నీలకంఠేశ్వర యాదవ్, కొప్పర వెంకటప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వన్‌స్టాప్ సెంటర్ ప్రచార రథానికి బ్రేకులు..!
● బిల్లులు చెల్లించకపోవడంతో వాహనాన్ని నిలిపివేసిన నిర్వాహకుడు విజయనగరం ఫోర్ట్: వన్‌స్టాప్ సెంటర్ అందించే సేవలను ప్రచా రం చేయడానికి, రెస్క్యూ కార్యక్రమాల కోసం ఏర్పాటుచేసిన ప్రచార రథానికి బ్రేకులు పడ్డాయి. ఐసీడీఎస్ అధికారులు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వల్ల ప్రచార రథానికి బ్రేకులు పడ్డాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రచారరథం సేవలు ఇలా.. కళాశాలలకు, పాఠశాలలకు, సచివాలయాలు, వసతి గృహాలకు వాహనంపై సిబ్బంది వెళ్లి వన్‌స్టాప్ సెంటర్ మహిళలకు అందించే రక్షణ, ఉచిత న్యాయ, వైద్యసేవలు, బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ మోసాలు, గుడ్‌టచ్ బ్యాడ్‌టచ్ తదితర అంశాలపై అవగాహన కల్పించేవారు. ఆపదలో ఉన్న మహిళలను వన్‌స్టాప్ సెంటర్‌కు తీసుకు రావడానికి, బాధితులను ఇంటికి చేర్చడానికి వాహనాన్ని వినియోగించే వారు. జిల్లాలో వన్‌స్టాప్ సెంటర్ ప్రచార రథాన్ని గతేడాది డిసెంబర్లో ప్రారంభించారు. ఇప్పటి వరకు 200 వరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. 15 రెస్క్యూలు నిర్వహించారు. డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు మాత్రమే వాహనానికి బిల్లులు చెల్లించారు. నెలకు రూ.37,500 చొప్పున అద్దె చెల్లించేలా ప్రచార రథాన్ని సమకూర్చారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలఖారు వరకు ఐదు నెలలకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో రథం నిర్వాహకుడు వాహనాన్ని నిలిపివేసినట్టు సమాచారం. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బందికి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ (పీడీ)కి మధ్య గత కొన్ని నెలలుగా కోల్డ్‌వార్ నడుస్తుండడం వల్లే వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది ఏది అడిగినా పీడీ వాటిని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వివరణ అడిగేందుకు పీడీ బాలామణికి ఫోన్‌చేయగా ఆమె స్పందించ లేదు. -
ప్రజలకు అండగా నిలబడదాం
● పార్టీని విజయపథాన నిలుపుదాం ● కార్యకర్తలకు పిలుపునిచ్చిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజలకు అండగా నిలబడదామని, వారి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాటం చేద్దామని, వైఎస్సార్సీపీని విజయపథాన నిలుపుదామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మనం అండగా నిలబడదామని భరోసా ఇచ్చారు. తన రాజకీయ జీవితంలో కార్యకర్తలు, ప్రజలు అందించిన ఆదరణను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు లభిస్తున్న గౌరవం.. మీరిచ్చిందే అంటూ కంటతడి పెట్టారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. బొత్స అడుగుజాడల్లో నడుద్దాం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ హయాం నుంచి నేటి వరకు బొత్స హయాంలో జిల్లాతో పాటుగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేశారు. తోటపల్లి సాగునీటిని తీసుకువచ్చిన ఘనత బొత్సకే చెందుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో చీపురుపల్లి నియోజకవర్గానికి వంద కోట్లతో ప్రతి గ్రామానికి నీళ్ల ట్యాంకులు నిర్మించి తాగునీరు అందించామని గుర్తుచేశారు. బొత్స అడుగుజాడల్లో నడుద్దామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పింఛన్లు దరఖాస్తులు స్వీకరిస్తున్నారే తప్ప మంజూరుచేస్తారోలేదో తెలియదన్నారు. అవసరం తీరిపోయాక ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్యగా పేర్కొన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్‌కోటాలో అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, యువ నాయకురాలు బొత్స అనూష, బొత్స సందీప్, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, మెరకముడిదాం మండల నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, పార్టీ మండలాధ్యక్షుడు తాడ్డి వేణు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, గుర్ల మండల నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సీర అప్పలనాయుడు, పార్టీ మండలాధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, వైస్ ఎంపీపీ తోట తిరుపతిరావు, నాలుగు మండలాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్‌లో పోస్టులకు 22న ఇంటర్వ్యూలు
విజయనగరం ఫోర్ట్: రెడ్‌క్రాస్ సొసైటీలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 22న రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సత్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సూపర్ వైజర్ (బీఎస్సీ ఎంఎల్టీ), డీఎంఎల్టీగా ఏడాది అనుభవం ఉన్నవారు, ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ విద్యార్హత) ఏడాది అనుభవం, స్టాఫ్‌నర్సుకు జీఎన్ఎంగా ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. సహస్ర ఘటాభిషేకం శృంగవరపుకోట: మండలంలోని పుణ్యగిరి శివాలయంలో దేవదాయ దర్మదాయశాఖ ఆదేశాల మేరకు గురువారం దృశ్య వరుణ పూజ సహస్ర ఘటాభిషేకంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పురోహితుడు లట్టాన మణిశర్మ ఆధ్వర్యంలోని వేదపండితులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. విమానాశ్రయ భూముల పరిశీలన బాడంగి: బాడంగి సమీపంలోని విమానాశ్రయ భూములను విశాఖ ఏన్డీఏకు చెందిన అధికారులు బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు, తహసీల్దార్ వరప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్డీఏకు చెందిన డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు విమానాశ్రయ గచ్చు రోడ్డును నిశితంగా పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన రన్‌వేతో కలిపి సుమారు 247 ఎకరాల భూములకు కేవలం రన్వేగచ్చు రోడ్డు 50 ఎకరాలు మినహా మిగిలిన 197ఎకరాలు రైతుల ఆక్రమణలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. ఆక్రమిత భూముల్లో ప్రస్తుతం నీలగిరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతుండడాన్ని గమనించారు. భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని రెవెన్యూ ఽఅధికారులను కోరారు. విమానాశ్రయ భూములను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఖైదీల పట్ల వివక్ష చూపొద్దు విజయనగరం లీగల్: ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎటువంటి వివక్ష చూపించరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. విజయనగరం సబ్ జైలులో గురు వారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు లో ఆమె మాట్లాడారు. ప్రతిఒక్కరూ నేర ప్రవృత్తిని విడనాడాలని హితవు పలికారు. సకాలంలో న్యాయ సహాయం అందించేందుకు జైల్ లీగల్ ఎయిడ్ క్లినిన్ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జైలులో అమలవుతున్న సౌకర్యాలను ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, భోజనశాలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, విజయనగరం అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, తదితరులు పాల్గొన్నారు. -
ఒకరు మునిగిపోయి.. మరి కొందరిని ముంచారు..
● లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు ● ట్రేడింగ్ పేరుతో కుచ్చుటోపీ ట్రేడింగ్‌తో టోకరా.. క్యూవీఎస్‌ఈ యాప్ ఎంతగా విస్తరించిందంటే ఏకంగా వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేసేంత వరకు వెళ్లింది. ప్రతి పట్టణంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఊరిలో డబ్బులు డిపాజిట్ చేసిన వారిని సభ్యులుగా చేర్పిస్తారు. ప్రతి రోజూ యాప్‌కు సంబంధించిన కోడ్ లు ఇందులో పోస్ట్ చేస్తారు.ఈ కోడ్ తోనే ట్రేడింగ్ చేయాలి అని చెబుతారు. వారందరూ దాదాపుగా డబ్బు డిపాజిట్ చేసిన వారే. ఇప్పుడు గ్రూప్ సభ్యులు అందరూ లబోదిబోమంటున్నారు. మోసపోయాం అంటూ బాధపడుతున్నారు.. గజపతినగరం రూరల్ / రాజాం సిటీ: ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు ప్రతిరోజూ వింటున్నా.. చూస్తున్నా.. మోసపోతూనే ఉన్నారు. ఒకవైపు పోలీసులు ఆన్లైన్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయినా ఈ మోసాలు ఆగడం లేదు. తాజాగా గజపతినగరం, రాజాం నియోజకవర్గాల పరిధిలో క్యూవీఎస్‌ఈ డాలర్ స్కామ్ బహిర్గతమైంది. క్యూవీఎస్‌ఈ డాలర్ల స్కామ్‌లో వేలాది మంది కూరుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆన్లైన్ మోసం జిల్లా వాసుల్లో కలకలం రేపుతోంది. మధ్య తరగతి ప్రజలు, రాజకీయ నాయకులు, చిన్న ఉద్యోగులు, మహిళలు సైతం లక్షల రూపాయలు పెట్టి మోసపోయినట్లు సమాచారం. పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తున్నాయన్న ఆశతో డిపాజిట్ చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. జిల్లాలో సుమారు రెండువేల మంది పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. రూ.50 వేలు మొదట కట్టి సభ్యుడినిగా చేరిన మూడు నెలల్లో మన డబ్బులు మనకు వచ్చేస్తాయనే ఆశతో వందలాది మంది ఈ యాప్‌లో చేరి డబ్బులు డిపాజిట్ చేశారు. కుటుంబాలకు కుటుంబాలు ఈ యాప్‌లో డబ్బు డిపాజిట్ చేసేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఒక గ్రూప్‌గా మారిపోయి ఒకరి తర్వాత ఒకరు డబ్బులు డిపాజిట్ చేశారు. మహిళలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మరీ క్యూవీఎస్‌ఈ యాప్‌లో డిపాజిట్ చేసి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మొదట జాయిన్ అయినవారు చైన్ సిస్టంలో ఒక్కొక్కరు ఐదుగురు చొప్పున రిఫర్ చేసి జాయిన్ చేస్తే బోనస్ ఇస్తామని యాప్ నిర్వాహకులు ప్రకటించడంతో చాలా మంది తాము మోసపోవడమే కాదు తమ బంధువులు, స్నేహితులను కూడా ఈ మోసంలో బాధితులను చేశారు. ఒక్కొక్కరు ఐదుగురిని జాయిన్ చేసి వారితో కూడా డబ్బులు డిపాజిట్ చేయించారు. తాము చేర్చినందుకుగాను వచ్చిన బోనస్ ఒక్కక్కరివి లక్షలాది రూపాయలు యాప్‌లో ఉండిపోయాయి. ఒక్కొక్కరు రెండేసి మూడేసి ఐడీలతో డబ్బును విచ్చలవిడిగా డిపాజిట్ చేసేశారు. ఆగస్టు 24 తేదీ నుంచి విత్ డ్రా ఆప్షన్ తీసివేయడంతో లబోదిబోమంటున్నారు. విత్‌డ్రాలు నిలిచిపోవడంతో బహిర్గతం.. గత 15 రోజులుగా విత్ డ్రాలు నిలిచిపోవడంతో సంస్థ ఏర్పాటు చేసిన మూడు రకాల వాట్సాప్ గ్రూపుల ద్వారా లావాదేవీలు జరిపిన పెట్టుబడిదారులు లబోదిబోమనడంతో మోసం బహిర్గతమైంది. కష్టపడి దాచుకున్న డబ్బంతా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ నిబంధనల ప్రకారం కొంతమంది ఖాతాల్లో లక్షల రూపాయలు లాభాలు చూపిస్తున్నా ఆ డబ్బులు విత్ డ్రా కావడం లేదు. విత్ డ్రా కావాలంటే అదనంగా మరో రూ.50వేలు డిపాజిట్ చేస్తే మీ లాభాలు చెల్లింపు చేస్తామంటూ మెసేజ్‌లు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. బోనస్ చెల్లింపులు కోసం ఈనెల 12వ తేదీ వరకు యాప్ నిర్వాహకులు గడువు ఇచ్చినట్లు, ఆ తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో పెట్టుబడిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒకరు మునిగిపోయి మోసపోయిన స్కామ్ కాదు. యాప్‌లో మొదట్లో డబ్బు రావడంతో ఇది మోసం అని తెలియక చాలా మంది మరికొంతమందిని ఇందులో జాయిన్ చేశాారు. యాప్‌లో వచ్చే రిటర్న్స్ బాగుండడంతో బయట తక్కువ వడ్డీకి అప్పు తెచ్చి యాప్ లో డిపాజిట్ చేసిన వారు కూడా ఉన్నారు. బ్యాంకులో నగలు పెట్టి డబ్బులు తెచ్చిన వారు కూడా ఉన్నారు. మహిళలు కొందరు తమకు వచ్చిన బ్యాంకు రుణం సొమ్మును ఇందులో డిపాజిట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా ఒకరేంటి చాలా మంది ఎలాగోలా డబ్బు పుట్టించి యాప్ నిర్వాహకుడికి అప్పనంగా ఇచ్చేశారు. -
కరిగిపోతున్న కాలం..!
వీరఘట్టం: ఈమె పేరు సీరాపు లిఖిత..వీరఘట్టానికి చెందిన ఈమెకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం భర్త అనార్యోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛన్ కోసం ఇటీవల వీరఘట్టం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసింది.అయితే ఆ దరఖాస్తును స్వీకరించడం లేదు. ఎందుకని ఆరా తీస్తే హౌస్ హోల్డింగ్‌లో ఆమె పుట్టింటిలో ఈమె పేరును జత చేశారు. ఈ హౌస్ హోల్డ్‌లో ఉన్న వాళ్ల నాన్నమ్మకు వృద్ధాప్యపు పింఛన్ వస్తోంది. వీరు వేర్వేరుగా నివసిస్తున్నప్పటికీ, వేర్వేరుగా రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ వారంతా ఒకే హౌస్ హోల్డ్‌లో ఉండడంతో ఆమెకు పింఛన్ పెట్టేందుకు దరఖాస్తును కంప్యూటర్ స్వీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. వింతంతు పింఛన్‌కు ఈమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు కూడా పెట్టలేని పరిస్థితి. ఇలా ఈమె ఒక్కరు మాత్రమే కాదు. ఇటువంటి వారు చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ల వల్ల పింఛన్ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. మరో నెల రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వింతతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈనెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లో లక్షకు పైగా ఉన్న అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడడం లేదు.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆపసోపాలు పడుతున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంటిలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్‌కార్డు నంబర్లను ఓకే హౌస్ హోల్డింగ్‌లో మ్యాపింగ్ చేశారు. తర్వాత కొంత మందికి పెళ్లై అత్తవారింటికీ వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్ హోల్డింగ్‌లోనే ఉన్నట్లు చూపిస్తోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించలేకపోతున్నారు. దీంతో పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేక అర్హులైన వారంతా కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. సర్వర్ ప్రోబ్లం.. వీరఘట్టం మేజర్ పంచాయతీలో నాలుగు సచివాలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి పింఛన్‌దారుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఒక్కొక్క దరఖాస్తు పరిశీలించి వారి ధ్రువీకరణ పత్రాలను స్కానింగ్ చేసి అప్లోడ్ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు అరగంట సమయం పడుతోంది. దీంతో రోజుకు ఒక సచివాయలంలో 12 నుంచి 16 కంటే ఎక్కువ రఖాస్తులు అప్లోడ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గురువారం నాటికి 350 సచివాలయాల్లో సుమారు 16 వేల దరఖాస్తులు అప్లోడ్ అప్ అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు గడువు పెంచాలి.. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 నుంచి 16 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయాయి.ఇంకా దరఖాస్తు కు ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.ఇందులో ఈనెల 12న రెండవ శనివారం,13న ఆదివారం,14న వినాయక చవితి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో దరఖాస్తు చేసుకునేందు కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయం సరిపోనందున పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని అర్హులైనవారు కోరుతున్నారు. మరో ఆరురోజులే గడువు అందులో మూడు రోజులు సెలవులు అర్హులకు పెన్షన్ టెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆపసోపాలు వెంటాడుతున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు జిల్లాలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు 1 లక్షమంది మరో వైపు మొరాయిస్తున్న సర్వర్లు సమయం పెంచాలని వేడుకుంటున్న పింఛన్ దరఖాస్తు దారులు -
శ్లాబ్ పైనుంచి పడి వ్యక్తి మృతి
నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామంలో ఓ ఇంటి శ్లాబ్‌పై పనిచేస్తున్న తాపీ పని కార్మికుడు పెందుర్తి పైడిరాజు (47) ప్రమాదవశాత్తు జారి నేలపై పడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ సంఘటనలో శ్లాబ్ పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైన పైడిరాజును వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు పైడిరాజు గుర్ల మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సంఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
గజరాజుల గమనం..కుంకీల కదనం
● సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం ● గ్రామస్తుల తీవ్ర ఉత్కంఠపార్వతీపురం రూరల్: గజరాజుల గమనం, కుంకీల కదనం మధ్య పార్వతీపురం, కొమరాడ మండలాల సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంటలు పాడుచేస్తూ, గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న అడవి ఏనుగుల గుంపునకు అడ్డుకట్ట వేసేందుకు కుంకీ ఏనుగులు అహర్నిశలు పహారా కాస్తున్నాయి. ఇటీవల ఆంధ్రా–ఒడిశా సరిహద్దులకు వెళ్లిన అడవి ఏనుగులు, అక్కడి ప్రజల తరిమివేతతో వెనుదిరిగి వచ్చి ప్రస్తుతం గంగమాంబపురం, చందలింగి, వరహాల గడ్డ రిజర్వాయర్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఈ మదపుటేనుగులు పెద్దమరికి పంచాయతీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కుంకీ ఏనుగులైన ’అభిమన్యు, జయంత్’లు కంచెలా నిలబడి సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి. బుధవారం రాత్రి ఈ రెండు గుంపులు ముఖాముఖి ఎదురుపడగా, గురువారం నాటికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మకాం వేశాయి. శిక్షకుడు సాయి, మావటీల పర్యవేక్షణలో కుంకీ ఏనుగులకు తగిన ఆహారం, నీరు అందిస్తూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పగటి పూట గిరిజన గ్రామాల్లో, మెట్ట ప్రాంతాల్లో కుంకీలు సంచరిస్తుండడంతో తమ ప్రాణ, ఆస్తులకు రక్షణ లభించిందని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాత్రివేళ ఈ రెండు గుంపులు మరింత చేరువవుతున్న తరుణంలో అటవీశాఖ అధికారులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించనున్నారు? గజరాజుల మళ్లింపు సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంటిమీద కునుకులేకుండా జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలి
చికెన్పార్వతీపురం రూరల్ : అపార క్రీడా నైపుణ్యాలకు మన్యం జిల్లా నెలవని, అయితే సరైన ఆదరణ కరవై ఆణిముత్యాల్లాంటి గిరిజన క్రీడాకారుల ప్రతిభ అడవులకే పరిమితమవుతోందని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జీవీవీఎస్ కమలాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన యువతను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కనీసం రన్నింగ్ ట్రాక్, మినీ స్టేడియం లేకపోవడం శోచనీయమన్న ఆయన.. మన్యంలో తక్షణం క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యావ్యవస్థకే మచ్చతెచ్చేలా నీట్ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు. ఏఐసీసీ ఎలక్టెడ్ మెంబర్ వైరిచర్ల శృతిదేవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యమని, క్రీడల్లో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం దక్కాలన్నారు. గిరిజన సంస్కృతి, ఆటపాటలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా జిల్లాలో పారాలింపిక్స్ తరహా క్రీడలు నిర్వహించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం నేతలు స్థానిక వాకర్స్ ప్రతినిధులు, విద్యార్థులతో క్రీడా సదుపాయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేదెల రామకృష్ణ, బాత దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ డిమాండ్ -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద కొత్తగా నిర్మించిన వంతెన సమీపంలో అదే గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోష్(37) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రివరకు బ్రిడ్జికి ఆవల వైపు ఉన్న పొలాల వద్ద స్నేహితులతో మద్యం తాగిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో బ్రిడ్జి పైన ఉన్న రహదారిపైకి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సంతోష్ మృతి చెంది ఉంటాడని తెలిపారు. శరీరంపై ఎక్కడా గాయాలు కాలేదని, కేవలం తల, నుదురు భాగంలో మాత్రమే తీవ్రమైన గాయముందని, వాహనం ఢీకొట్టగానే రోడ్డుపైనుంచి కిందికి పడిపోయి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. డీఎస్పీ ఆర్ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ టీంతో విచారణ చేపట్టారు. ఎటువంటి క్లూస్ లభించ లేదని తేల్చారు. అయితే సంతోష్ మృతి పట్ల తండ్రి తిరుపతిరావు తన కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులుతో మాట్లాడుతూ అప్పలరాజు పేట రహదారిలో వాటర్ ప్లాంట్ వద్ద బుధవారం రాత్రి 8 మంది స్నేహితులతో కలిసి సంతోష్ మద్యం తాగాడని రాత్రి 11 గంటల వరకు సంతోష్‌కు ఫోన్ పనిచేసిందని, అనంతరం ఫోన్ పనిచేయలేదని, అలాగే మృతదేహం సమీపంలోను, సంఘటనా స్థలంలో సంతోష్ ఫోన్ కూడా లభ్యం కాలేదని దీంతో ఎవరైనా గిట్టనివారు, లేదా మద్యం మత్తులో హత్య చేశారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇచ్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడికి తల్లి సింహాచలం, తమ్ముడు సాయి ఉన్నారు. ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
పాలకొండ: ఒక్క వాహనం పోయిందని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా ఐదు ద్విచక్రవాహనాల దొంగతనం గుట్టు రట్టయింది. నిత్యం వాహనాలు పోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దొంగలించి వాటిని అమ్మి ఆ సొమ్ముతో జల్సా చేస్తున్న వీరఘట్టం పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వీరఘట్టం మండలం కంబరవలస వెటర్నరీ అసిసెంట్ పశువుల ఆస్పత్రి వద్ద తన ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి విధులు నిర్వహిస్తున్న సమయంలో తన వాహనం చోరీ జరిగిందని ఈ నెల 1న వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం వీరఘట్టం–పార్వతీపురం రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్రవాహనం వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన పొందూరు మురళీకృష్ణ, చేతల చంద్రమౌళిలుగా గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ఈ విచారణలో పట్టుబడిన వాహనం చోరీ చేసినదే అని గుర్తించారు. నిందితులను తమ దైన శైలిలో విచారణ చేయడంతో ఈ వాహనంతో పాటు మరో నాలుగు పల్సర్ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన వీరఘట్టం ఎస్సై ఎస్ షణ్ముఖరావు, సిబ్బందిని డీఎస్పీ అబినందించారు. సమావేశంలో సీఐ ఎ ప్రసాద్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఐదు బైక్‌లు స్వాధీనం -
కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు విధించిన గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సంగం డిమాండ్ చేశారు. కొత్త పింఛన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 16తో ముగుస్తున్న దరిమిలా, పత్రాల సేకరణకు ఈ సమయం ఏమాత్రం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని గంగాపురం గ్రామ సచివాలయానికి గురువారం వెళ్లి, అక్కడి అడ్మిన్‌తో దరఖాస్తుల స్వీకరణలో సామాన్యులు పడుతున్న సాధకబాధకాలను ఆయన చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు దరఖాస్తులకు అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. కాగితాల కష్టాలతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారని, సకాలంలో పత్రాలు సమర్పించడానికి వారికి మరింత వెసులుబాటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లక, అర్హులందరికీ న్యాయం జరిగేలా ఆలోచించి ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కుష్ఠు వ్యాధిపై ఈనెల 11 నుంచి 24 వతేదీ వరకు ఇంటింటా కుష్ఠు రోగుల గుర్తింపు సర్వే జరగనుంది. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ప్రచారం చేసేందుకు ప్రచార వాహనాన్ని గురువారం జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్నారు. నొప్పి, స్పర్శ లేని మచ్చలు ఉంటే కుష్ఠు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇటువంటి మచ్చల పట్ల నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చన దేవి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతమక్కువ: మండలంలోని కొండబుచ్చమ్మపేట గ్రామసమీపంలో శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు గురువారం పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం మక్కువ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ ఆటోపై పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. మొత్తం 842 కేజీల బియ్యాన్ని తన సొంత మహేంద్ర ఎలక్ట్రికల్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాన్ని పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజయనగరం: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్ విరాజితుడని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అన్నారు. విశ్వనాథుని జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వేయిపడగల నవలా సృష్టికర్తకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ.. విశ్వనాథుడి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకని కొనియాడారు. కార్యక్రమంలో గురజాడ వెంకటేశ్వరప్రసాద్, సాహితీవేత్తలు చీకటి దివాకర్, కాగుపాటి నారాయణమూర్తి, ఎం.సుభద్రాదేవి, పసుమర్తి సన్యాసిరావు , గాంధీ తదితరులు పాల్గొన్నారు. బ్రోచర్ ఆవిష్కరణ విజయనగరం రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించమే లక్ష్యంగా నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) – 2026లో భాగంగా అధికారిక బ్రోచర్‌ను జేఎన్టీయూ ఉప కులపతి వీవీ సుబ్బారావు గురువారం ఆవిష్కరించారు. జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న అంతర్గత హ్యాకథాన్‌లో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ హ్యాకథాన్‌కు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా డాక్టర్ జి.జయసుమ వ్యవహరించనుండగా, విద్యార్థి సమన్వయకర్తలుగా ఎం.లిఖిత్‌కుమార్, కె.ప్రవళ్లిక వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ వకుల, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. -
దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● అధికారుల తీరుపై ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అసహనం ● శ్మశానవాటికలకు తక్షణమే దారులు కల్పించాలి: ఎంఆర్ఓలకు ఆదేశం పార్వతీపురం రూరల్: ప్రోటోకాల్ పాటించడంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఆయన ప్రత్యేక గ్రీవెన్స్, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న తమకు ఆర్డీఓ కార్యాలయం నుంచే ప్రోటోకాల్ అందాల్సి ఉండగా, ఆ బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేయడం దారుణమన్నారు. ‘ప్రోటోకాల్ పాటించకపోవడానికి మేమేమైనా వార్డు మెంబర్లమా? ఈ నిర్లక్ష్యపు తీరు పునరావృతమైతే అధికారులను కమిషన్ ముందు నిలబెడతాం. మీ కెరీర్‌కు మచ్చ తెచ్చుకోవద్దు‘ అని ఘాటుగా హెచ్చరించారు. అనంతరం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో దళితుల శ్మశానవాటికల ఆక్రమణలపై ఆయన స్పందించారు. ప్రాణం పోయాక కూడా దళితులకు ప్రశాంతత కరువయ్యేలా ఆక్రమణలు జరగడం శోచనీయమన్నారు. శ్మశానాలకు దారులు లేకపోతే, ప్రైవేటు భూములైనా సేకరించి (ల్యాండ్ అక్విజిషన్) మార్గం సుగమం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే రక్షణ గోడలు, కందకాలు నిర్మించాలన్నారు. దళిత భూసమస్యల పరిష్కారంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేసి న్యాయం చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాల మేరకు జోగంపేట, గురుగుబిల్లి ఎస్సీ వసతిగృహాలను తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. -
ముమ్మరంగా కంటి పరీక్షలు
● 607 పాఠశాలల్లో 51,235 మందికి పూర్తయిన స్క్రీనింగ్ ● 2,651 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి సన్నాహాలుపార్వతీపురం రూరల్: బడిపిల్లల భవితకు వెలుగులు పంచేలా పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య పరీక్షల పర్వం ముమ్మరంగా సాగుతోంది. జులై 15న విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ఆదేశాలతో మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ పి.విజయలక్ష్మి, డీఈఓ పి.బ్రహ్మజీరావుల సమన్వయంతో, ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ జగన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు కంటి వెలుగుల పండగను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలోని 1,563 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలే లక్ష్యంగా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ సిబ్బంది పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 607 బడుల్లో 51,235 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,651 మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించగా, వారందరికీ త్వరలో ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన సమస్యలు ఉండి, శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు చిన్నారులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారు. విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేలా 607 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు పూర్తి చేసి, కంటివెలుగులు పంచుతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
‘నమ్మినవాళ్లే మోసం చేశారు..’ ఏడ్చేసిన బొత్స
సాక్షి, విజయనగరం: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలి పరిణామాలతో కలత చెందిన ఆయన.. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను అంటూ కంటతడి పెట్టారు. అయితే తండ్రి బొత్స సత్యనారాయణ కంటితడి పెట్టడంపై ఆయన కుమార్తె బొత్స అనూష చలించిపోయారు. తండ్రిని ఓదార్చారు. గురువారం గరివిడిలో చీపురుపల్లిలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమయంలో బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) ఇటీవలె పార్టీ మారడం.. పార్టీతో కలిసి నడిచిన రోజుల్ని, అనుబంధాన్ని కొందరు కార్యకర్తలు ప్రస్తావించారు. ఆ ప్రసంగాల సమయంలో.. నమ్మినవాళ్లు మోసం చేశారంటూ బొత్స ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆపై తనను తాను సముదాయించుకుని.. ‘‘వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు.. పార్టీ మాత్రం శాశ్వతం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం పని చేయాలి. వైఎస్ జగన్ ఆశయాల కోసం కలిసి పని చేద్దాం. కష్టకాలంలో నిలబడే కార్యకర్తలే పార్టీకి నిజమైన వెన్నుదన్ను’’ అని అన్నారాయన.ఇదీ చదవండి: నేనూ ఓ కాక్రోచ్‌గా మారొచ్చు: వైఎస్ జగన్ -
నేడు చెరకు రైతుల సమావేశం
రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలు ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. చక్కెర కర్మాగారం పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. మూడుకొండల ఆవల.. 24 గంటలు సీతంపేట: కొండకోనల్లో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, సీతంపేట పోలీసులు, గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం కిండంగి పంచాయతీ గులుమూరు గ్రామానికి చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతుల పెద్దకుమా రుడు నాలుగేళ్ల వయస్సున్న సిద్ధు మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. తండ్రి ఉపాధి పనులకు వెళ్లాడు. తల్లి ఇంటివద్ద వంట పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో బాలుడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయా డు. గ్రామంలో ఎక్క డో ఓ దగ్గర ఆడుకుని వస్తాడులే అని కుటుంబ సభ్యులు అనుకున్నారు. సాయంత్రం వరకు బాలు డు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులతో కలిసి చుట్టుపక్క న గ్రామాలతో పాటు బంధువుల ఇళ్లల్లో గాలించా నా బాలుడి ఆచూకీ దొరకలేదు. వెంటనే సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ వై.అమ్మన్నరావు ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో ఎస్ఐ, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నా గాలించాయి. కొండమార్గాలు, లోయలు, దట్టమైన అడవిని జల్లెడ పడుతూ, గ్రామస్తులతో కలిపి గాలించారు. గంటలు గడుస్తు న్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో గులుమూరు గ్రామానికి ఆనుకుని కొండప్రాంతంలోని లోయ పక్కన బాలుడి ఆచూకీ కను గొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్లు దూరంగా విస్తరించి ఉన్న మూడు కొండలు దాటి బాలుడు వెళ్లిపోయాడు. రాత్రంతా వర్షంలో తడుస్తూ ఒంటరిగానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించిపోయాడు. బాలుడిని వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రాథమిక చికిత్స కోసం కుశిమి పీహెచ్‌సీకి తరలించారు. -
104 సాక్షిగా... రంగుల రాజకీయం..!
విజయనగరం ఫోర్ట్: చేసినది తక్కువైనా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబుకు మించిన రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. రెండున్నరేళ్ల పాలనా కాలంలో ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టేశారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా మోసం చేశారు. అమరావతి పనుల పేరుతో కమీషన్ల రూపంలో ప్రజాధనం లూటీ చేస్తూ... ఇప్పుడు 104 సాక్షిగా ప్రచార యావకు తెరతీశారు. రంగులు బాగున్న వాహనాలకు పసుపురంగు పులుముతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్రెడ్డి బొమ్మకనిపిస్తేనే శివాలెత్తిపోయే చంద్రబాబునాయుడు... ఇప్పుడు ఆరోగ్యసేవలను పక్కనపెట్టి ప్రచారానికి తెరతీయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవల ను నిర్లక్ష్యం చేస్తూ... ప్రజల కళ్లుగప్పేందుకు రంగు లు పులుముతున్నారంటూ పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు, నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున భృతి చెల్లించేందుకు లేని డబ్బులు రంగులతో రాజకీయం చేసుందుకు ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. రీఫ్యాబ్రికేషన్ పేరుతో 104 వాహనాలకు రంగులు పులిమేబదులు రోగులకు పూర్తిస్థాయిలో మందులు సమకూర్చితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా 6 వాహనాలను రీఫాబ్రికేషన్ (రంగులు వేయించడం) కోసం విజయవాడకు వెళ్లాయి. వాటికి పూర్తయిన తర్వాత విడతలు వారీగా అన్ని వాహనాలకు పసుపురంగు వేయనున్నారు. ఇప్పటికే 108 అంబులెన్సులకు పూర్తి స్థాయిలో చంద్రబాబు సర్కారు రంగులను మార్చేసింది. ఇప్పుడు 104 వాహనాలకు మార్చుతోంది. రోగుల ఇబ్బందులు పట్టించుకోకుండా... 104 వాహనాలకు రంగులు మార్చడంపై చంద్రబాబు సర్కారు చూపుతున్న శ్రద్ధ రోగుల ఇబ్బందులను పరిష్కరించడంలో చూపడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా 104 వాహనాల్లో మందులు పూర్తి స్థాయిలో లేక రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. రంగులు వేస్తున్నారు... రీఫ్యాబ్రికేషన్లో భాగంగా జిల్లాలోని ఆరు 104 వాహనాలకు విజయవాడలో రంగులు వేస్తున్నారు. వాటికి పూర్తయిన తర్వాత మిగతా వాటికి వేస్తారు. మందులు కొరత ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. – కె.శ్రీకాంత్, 104 జిల్లా మేనేజర్ వాహనాల రంగులు బాగున్నా పసుపు రంగు పులుముతున్న చంద్రబాబు సర్కారు ప్రచార యావకు ప్రజాధనం దుర్వినియోగం మరోవైపు మందులు లేక అల్లాడుతున్న రోగులు -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
విజయనగరం గంటస్తంభం: హక్కుల సాధన కోసం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోన్–1 సచివాలయ ఉద్యోగ సంఘాల సమైక్య(ఎస్జీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం కలెక్టరేట్ వేదికగా ఆందోళన చేశారు. రాత్రి 9.30 గంటల వరకు బైఠాయించి తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ తొలుత డీఆర్వో సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేసీ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. జేసీ వచ్చేవరకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళన కొనసాగించారు. జేసీ వచ్చాక సమస్యలను వినిపించి వినతిపత్రం అందజేశారు. గతంలో చేపట్టిన దీక్షల సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ వారం రోజుల్లో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, గడువు ముగిసినా నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని సంఘ నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న తమను విస్మరించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ మహిళా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. హామీలు ఇచ్చి చేతులెత్తేస్తే ఎలా? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. గతంలో దీక్షలు చేసినప్పుడు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చి విరమింపజేశారు. నేటీకీ ఎలాంటి స్పందన లేదు. – బి.శంకరరావు, జేఏసీ రాష్ట్ర సభ్యుడు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడతారా? గత కొన్నేళ్లుగా మా సర్వీసు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రొబేషన్ పూర్తయిన 9 నెలల బకాయి వేతనాలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మా న్యాయమైన హక్కులు. వీటిని తక్షణమే పరిష్కరించాలి. – వి.కాశీనాయుడు, జేఏసీ జిల్లా సభ్యుడు డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి వార్డుల్లో ప్రజా సేవలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. కనీస బేసిక్ పే రూ.30,000 అమలు చేయడం, శాఖాపరమైన ప్రమోషన్లు కల్పించడం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. – ఆర్.శివప్రసాద్, వార్డు జేఏసీ విజయనగరం హక్కుల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రాత్రి 9.30 గంటల వరకు బైఠాయింపు జేసీకి వినతిపత్రం అందజేసిన ఉద్యోగ సంఘ నాయకులు -
ఎవరి కోసం ఈ పనులు..?
విజయనగరం అర్బన్: ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాల్సిన అభివృద్ధి నిధులు అసలు ఎక్కడ ఖర్చవుతున్నాయి..? పట్టణంలో అత్యవసర మౌలిక వసతుల కంటే, రియల్ ఎస్టేట్ అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం పట్టణంలో వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 అభివృద్ధి పనులకు రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా అందుబాటులో ఉన్న అధికారిక నివేదికల ప్రకారం వీటిలో 97 పనులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.9.59 కోట్లు. మరో పని రూ.39.80 లక్షలతో రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ ప్రొగ్రెస్‌లో గానీ, గ్రౌండింగ్ కోసం ఎదురుచూస్తున్న పనులేవీ లేవని లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో ఫుల్.. పనుల సంఖ్యను చూస్తే దాదాపు 99 శాతం పూర్తయినట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఖర్చు పరంగా కూడా దాదాపు 96 శాతం విలువైన పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే నగరంలోని శివారు కాలనీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కామాక్షినగర్, ధర్మపురి, వైఎస్సార్‌నగర్, గాజులరేగ, మజ్జిపేట, బీసీ కాలనీ, దుప్పాడ, తదితర శివారు ప్రాంతాల్లో నేటీకి గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోడ్ల మీదనే వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవసరం ఉన్నచోట కాకుండా అవసరం లేని చోట్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. లే అవుట్లకు ఎందుకంత ప్రాధాన్యం.. ప్రత్యేక పాలనలో ఉన్న సమయంలో అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో అధికార యంత్రాంగం మాటే చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్థితిని అధికార పా ర్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జనావాసాలు లేని ప్రాంతాల్లో వెడల్పాటి రహదారులు, లే అవుట్లు, రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లే అవుట్లలో సంబంధిత యజమానులు రోడ్లు వేయాలి. కాని ఇక్కడ ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించి, లేఅవుట్ యజమానులకు మేలు చేస్తున్నారు. ఇప్పటికే జనాభా అధికంగా ఉన్న.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏయే పనులు ఏ ప్రాంతాల్లో చేపట్టారు..? వాటి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి..? ఆయా రహదారుల వల్ల ప్రస్తుతం ఎంతమంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది..? రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు ప్రయోజనం కలిగే ప్రాంతాల్లో చేపట్టిన పనుల సంఖ్య ఎంత..? వంటి వివరాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లే అవుట్లలో రహదారుల జోరు శివారు కాలనీల్లో అధ్వానపు తీరు రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేస్తున్న అధికారులు కాలనీ వాసులకు తప్పని ఇక్కట్లుసామాజిక ప్రయోజనం ఎంత..? 98 పనులకు దాదాపు రూ.10 కోట్ల నిధులు వెచ్చించిన నేపథ్యంలో.. ప్రతి పనికి సంబంధించిన వార్డు, ప్రాంతం, పనితీరు, వ్యయం, రహదారి పొడువు, లబ్ధిదారుల సంఖ్య, తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు. అధికారిక లెక్కల్లో పనులు దాదాపు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆ పనుల్లో ఎన్ని ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాయి? ఎన్ని భవిష్యత్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతాల్లో ఉన్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధులు ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యమా.. లేక ప్రజలకు అత్యవసరమైన చోటే ఖర్చు చేయడమే అసలు లక్ష్యమా? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
12న వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. కొందరు పార్టీని వీడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ శ్రేణులంతా త్వరలో జరగనున్న స్థానిక సమరానికి సన్నద్ధం కావాలన్నారు. సమాజం అంటే భయం, భక్తి ఉండాలని, అప్పుడే గౌరవం లభిస్తుందని వాఖ్యానించారు. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నాయకులే ప్రధాన బలమన్నారు. ఇకపై వారితోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టంచేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయ్యాయన్నారు. విజయనగరం జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 12న ఉదయం 10 గంటలకు పూల్‌బాగ్‌లోని జగన్నాథఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, పార్టీలోని రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారని స్పష్టంచేశారు. అలాగే, ఈ నెల 16 నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశాలు అనంతరం మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణులంతా స్థానిక సమరానికి సమాయత్తం కావాలి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు -
సేంద్రియ పంటల పరిశీలన
కురుపాం: మండలంలో జట్టు సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న పంటలను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్ సైట్ సర్వీసెస్ (ఓఐఓఎస్) చెందిన సభ్యులు కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం పరిశీలించారు. ఆగంగూడ, తిత్తిరి, బొడ్డమానుగూడ, దూళికుప్ప గ్రామాల్లో పర్యటించి, జట్టు సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనసాగుతున్న జీవనోపాధి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా నాటుకోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని వారు అభిప్రాయపడ్డారు. 12న ఉరుసు ఉత్సవం విజయనగరం క్రైమ్: స్థానిక కుముందన్ వీధిలో ఈ నెల 12వ తేదీన హజ్రత్ సయ్యద్ బాబా ఉరుసు ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ దాదా, షేక్ జాన్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు దర్గా వద్ద విశాఖపట్నానికి చెందిన హఫీజ్ ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు. తొలుత దర్గా నుంచి చందనోత్సవం ఊరేగింపు అట్టహాసంగా జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రతి గ్రామంలో కుష్టువ్యాధిపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్. జీవనరాణి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కుష్టువ్యాధి కేసుల గుర్తింపుపై పీహెచ్సీ వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుష్టువ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. మేల్ వలంటీర్, ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఇంటింటి చేపట్టి, అనుమానితులను గుర్తించి, వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణధికారి కె. రాణి, తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి నెల్లిమర్ల రూరల్: విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్సీలకు కేటాయించాలని జైభీమ్‌రావ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య కోరారు. ఇదే విషయమై ఆయన మండలంలోని సతివాడ గ్రామంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించలేదని, దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఎస్సీలకు జెడ్పీ చైర్మన్ సీటు కేటాయించాలన్నారు. ఎస్సీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజయనగరం క్రైమ్: స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక, విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు కోలగట్ల శ్రావణి హాజరై కాసేపు ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని, రోజులో ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. శ్రీకృష్ణుడు బోధనలు అనుసరణీయమని, ఆయన అనుసరించిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం పురవీధుల్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించారు. రాజీవ్‌నగర్ కాలనీ, దాసన్నపేట, రింగురోడ్డు, కోట జంక్షన్ మీదుగా సాగిన ఈ ఊరేగింపులో పలువురు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో అలరించారు. -
మున్సిపాలిటీ నుంచి తొలగించండి..
● గ్రామసభలో అధికారులకు తేల్చి చెప్పిన కొత్తవలస గ్రామస్తులురాజాం: రాజాం మున్సిపాలిటీలో రోజుకొక వివాదం తెరమీదకు వస్తోంది. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి ఎలాకై నా ఎన్నికలు జరిపించేందుకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన కొత్తవలస గ్రామస్తులు.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల కిందట తమకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. దీంతో కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి స్పందిస్తూ కొత్తవలస గ్రామంలో గ్రామసభ నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎంపీడీఓ ఆనందరావు, పట్టణ సీఐ నవీన్‌కుమార్, తదితరులు గ్రామంలో బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ వేదికకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. పంచాయతీగా ఉంటాం.. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ గ్రామం 2005కు ముందు ఏ మాదిరిగా పంచాయతీగా ఉందో అదేవిధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీగా ఉంటే తమకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్‌గా చేసుకుని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుంచి సక్రమంగా పారిశుధ్య పనులు కూడా చేపట్టడం లేదని వాపోయారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉంగటి శంకర్, తవిటినాయుడు, వాన అసిరినాయుడు, బట్న మురళీకృష్ణ, హరి, వాన అలివేలమ్మ, ఉంగటి సూరీడు, పసుపురెడ్డి సత్యవతి, నక్క గౌరి, వాన రమణమ్మ, తదితరులు మాట్లాడారు. టీడీపీ నేతల కొత్త డ్రామా.. ఇదిలా ఉండగా గ్రామసభ జరుగుతుండగా ఈ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికారులను కలిశారు. గోపాలపురం, అమ్మవారికాలనీ, ఆదర్శనగర్, తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలోనే ఉంచాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఇంతపెద్ద ఎత్తున కొత్తవలసలో ప్రజలు మున్సిపాలిటీని వ్యతిరేకిస్తుంటే, ఆ గ్రామసభకు టీడీపీ నేతలు నేరుగా వచ్చి పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలోనే ఉంచాలనే వినతిపత్రం ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. -
ఓవరాల్ చాంపియన్‌గా విశాఖ రేంజ్
● క్రీడాకారులను అభినందించిన ఐజీ గోపీనాథ్ జెట్టీవిజయనగరం టౌన్: మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు వరకు నిర్వహించిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 విభాగాల నుంచి సుమారు 1900 మంది పోలీసు అధికారు లు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్ మొత్తం 338 పతకాలు ( 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు) సాధించి రాష్ట్రస్ధాయిలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఐజీ విజేతలను బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరం జిల్లా పోలీసులు 39 స్వర్ణాలు, 21 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 74 పతకాలు సాధించారని చెప్పా రు. విశాఖ సిబ్బంది 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు.. అనకాపల్లి జిల్లా సిబ్బంది 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలు.. శ్రీకాకుళం జిల్లా సిబ్బంది 18 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు.. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు 14 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా సిబ్బంది 12 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారన్నారు. -
నేర నియంత్రణపై సమీక్ష
విజయనగరం టౌన్: నేర నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, నేరస్తులపై చర్యలు, ప్రజా భద్రత, తదితర అంశాలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ విశాఖ పట్టణంలోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్‌రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాలు పాల్గొని.. జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎన్డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సోషల్ మీడియా క్రైమ్స్, పల్లెనిద్ర, డిజిటల్ అరెస్టులు, మెగా వెహికల్ చెకింగ్లు, వినాయక చవితి పండగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..!
● ఎన్నో మెలికలతో ప్రకటన విడుదల ● అర్హులందరికీ పెన్షన్లు అనుమానమే ● బడ్జెట్, వాయిదా పద్ధతిన మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వంబలిజిపేట: పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్నాయి. దీంతో అర్హులైన ప్రతివారికీ పింఛన్ వస్తుందనే నమ్మకం లేదనే చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కూటమి ప్రభుత్వం పింఛన్ల మంజూరుకు ప్రకటన జారీ చేసిందే తప్ప.. లబ్ధిదారులపై ఎటువంటి ప్రేమలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేశారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపు, దశలవారీగా మంజూరు అంటూ కొన్ని మెలికలు పెట్టారు. దీంతో పెన్షన్ల మంజూరులో పారదర్శకత కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచే పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడు వారి నుంచి సెర్ఫ్‌కు, అక్కడ నుంచి ప్రభుత్వం వద్దకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేరుతాయి. ఎంపీడీఓను దాటిన తర్వాత సెర్ఫ్‌కు వెళ్లేటప్పుడు అంతా జంతర్,మంతర్ జరగవచ్చని.. ఈలెక్కన అర్హులకు మొండిచేయి మిగులుతుందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ని పింఛన్లు అని చెప్పి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన వాటిని పచ్చ నాయకులు సర్దుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో మెలికలు.. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలనే నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ పరిస్థితి లేదు. దీంతో వారు ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు కనుక అలాంటి వారిని తప్పించే అవకాశం ఉంది. ఇక డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకోవాలంటే సాంఘిక సంక్షేమ శాఖ జారీచేసిన సర్టిఫికెట్‌ను పొందుపరచాల్సి ఉంది. అది ఇప్పుటికప్పుడు కష్టసాధ్యంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒంటరి మహిళలకు సంబంధించి వివాహితురాలైతే కోర్టు లేదా అదాలత్ నుంచి విడాకుల పత్రం.. అవివాహితురాలైతే తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశాలే. ఎలా దరఖాస్తు చేసేది.. సమయం తక్కువుగా ఉంది. సచివాలయాల్లో సిబ్బంది కూడా పెద్దగా లేరు. సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పైగా లేనిపోని నిబంధనలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దరఖాస్తు ఎలా చేసేది. – దయానంద్, దరఖాస్తుదారు, పెదపెంకి -
రహదారులా.. నరకకూపాలా..?
● పాలకులకు పట్టదు.. అధికారులకు చేతకాదు.. ● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గిరిజనంకురుపాం: మండలంలోని రహదారులకు మోక్షమెప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లు తేలి గోతులమయంగా మారిన రహదారులతో గిరిజనులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారులు తప్పనిసరిగా ఉండాలి.కాని మండల పరిధిలోని చాలా గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం 104, 108 వాహనాలు కూడా రావడం లేదు. తమ గ్రామాలకు రహదారులు మంజూరు చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు గతంలో వినతిపత్రాలు అందజేసినా, అదుగో.. ఇదుగో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పరిష్కార మార్గం చూపడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీలకంఠాపురం పంచాయతీలోని గంగన్నదొరవలస గ్రామ రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో పాటు వర్షం పడితే బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరడ గ్రామ రహదారి కోసం గ్రామస్తులు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసనలు తెలియజేసినా అధికారుల్లో గాని పాలకుల్లో గాని చలనం రాకపోవడం విశేషం. ఉదయపురం పంచాయతీలోని రెల్లిగూడ గ్రామస్తులు అధికారులు, నాయకులు స్పందించక పోవడంతో శ్రమదానంతో గ్రామానికి రోడ్డు వేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. అదే పంచాయతీలోని జాకరగూడ గ్రామానికి వెళ్లే రహదారి కూడా బురదమయంగా ఉండడంతో గతంలో నాట్లు వేసి గిరిజనులు నిరసన తెలిపారు. ఇన్ని రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో గాని పాలకుల్లో గాని స్పందన రాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేయకతప్పదని ఆయా గ్రామాల గిరిజనులు స్పష్టం చేశారు. -
గడువులోగా సౌర లక్ష్యాలు పూర్తి కావాలి
● ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పార్వతీపురం రూరల్: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లకు ఉద్దేశించిన రూఫ్‌టాప్ సోలార్ పనులను శరవేగంగా సాగించి, నిర్దేశించిన గడువులోపు వంద శాతం పూర్తి చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. స్థానిక పార్వతీపురం మన్యం సర్కిల్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది, సోలార్ వెండార్లతో సౌర విద్యుదీకరణ (యూఎల్ఏ) ప్రగతిపై ఆయన మంగళవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ ఉద్యోగులు, వెండార్లు ఎదుర్కొంటున్న సాంకేతిక ఆటంకాలు, సందేహాలను అడిగి తెలుసుకున్న ఆయన.. వాటికి తక్షణ పరిష్కార మార్గాలు సూచించారు. పనుల్లో అలసత్వం వీడి, సమన్వయంతో అడుగులు వేస్తూ సౌర విద్యుత్ ప్రక్రియను లక్ష్యానికి అనుగుణంగా పరుగులు పెట్టించాలని దిశానిర్దేశం చేశారు. సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) పి.త్రినాథరావు, జనరల్ మేనేజర్ (నోడల్ ఆఫీసర్) కె.సత్యనారాయణ, సాంకేతిక ఈఈ డి.పురుషోత్తం, పాలకొండ ఈఈ కె.విష్ణుమూర్తితో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...
● వైఎస్సార్సీపీ నాయకునిపై ఓ వ్యక్తి దౌర్జన్యంగజపతినగరం రూరల్ (జామి): ‘అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...అమ్మ తోడు...’ ఇది ఓ సినిమాలో ఓ ప్రముఖ కథనాయకుడు చెప్పిన డైలాగ్. ఇది అప్పట్లో బాగానే వర్కవుట్ అయ్యింది. సినిమా కూడా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా చూశాడో ఏమోగాని... ప్రస్తుతం ఓ వ్యక్తి వైఎస్సార్సీపీ నాయకుడిని ఇలాగే... బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...జామి మండలం భీమసింగి గ్రామంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పాండ్రంగి సంజీవిపై అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు దౌర్జన్యానికి దిగిన సంఘటన ఇది. దీనిపై పాండ్రంకి సంజీవి జామి పోలీసులకు సోమవారం ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే విషయమై సంజీవి స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు వెల్లడించారు. భీమసింగి గ్రామకంఠం సర్వే నంబరు 120లో సంజీవికి 19 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలానికి అడ్డంగా అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు సోమవారం ట్రాక్టర్ లోడ్ రాయి తీసుకువచ్చి వేయించాడు. దీంతో సంజీవికి తన స్థలంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన సంజీవిపై శంకరరావు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది.. అడ్డొస్తే నరికి చంపుతానని.. బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో గత్యంతరం లేక సంజీవి జామి పోలీసులను ఆశ్రయించాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వీర జనార్దన్ మంగళవారం తెలిపారు. దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పలువురు జిల్లా క్రీడాకారులకు అవకాశం లభించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు అర్హత సాధించారు. జావిలిన్ త్రోలో ఉదయ్, 400 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.సందీప్, త్రిపుల్ జంప్‌లో పి.పవన్‌కళ్యాణ్, 400/800 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.యశోద జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్కిషోర్లు అభినందించారు. -
గడువులోగా పింఛన్ల ప్రక్రియ పూర్తి కావాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన నమోదు, క్షేత్ర స్థాయి పరిశీలన, అర్హత నిర్ధారణ పక్రియలను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు డిజిటల్ అసిస్టెంట్లు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు కొత్త పింఛన్లు దరఖాస్తులను స్వీకరించి ప్రాధమిక వివరాలను పరిశీలించి ఎస్జీఎస్డబ్ల్యూ న్యూ పెన్షన్ సర్వీసులో ఆన్లైన్లో నమెదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తు విజయవంతంగా నమోదు చేసిన వెంటనే దరఖాస్తుదారునికి సిస్టమ్ ద్వారా జనరేట్ అయ్యే అకనాలెడ్జ్మెంట్ అందజేయాలన్నారు. ెఈ నెల 17 నుంచి 21 వరకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు వార్డు వేల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శులు అర్హత కల్గిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. దరఖాస్తుదారుల నివాసాలకు వెళ్లి అర్హత ప్రమాణాలు, సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించి, భౌతిక పరిశీలన నివేదికను నమోదు చేయాలన్నారు. దరఖాస్తు ఈకేవైసీ పూర్తి కాని వారి నుంచి క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలో ఈకేవైసీ తీసుకోవాలన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ల దరఖాస్తులను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఒంటరి మహిళల దరఖాస్తులను తహసీల్దార్లకు, నేత కార్మికులు, మత్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీ దారులు, తాటి చెట్టు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్ల వర్గాలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా స్థాయి అధికారులకు పంపించాలన్నారు. ఎంపీడీఓలు పింఛన్లను నేరుగా మంజూరు చేయరాదని, అర్హులైన దరఖాస్తులను సంబంధిత రాష్ట్ర స్థాయి లేదా సెర్ప్ అధికారులకు సిఫార్సు చేయాలన్నారు. పింఛను మంజూరు అయిన నెల నుంచే పింఛను చెల్లింపు ఉంటుందన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసపాణి తదితరులు పాల్గొన్నారు. -
విద్య భవిష్యత్‌కు పునాది
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరంలీగల్: విద్య భవిష్యత్‌కు పునాది అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ బబిత అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మాట్లాడుతూ అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి తన హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన రక్షణ గురించి తెలుసుకోవాలన్నారు. చిన్నారుల భవిష్యత్‌కు విద్య పునాది అని పాఠశాల విద్యను మధ్యలోనే నిలిపివేయకుండా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. డ్రాపౌట్ పిల్లల కుటుంబాలకు విద్య ప్రాముఖ్యత, పిల్లల హక్కులు, బాల కార్మికత్వం, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వ విద్యా పథకాలు, అందుబాటులో ఉన్న న్యాయ సహాయం గురించి వివరించారు. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత ప్రభుత్వ విభాగాలను, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి అవసరమైన ఉచిత న్యాయ సహాయం, మార్గదర్శకత్వం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ అధికార సంస్థ సెక్రటరీ డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం మండల విద్యాశాఖాధికారి ఆనందమూర్తి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్టుమెంటు హెడ్ నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అడ్డొచ్చిన వ్యక్తిపై హత్యాయత్నం
గంట్యాడ: డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను వేధిస్తూ వారిపై దాడికి యత్నించిన యువకుడిని అడ్డుకున్న వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని మధుపాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మధుపాడ గ్రామానికి చెందిన సీహెచ్ విజయ్‌కుమార్ తన తల్లిదండ్రులు సన్యాసిప్పుడు, ఈశ్వరమ్మను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి యత్నించాడు. అదే సమయంలో సమీపంలో ఉన్న ద్వారపురెడ్డి కృష్ణ అడ్డుకోవడంతో విజయ్‌కుమార్ ఆయుధంతో అతడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణ చెవికి తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి రలించారు. ఘటనపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సాయికృష్ణ తెలిపారు. కారు షెడ్లో అగ్ని ప్రమాదం కొత్తవలస: మండలంలోని అరుకు–విశాఖ జాతీయ రహదారిని ఆనుకొని అడ్డూరువానిపాలెం గ్రామం సమీపంలో గల ఎస్ఎల్జీ కార్ కేర్ కార్ మెకానిక్ షెడ్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో షెడ్లో గల మూడు కార్లు, రెండు పాత కార్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద వార్త తెలుసుకొని కొత్తవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు షెడ్ యజమాని కె.గౌరీపతి తెలిపారు. 10 నుంచి జేవీవీ ఆధ్వర్యంలో వక్తృత్వ, కథల పోటీలు విజయనగరం అర్బన్: విద్యార్థులను మంచి ఉపన్యాసకులుగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వారిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి వక్తృత్వ, కథల పోటీలను నిర్వహించనున్నట్టు జేవీవీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, డాక్టర్ మిరియాల కృష్ణారావు తెలిపారు. కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వారు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజేతలకు నగదు పురస్కారాలతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. జేవీవీ జాతీయ నాయకుడు గండ్రేటి లక్ష్మణరావు, గండ్రేటి అప్పలనాయుడు, జిల్లా కోశాధికారి శివాజీ, తిరుపతిరావు, చిరంజీవి, సత్యనారాయణ, ఈశ్వర్ పాల్గొన్నారు. -
స్పీడ్ మ్యాథ్స్‌లో కియాన్ష్ జాతీయ స్థాయి గుర్తింపు
బొబ్బిలి: మలేసియాకు చెందిన యూసిమాస్(యుసీఎంఏఎస్) అనే అంతర్జాతీయ స్పీడ్ మ్యాథ్స్ ఆర్గనైజేషన్ ముంబయిలో నిర్వహించిన స్పీడ్ మ్యాథ్స్ పోటీల్లో బొబ్బిలికి చెందిన జాగరపు కియాన్ష్ మూడో స్థానం(సెకండ్ రన్నరప్) పొందాడు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పాల్గొన్న పరీక్షలో కియాన్ష్ ఈ స్థానం పొందాడు. ముంబయిలో ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు. పోటీలో పాల్గొనేందుకు రాష్ట్ర స్థాయి పరీక్ష గత నెల 2న గుంటూరులో నిర్వహించగా అందులో ప్రధమ స్థానం సాధించాడు కీయాన్ష్. కేవలం 8 నిమిషాల వ్యవధిలో 200 లెక్కలను చేయాల్సి ఉండగా అన్ని లెక్కలూ పూర్తి చేసినట్టు తల్లిదండ్రులు డాక్టర్ రమేష్, బేబీ ప్రత్యూష తెలిపారు. మొత్తంగా 2వేల మార్కులకుగాను రెండు వేల మార్కులను కేవలం మైండ్ కాలిక్యులేషన్తో సాధించినప్పటికీ వయసు రీత్యా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కియాన్ష్ స్థానిక శ్రీనిధి డీజీ స్కూల్లో మూడో తరగతి చదువుతుండగా తండ్రి జిల్లా కేంద్రంలో న్యూరో డాక్టర్‌గా సేవలందిస్తుండగా తల్లి ప్రత్యూష సాఫ్ట్వేర్. కీయాన్ష్ సాధించిన ఈ ప్రతిభకు పట్టణ వాసులు, విద్యావేత్తలు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘అక్షరాలా అమరజీవి’ పుస్తకావిష్కరణ
విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సమగ్ర జీవిత చరిత్రపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట పురస్కార సేవాగ్రహీత సముద్రాల గురుప్రసాద్ రాసిన అక్షరాలా అమరజీవి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖింపజేసిన మహనీయుడన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు తేజం పొట్టి శ్రీరాములు జీవనయానం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు తవ్వా మోహనరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు బోండా రమేష్, కార్యదర్శి బాలకృష్ణ, పట్టణ శాఖ అధ్యక్షుడు గాయత్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో పోలీసుల మెగా డ్రైవ్
● 150 ప్రాంతాలు.. 800 మంది పోలీసులు ● స్వీయపర్యవేక్షణ చేసిన ఎస్పీవిజయనగరం టౌన్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రహదారి భద్రత, హెల్మెట్ ధారణ పట్ల అవగాహనే లక్ష్యంగా పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టి, స్వీయపర్యవేక్షణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వాహన తనిఖీలను చేపట్టేందుకు 150 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామన్నారు. తనిఖీల్లో 800 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగించామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలను వాహనదారులకు వివరించి, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని సూచించామన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఈ చలానా విధించేందుకు బదులుగా వెంటనే ఆయా వాహనాలకు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తనిఖీల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా
● పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి ● నేర సమీక్షా సమావేశంలో ఎస్పీవిజయనగరం టౌన్: నిందితులు శిక్షింపబడే విధంగా కేసుల దర్యాప్తులో సాక్షులను, సాక్ష్యాధారాలను సేకరించాలని, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసే ముందు అప్పటివరకూ పూర్తి చేసిన కేసు దర్యాప్తును ఒకసారి పునః సమీక్షించుకోవాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేసుల దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన క్రైమ్ ప్రాపర్టీని సురక్షితంగా ఒక క్రమపద్ధతిలో భద్రపర్చుకోవాలని, విచారణ సమయంలో వాటిని తిరిగి న్యాయస్ధానంలో ప్రవేశపెట్టాలన్నారు. నిందితులకు విచారణ, అరెస్టు సమయంలో వారు తెలిపే వివరాలు సరైనవా? కావా? అన్నది ముందుగా అధికారులు నిర్ధారణ చేసుకోవాలన్నారు. నేరాలు, దొంగతనాలు జరిగేందుకు ఎక్కువగా అవకాశమున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఏటీఎం కేంద్రాలు, సెల్ టవర్స్ వద్ద సీసీ కెమెరాలు పెట్టే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను పార్టీలకతీతంగా గుర్తించి, వారిని ఎంఈఎం కోర్టులో బైండోవరు చేయాలని, మంచి ప్రవర్తనకు వారి నుంచి పూచీకత్తుగా బాండ్లను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ జరిగే విధంగా అధికారులు ప్రణాళికబద్దంగా పని చేయాలన్నారు. సమావేశంలో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పీఎస్ డీఎస్పీ పివివి.నరసింహారావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయసలహాదారు వై.పరశురాం, పలువురు సీఐలు, ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పదాల సవ్వడి.. పుర్రేయవలస బడి...
చీపురుపల్లి: ఆ పాఠశాలకు వెళ్తే తరగతి గదుల్లో గోడలు ఖాళీగా కనిపించవు. విద్యార్థులు నుంచి తెలుగు, ఆంగ్ల పదాలు తప్ప మరో మాట వినిపించదు. తరగతి గది గోడలపై ఎటు చూసినా ఏదో ఒక యాక్టివిటీ కనిపిస్తుంది. విద్యార్థులకు ఆ రోజంతా ఏదో ఒక యాక్టివిటీతోనే గడిచిపోతుంది. అందుకనే ఆ పాఠశాలకు ఎవరు వెళ్లినా పదాల సవ్వడితో సందడిగా ఆహ్వానం పలుకుతుంది. అదే మండలంలోని పుర్రేయవలస బడి. ఇక్కడి పాఠశాలలో ఏదో ఆదరా బాదరగా పాఠ్యాంశాలు బోధన ఉండదు. ప్రతీ సబ్జెక్టులోనూ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం) వినియోగిస్తూనే బోధన సాగిస్తుండడంతో విద్యార్థుల్లో ఆ పాఠ్యాంశం ఆకట్టుకుంటుంది. ఉపాధ్యాయుల్లో ప్రత్యేక శ్రద్ధ ఉండాలిగాని ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగుతుందని చెప్పడానికి పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల తరగతి గదుల్లో అనుసరిస్తున్న విద్యాబోధన నిదర్శనంగా నిలుస్తోంది. తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో తరగతి గోడలు ఖాళీగా ఉండవు. ఎటు వైపు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలతో కూడిన చార్టులు, చిత్రాలు దర్శనమిస్తాయి. తెలుగు, ఇంగ్లిష్‌లో కఠిన పదాలు నుంచి ఇంగ్లిష్ గ్రామర్‌కు సంబంధించిన చార్టులు, కాన్సెప్ట్ వంటి ఎన్నో చార్టులు పాఠశాల హెచ్ఎం ఎంవి.భారతి, సహాయ ఉపాధ్యాయుడు అప్పలనాయుడులు తమ ఇళ్ల వద్ద స్వంతంగా తయారు చేసి పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు బోధిస్తుంటారు. విద్యార్థులకు సులభంగా అర్థమవ్వడం కోసం ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్ంఎ ద్వారానే బోధిస్తుంటారు. టీఎల్ఎం, చార్టులు, చిత్రాలు తయారీకు ఎలాంటి నిధులు ఉండకపోయినప్పటికీ స్వంత నిధులతోనే సిద్ధం చేస్తుంటారు. ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రెండు, మూడు తరగతుల నుంచి ఇంగ్లిష్ గ్రామర్ బోధన వింటుంటాం. అయితే వారికి ధీటుగా పుర్రేయవలస ప్రాధమిక పాఠశాలలో కూడా ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్ బోధిస్తున్నారు. గ్రామర్‌కు సంబంధించి టెన్సెస్, వెర్బ్, యాడ్జెక్టివ్, నౌన్, ప్రౌనౌన్ వంటి గ్రామర్ అంశాలు అక్కడ విద్యార్థులకు చిన్న వయస్సులోనే పరిచయం చేస్తున్నారు. తెలుగులో సైతం గుణింతాలు, ద్విత్తక్షరాలు, గణితంలో టేబుల్స్ తదితర చార్టులు ప్రదర్శించి నిరంతరం విద్యార్థులతో సాధన చేయిస్తుంటారు. ప్రాధమిక స్థాయిలోనే ఇంగ్లిష్ గ్రామర్‌లో తర్ఫీదు తరగతి గదిలో ఎటు చూసినా తెలుగు, ఇంగ్లిష్ పదాలే.. ప్రతీ పాఠ్యాంశాన్ని టీఎల్ఎం ద్వారా బోధనప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి పాఠశాలకు వచ్చే పిల్లలకు ప్రాధమిక స్థాయిలోనే మంచి పునాది ఉండాలి. ప్రభుత్వ పాఠశాలకు పేద వర్గాలకు చెందిన పిల్లలే వస్తారు. అలాంటి వారిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యం. అందుకనే ఇంగ్లిష్, తెలుగులో ప్రతీ పాఠానికి టీఎల్ఎం ద్వారా బోధిస్తాం. ఇంగ్లిష్ గ్రామర్‌లో నౌన్స్, టెన్సెస్, స్పెల్లింగ్స్, కాన్సెప్ట్ మ్యాపింగ్, పిక్చర్ డిస్క్రిప్షన్ వంటి బోధన సాగిస్తున్నాం. తరగతి గది మోడల్‌గా ఉంటే విద్యార్థులు కూడా అంతే ఆదర్శంగా తయారవుతారు. – ఎంవి.భారతి, హెచ్ఎం, పుర్రేయవలస ప్రాధమిక పాఠశాల, చీపురుపల్లి -
సామాజిక సేవలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిది
● మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం: సామాజిక సేవలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం జిల్లా ఆర్యవైశ్య సంఘం 2026–28 సంవత్సరాలకు సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయనగరంలోని ఓ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కష్టపడి సంపాదించిన ధనంలో కొంతభాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించడం అభినందనీయమన్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులకు వెన్నుదన్నుగా ఉంటూ పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్ముయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషిచేస్తుందన్నారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజని మాట్లాడుతూ ఆర్యవైశ్య మహిళలకు ఆర్థిక చేయూత, స్వయం ఉపాధి కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తామన్నారు. నూతన జిల్లా అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ, సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు త్వరలోనే స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌తో పాటు ప్రధాన కార్యదర్శిగా రవ్వా వెంకటేష్, కోశాధికారిగా గుడిశా బాలకృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రవ్వా మంజు, ప్రధాన కార్యదర్శిగా కొల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారిగా గుంపిన ఇందిర, యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా తమ్మన కల్యాణరాజు, ప్రధాన కార్యదర్శిగా కేదారిశెట్టి లక్ష్మణమూర్తి, కోశాధికారిగా దేవరపల్లి కిరణ్ కుమార్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత పూర్వ అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు పర్యవేక్షణలో వాసవీమాత చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాటూరి రంగనాథ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కండె నాగరాజేష్, వ్యాపారవేత్త అంబికా కృష్ణ, వైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కుసుమంచి సుబ్బారావు, ఆలవెల్లి శేఖర్, కుమ్మరిగుంట శ్రీనివాసరావు, ఈశ్వరరావు, డిమ్స్ రాజు, మడిపల్లి రామారావు, గుడిశా శివకుమార్, శ్రీనివాసరావు, తవ్వా మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు విజయనగరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు పిలుపునిచ్చారు. సహజ వనరుల సంరక్షణ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం, హరిత క్యాంపస్ అభివృద్ధి, క్రీడలు–ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను సమగ్రంగా అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ ఫర్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైన్బిలిటీ కార్యక్రమం రూపొందించారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను కళాశాలలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యా సంస్థలు కేవలం సాంకేతిక విద్యను అందించడమే కాకుండా పర్యావరణ బాధ్యత, శక్తి సంరక్షణ, స్థిరమైన అభివృద్ధి పట్ల విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించాలని కోరారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వకుళ మాట్లాడుతూ నీరు, సహజ వనరుల సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం–హరిత క్యాంపస్ అభివృద్ధి, క్రీడలు–ఆరోగ్య పరిరక్షణ అనే ఆరు ప్రధాన విభాగాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల భాగస్వామ్యం పెంపొందించేందుకు గ్రీన్ ఎనర్జీ క్లబ్, ఆక్వా క్లబ్, ఎకో వేస్ట్ క్లబ్, గ్రీన్ హార్వెస్ట్ క్లబ్, ఎనర్జీ సేవర్ క్లబ్, ఫిట్ ఇండియా క్లబ్‌లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. క్యాంపస్‌లో ఎనర్జీ, వాటర్ ఆడిట్, వర్షపు నీటి సంరక్షణ, వ్యర్థాల వర్గీకరణ–కంపోస్టింగ్, సౌర, పవన్ శక్తి వినియోగం, సేంద్రియ సాగు, గ్రీన్ క్యాంపస్ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విద్యార్థులను పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమాన్ని సస్టైన్‌బుల్ డవలప్మెంట్ గోల్స్‌తో అనుసంధానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి రిజిస్ట్రార్ కేసీబీ రావు, ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఇంజనీర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పద్మజ, ఈసీఈ ఇన్చార్జి విభాగాధిపతి జి.అప్పలనాయుడు, ఎన్ఎస్ఎస్ విభాగం అధికారి బి.ధర్మారావు, వివిధ విభాగాల ఆచార్యులు, విద్యార్థులు, పాల్గొన్నారు. -
పింఛన్ కోసం పాట్లు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. మొన్నటివరకు కొత్త పింఛన్ల మంజూరుకు అర్హుల నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించలేదు. 50 ఏళ్లు వయస్సు దాటినవారందరికీ పింఛన్లు ఇస్తామన్న ఎన్నికల హామీని విస్మరించింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటిరి మహిళలు, కళాకారులు, తదితర వర్గాల వారు ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు సచివాలయాలు, ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, సర్వర్ డౌన్, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడంలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులు పట్టుకుని సచివాలయాల్లో పడిగాపులు కాస్తున్నారు. దీనికి విజయనగరం రింగ్‌రోడ్డులోని బొందిలిగూడెం సచివాలయంలో మంగళవారం కనిపించిన చిత్రాలే సజీవ సాక్ష్యం. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలి
● పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ఈకేవైసీ, వెబ్‌ల్యాండ్ ప్రక్రియ, రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులు, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్లు, 22ఏ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఆరా తీశారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అక్టోబర్‌లో 81 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా విజయనగరం రూరల్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జరగనున్న సర్వసభ్య సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడిందని జెడ్పీ సీఈఓ ఎ.లవరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలన్నారు. చైనాలో డ్రాగన్ బోట్ పోటీలకు శివాంజనేయ గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గేదెల శివాంజనేయ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. చైనాలోని హాంగ్జౌలో ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు భారతీయ కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ నెల 28న భారత బృందం చైనాకు బయలుదేరి అక్టోబర్ 4న తిరిగి రానుంది. ప్రస్తుతం శివాంజనేయ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్స్పైర్ మానక్‌లో విద్యార్థుల ప్రతిభ విజయనగరం: ఇన్స్పైర్ మానక్‌లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచినట్టు డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. 2023–24లో మలిచెర్ల జెడ్సీ హెచ్‌ఎస్‌కు చెందిన 6వ తరగతి విద్యార్థిని అంబటి సాయి వైష్ణవి రూపొందించిన ‘రిమోట్ స్లీప్ మానిటరింగ్ అండ్ మెడికల్ అలారమ్ సిస్టం’ , 2024–25లో కొండవెలగాడ జెడ్సీ హెచ్‌ఎస్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎల్.లిడియో రూపొందించిన ‘లో కాస్ట్ విన్నోయింగ్ యూనిట్’ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంలో ఇన్స్పైర్ మానక్ దోహదపడుతుందని డీఈఓ పేర్కొన్నారు. విజేతలను, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. జిల్లాలో నేడు, రేపు ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన ● దళితుల భూ సమస్యలపై ఆర్డీఓ కార్యాలయంలో కీలక సమీక్ష పార్వతీపురం రూరల్: రాష్ట్ర ఎస్సీకమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.శ్యామల మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పార్వతీపురంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను సందర్శించి వసతులను పరిశీలిస్తారని, గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో తహసీల్దార్లతో జరిగే భేటీలో షెడ్యూల్డ్ కులాల దశాబ్దాల భూ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, పరిష్కార మార్గాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారని శ్యామల తెలిపారు. -
మీకు బిల్లులు చెల్లిస్తే మాకేమిస్తారు?
విజయనగరం ఫోర్ట్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయితడపనిదే ఏ పని జరగదని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. కష్టపడి పనిచేసినా ఎంతో కొంత ముట్టజెబితే తప్ప ప్రతిఫలం అందదని విమర్శిస్తున్నారు. ఉద్యోగోన్నతులు, సరెండర్ లీవులు, రిలీవింగ్ ఆర్డర్స్, మెటర్నిటీ లీవ్‌లు.. ఇలా ప్రతీదానికి మామ్మూళ్లు రూపంలో ఇస్తేగాని పని జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా దంత వైద్యులకు చెల్లించాల్సిన ఫ్యూయల్ చార్జీలకు కూడా కమిషన్ ఇస్తేగాని నిధులు జమ చేయబోమని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. ఇదెక్కడి అన్యాయం... నేషనల్ ఓరల్ హెల్త్ ప్రొగ్రాం( ఎన్‌ఓహెచ్‌పీ)లో భాగంగా దంత వైద్యులు వారికి కేటాయించిన పీహెచ్‌సీలకు వెళ్లేవారు. వారంలో మూడు రోజులపాటు పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందించేవారు. పీహెచ్‌సీలకు వచ్చిన రోగుల్లో దంత సంబంధిత సమస్యలు ఉన్న వారిని గుర్తించి అక్కడ చికిత్స అందించిన కల్గిన వాటికి చికిత్స అందించేవారు. లేదంటే సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రికి రోగులను రిఫర్ చేసేవారు. నోటికేన్సర్కు సైతం స్క్రీనింగ్ చేసేవారు. ఇలా సేవలందించిన వైద్యులకు ఫ్యూయల్ (పెట్రోల్, డీజిల్) చార్జీల కింద నెలకు రూ.7 వేలు చెల్లించాలి. జిల్లాలో వైద్యసేవలందించిన 9 మంది దంత వైద్యులకు ఫ్యూయల్ చార్జీల కింద 27 నెలలకు కొద్దిరోజుల కిందట రూ.13 లక్షల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం వీటిని వెంటనే వైద్యుల ఖాతాల్లో జమచేయాలి. అయితే, నిధులు చెల్లించాలంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చెందిన ఓ అధికారి, ఓ ఉద్యోగి 10 శాతం కమీషన్ డిమాండ్ చేసినట్టు సమాచారం. కమీషన్ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని తెగేసి చెప్పినట్టు తెలిసింది. వ్యయప్రయాసలకోర్చి పీహెచ్‌సీలకు వెళ్లి సేవలందించామని, ఇంధన ఖర్చుల్లో కమీషన్ దందా ఏమిటంటూ పలువురు వైద్యులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం అంటూ వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు దంతవైద్యులకు చెల్లించాల్సిన ఇంధన నిధుల్లో 10 శాాతం కమీషన్ అడిగిన విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా కమీషన్ అడిగినట్టు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జీవనరాణి, డీఎంహెచ్ఓ ఎన్ఓహెచ్పీలో భాగంగా పీహెచ్‌సీల్లో సేవలందించిన దంత వైద్యులు 27 నెలలకు వారికి ఫ్యూయల్ చార్జీల కింద రూ.13 లక్షలు విడుదల ఈ నిధులు దంత వైద్యులకు చెల్లించేందుకు 10 శాతం కమిషన్ డిమాండ్ చేసిన డీఎంహెచ్ఓ కార్యాలయ ఉద్యోగి! ఆవేదనలో వైద్యులు -
విచారణ ఉత్తుత్తిదేనా!
కొత్తవలస: విశాఖపట్నానికి సరిహద్దుగా ఉన్న కొత్తవలస మండలంలో ప్రభుత్వ భూములకు కాళ్లొచ్చాయి. బడానేతల కబంద హస్తాల్లోకి వెళ్లిపోతున్నాయి. చెరువు గర్భాలు జిరాయితీ భూములుగా మారుతున్నాయి. సబ్ డివిజన్ల పేరుతో ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేసి బడాబాబుల పేరున బదలాయిస్తున్న తీరు పల్లె ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆయకట్టు రైతులను కలవరపెడుతోంది. భూముల కబ్జా తీరును ‘భూ మాయ’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు ఆగమేఘాలపై స్పందించారు. సంబంధిత తహసీల్దార్ అప్పలరాజును సస్పెండ్‌చేశారు. విచారణ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అప్పటి ఇన్చార్జి డీఆర్వో మురళీని నియమించారు. ఇది జరిగి 9 నెలలు గడుస్తున్నా ఆ భూములు ఇప్పటికీ అదే వ్యక్తుల పేరున వెబ్‌ల్యాండ్‌లో చూపించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచారణ ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్‌చేసి ప్రభుత్వ భూములను మాయ చేయడం వెనుక రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ రికార్డులు సరిచేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తవలస గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 165–1లో ఉన్న ప్రభుత్వ భూమిని 165–3గా సబ్ డివిజన్ చేసి 5 ఎకరాల భూమిని జిరాయితీ భూమిగా మార్చేసి తిరుతాంబ, కె.శైలజ తదితరుల పేరిట బదలాయించారు. కొత్తవలస మండలం చిన్నిపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 95లో 14.07 ఎకరాల విస్తీరంలో కొత్తచెరువు విస్తరించి ఉంది. దీనిని సర్వేనంబర్ 95–2గా సబ్‌డివిజన్ చేసి చల్లా రవికుమార్ పేరిట 3.71 ఎకరాల చెరువుగర్భాన్ని జిరాయితీ భూమిగా బదలాయించారు. 9 నెలలు గడుస్తున్నా అతీగతీలేని వైనం వెబ్‌ల్యాండ్‌లో జిరాయితీ భూములుగా దర్శనమిస్తున్న ప్రభుత్వ భూములు రీ సర్వేలో సర్దుబాటుకు తెరవెనుక మంతనాలు రెల్లి రెవెన్యూ పరిధిలో కొంత ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చేసి బడాబాబులకు కట్టబెట్టారు. చింతలపాలెం గ్రామ రెవెన్యూలో పలు సర్వేనంబర్లలోని ప్రభుత్వ భూములను జిరాయితీగా సబ్‌డివిజన్ చేసి అధికార పార్టీ పెద్దలకు కట్టబెట్టినట్టు సమాచారం. చింతలపాలెం రెవెన్యూలో ఒక వ్యక్తి పేరున ఉన్న సర్వే నంబర్లు 52–4, 12, 13, 14, 15, 17, 18, 53–8, 12లో గల భూములను ఎటువంటి మ్యూటేషన్ ఫైల్ లేకుండా వేరొకరి పేరిట బదలాయించారు. ఆయా సర్వే నంబర్లలోని భూముల విస్తీర్ణం కంటే అదనంగా భూమిని సృష్టించి బదలాయించారు. ప్రస్తుతం ఈ భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల పేర్లుపైనే జిరాయితీ భూములుగా వెబ్‌ల్యాండ్‌లో దర్శనమివ్వడం గమనార్హం. రీ సర్వేలో సర్దుబాటుకు ప్రయత్నాలు ప్రస్తుతం కొత్తవలస మండలంలోని పలు గ్రామాల్లో రీ సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూములను జిరాయితీలుగా మార్చేందుకు బడాబాబులు నిత్యం రెవెన్యూ అధికారులతో మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. అక్రమంగా సంపాదించిన భూములను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. చెరువు గర్భాలు, ప్రభుత్వ భూములు క్రయ విక్రయాలు జరిగిపోతే ఎవరిది బాధ్యత అంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భూ మాయపై విచారణ కొనసాగుతోందని ఇ.మురళి చెప్పడం గమనార్హం. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
విజయనగరం టౌన్: చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తిని బైకు డబ్బులివ్వలేని కారణంతో నిర్భందించి, హింసించి, తాళ్లతో చేతులు కట్టేసి, మెడలో తాడువేసి వీధుల్లో తిప్పిన ఘటనను జిల్లా పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. దీనికి బాధ్యులైన ఐదుగురు నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదుచేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను వెల్లడించారు. ఎల్లా రాజేష్ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ, అతని స్నేహితుడైన వెన్ను మహేష్ (ఎ2) వద్ద బైక్‌ను రూ.10వేలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇద్దరూ స్నేహితులు కావడంతో డబ్బులు చెల్లించకుండానే బైక్‌ను రాజేష్‌కు ఇచ్చాడు. ట్రయల్ వేసే క్రమంలో ఒక కారును బైక్‌తో ఢీకొట్టారు. కారు డామేజ్ కావడంతో కారు రిపేర్ చేసేందుకు మెకానిక్ లెంక శ్రీరామ్ (ఎ1) అనే వ్యక్తి బాధ్యత వహించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటి నుంచి రాజేష్ రూ.30వేలు చెల్లించాలని శ్రీరామ్ డిమాండ్ చేయడం, రాజేష్ ఆ విషయాన్ని దాటవేస్తూ కాలయాపన చేయడం, తప్పించుకుని తిరగడం చేస్తుండేవాడు. ఈ నెల 5న సాయంత్రం సుందరపేట గ్రామ కూడలి వద్ద ఉన్న రాజేష్‌ను భోగాపురానికి చెందిన బైక్ మెకానిక్ వెన్ను మహేష్ (ఎ2), గొల్లపేటకు చెందిన బమ్మిడి వెంకటరమణ అలియాస్ మహేష్ (ఎ3) కలిసి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని, స్కూల్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడకు లెంక శ్రీరామ్ (ఎ1) చేరుకుని రాజేష్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు చెల్లించలేనని రాజేష్ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దీంతో మెకానిక్ షెడ్‌కు తీసుకువెళ్లి నమ్మి గోవింద్ (ఎ4), వెన్ను అప్పారావు (ఎ5)ల సాయంతో రాత్రంతా మెకానిక్ షెడ్లోనే నిర్బంధించి, కొట్టి, డబ్బులు రాబట్టేందుకు రాజేష్ బంధువులతో మంతనాలు జరిపారు. రాజేష్ బంధువులు కూడా ఆ డబ్బులు చెల్లించేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో ఈ నెల 6న నిందితులిద్దరూ రాజేష్ షర్ట్ విప్పించి, చేతులను తాళ్లతో కట్టి, మెడలో తాడు వేసి, భోగాపురం వీధుల్లో తిప్పి అమానుషంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నిందితులను అరెస్టు చేసి హత్యాయత్నం, అట్రాసిటీ చట్టం సెక్షన్లతో భోగాపురం ఇన్చార్జి సీఐ ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదుచేశారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ దామోదర్ యువకుడిని తాళ్లతో కట్టి, వీధుల్లో నడిపించడం తీవ్రమైన నేరం నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు ఐదుగురు నిందితులు అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు -
విజయనగరం
మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వంటింట్లో మంటలు.. పాలకులకు పట్టదా? ధరలు నియంత్రించాలంటూ కలెక్టరేట్ ఎదుట అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో మహిళలు కదం తొక్కారు. జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కె.పుణ్యవతి, పాలూరి రమణమ్మ మాట్లాడుతూ, జూలై, ఆగస్టు నెలల్లోనే సరుకుల ధరలు 40 నుంచి75 శాతం మేర పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధర 100 శాతం పెరగగా, పంచదార కిలో రూ.70 దాటిందన్నారు. ప్రతి కుటుంబంపై నెలకు రూ.4 వేల నుంచి రూ.7వేల అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై నిత్యావసరాలు ఇవ్వాలని, రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ వద్దు.. పంచాయతీయే ముద్దు.. రాజాం మండలంలోని పూర్వపు కొత్తవలస గ్రామ పంచాయతీని (కొత్తవలస, గోపాలపురం) రాజాం మున్సిపాలిటీలో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రైతులు, కూలీలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నాచేశారు. నూటికి నూరు శాతం వ్యవసాయాధారిత గ్రామమైన కొత్తవలసను మున్సిపాలిటీలో కలిపితే పన్నుల భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామానికి ఉపాధిహామీ, పంచాయతీ నిధులు ఆగిపోయాయని, విలీనం చేస్తే పేద కూలీలు ఉపాధి కోల్పోతారని స్పష్టం చేస్తూ వినతిపత్రం అందజేశారు. -
అక్కా.. నన్ను చంపేస్తారు..!
అల్లిపురం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో.. వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందే ఊహించినా.. దక్కని ప్రాణం ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. మైలపల్లి చంటి(ఫైల్) చెప్పిన కొన్ని గంటల్లోనే శవమైన తమ్ముడు హార్బర్ సమీపంలో మత్స్యకార యువకుడి మృతదేహం తల పగలగొట్టి, మెడకు తాడు బిగించి కిరాతకం -
హుద్‌హుద్ తుఫాన్ బాధితులకు పట్టాలివ్వాలి
–8లోరెవెన్యూ సమస్యలే అధికం.. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ పరమైన సమస్యలే అధికంగా వస్తున్నాయి. పరిష్కారంలో జాప్యమే కారణంగా తెలుస్తోంది. జామి మండలం అలమండ గ్రామంలో హుద్‌హుద్ తుఫాన్ బాధితులకు నిర్మించిన 160 ఇళ్లలో ఇప్పటికీ 27 కుటుంబాలకు పట్టాలు అందలేదంటూ బాధితులు ధర్నా చేశారు. లాటరీ లో పేరొచ్చినా పట్టాలు ఇవ్వకపోవడం, చనిపోయిన లబ్ధిదారుల వారసులకు హక్కులు కల్పించకపోవడం అన్యాయమని వాపోయారు. సంతకవిటి మండలం మండవ కురిటి గ్రామంలో 1959 నుంచి నేటి వరకు సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వ్ కాకపోవడంపై గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. గ్రామంలోని సుమారు 3,000 మంది ఓటర్లలో 600 మంది ఎస్సీ వర్గానికి చెందినవారు ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా తమకు ప్రాతినిథ్యం దక్కడం లేదని వాపోయారు. -
విజయనగరాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి
బొండపల్లి: విజయనగరాన్ని తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దరాజు రాంబాబు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 30 శాతానికి మించి వరి సాగు జరగలేద న్నారు. వర్షాలు కురవకపోవడంతో మొట్ట భూముల్లోని పంటలు ఎండిపోతున్నాయన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలతో పాటు, సాగుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమన్వయంతో సేవలందించాలి విజయనగరం గంటస్తంభం: ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలను సత్వరంగా, పారదర్శకంగా అందించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలపై విశ్వాసం పెంచాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుత వారానికి ఓవరాల్ పాజిటివ్ స్కోర్ 69.93 శాతంగా నమోదైన నేపథ్యంలో తక్కువ సానుకూలత ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దళారులను నమ్మొద్దు విజయనగరం గంటస్తంభం: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 16 వరకు దర ఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధు లు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చెప్పుల తయారీదారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు అర్హత మేరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పింఛన్ రకాన్ని బట్టి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు. అర్హులకు పింఛన్లు మంజూరవుతాయని, దళారులను నమ్మవద్దని, వివరాలకు డీఆర్డీఏ కార్యాలయం 80082 03971ను సంప్రదించాలని కోరారు. వీబీవైఎల్డీ–2027కు దరఖాస్తుల ఆహ్వానం విజయనగరం గంటస్తంభం: దేశాన్ని–2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ కార్యక్రమానికి (వీబీవైఎల్డీ–2027) 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన అధికారి ప్రేమ్భరత్కుమార్ కోరారు. క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం, యువ పార్లమెంట్, ఆవిష్కరణలు, తదితర విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న యువత మై భారత్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. 12న కోడూరు మాత పండగ బాడంగి: బాడంగి మండలం కోడూరు లో వెలసిన కోడూరుమాత ఉత్సవం ఈ నెల 12న నిర్వహించేందుకు ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. కులమ తాలకు అతీతంగా సాగే పంగడలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు, ఆరాధకులు తరలివస్తారు. స్వస్థత చేకూర్చే మాతగా కోడూరు మాతను ఆరాధిస్తారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాలూరు, పార్వతీపురం, రాజాం, పాలకొండ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. పండగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బొబ్బిలి డీఎస్పీతో పాటు సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. పండగను విజయవంతం చేయాలని రెవ,ఫాదర్ పీటర్ సింహాచలం భక్తులను కోరారు. -
ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని మూసివేయొద్దు
● జేసీకి రైతుల వినతి రేగిడి: రేగిడి మండలం సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగా రాన్ని మూసి వేయకుండా చూడాలని రైతులు విజయనగరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో సోమవారం జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. కర్మాగారం మూసివేస్తే వేలాది మంది చెరకు రైతులతోపాటు గ్రామీణ వ్యవసాయ కూలీ లు, కార్మికులు, స్థానిక ప్రజలు జీవనోపాధి కోల్పోతారని సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి సభ్యుడు, ఏపీ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు జేసీకి తెలియజేశారు. -
పారాది వంతెనపై ట్రయల్ రన్
బొబ్బిలిరూరల్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న అంతరరాష్ట్ర రహదారిపై పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన నూతన వంతెన పనులు పూర్తికావచ్చాయి. ఈ నేపథంలో సోమవారం వంతెనపై వాహనాల ట్రయల్ రన్‌ను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిటిష్ కాలం నాటి పాత బ్రిడ్జి ఓ వైపు ఒరిగిపోయి మరమ్మతులకు గురికావడంతో కొత్త వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.10.90 కోట్ల నిధులు, పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నూతన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నదిపై కాజ్వే నిర్మించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. రెండేళ్లలో అదనంగా సుమారు రూ.7కోట్ల ప్రజాధనం వెచ్చించి రూ.17.83 కోట్లతో పనులు పూర్తిచేసింది. వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో 10 రోజుల సమయం పడుతుందని కాంట్రాక్టర్ తెలిపారు. మంచిరోజులు లేవంటూ సోమవారం బ్రిడ్జిపై ట్రయల్ రన్ ప్రారంభించారు -
కొండంపేటలో సినిమా షూటింగ్ సందడి
రాజాం: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని కొండంపేట శివాలయం వద్ద సోమవారం సినిమా షూటింగ్ ప్రారంభించారు. బీవీజీ –2 బ్యానర్‌పై ప్రేమంటే తెలుసా.. ఓ మనసా టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకులు వర్థన్ తెలిపారు. రాజాం పట్టణ సీఐ డి.నవీన్, తృప్తి రిసార్ట్ ఎం.డి పీవీజీ కృష్ణ (మురళీ మాస్టారు) క్లాప్ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోగా గణేష్, హీరోయిన్గా భాగ్య, విలన్‌గా వంగర మండలానికి చెందిన సీనియర్ నటుడు పెంకి బాలకృష్ణ నటిస్తున్నారు. కార్యక్రమంలో కెమెరామెన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
శిథిల భవనాలే గతి..
విజయనగరం రూరల్: ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న అబ్కారీ శాఖకు జిల్లాలో సొంత గూడు లేకుండా పోయింది. అద్దె భవనాలు, శిథిల భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లా అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఎకై ్సజ్ సూపరింటిండెంట్ కార్యాలయం, విజయనగరం ఎకై ్సజ్ 1, 2 స్టేషన్లు శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బాలాజీనగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతుండగా, ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ప్రదీప్‌నగర్‌లో మరో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఎకై ్సజ్ సూపరింటిండెంట్ కార్యాలయం కలెక్టరేట్లోని పాత భవనంలో కొనసాగుతోంది. విజయనగరం పట్టణ, గ్రామీణ ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ స్టేషన్లు పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలోని బొగ్గులదిబ్బ ప్రాంతంలో పాడుబడిన భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటితో పాటు టాస్స్‌ఫోర్స్ కార్యాలయం అక్కడే ఉంది. అయితే విజయనగరం ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు టాస్స్‌ఫోర్స్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. గోడలు బీటలు వారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేషన్ పైకప్పు, గోడలు నానిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన పెంకుల షెడ్డుల్లోనే నేటికీ స్టేషన్లు నిర్వహించడం, అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. అలాగే గ్రామీణ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ కార్యాలయం పిచ్చుక గూడులాంటి చిన్నపాటి షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఒకరిద్దరు అధికారులు, సిబ్బందికి మించి ఆ షెడ్డులో కూర్చునే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా కొన్నేళ్ల కిందట ఎకై ్సజ్ అధికారులు సొంత నిధులతో భవనం పైకప్పునకు మరమ్మతులు చేపట్టారు. కొత్త భవనాల నిర్మాణాలకు 2012లో నిధులు మంజూరైనా సకాలంలో పనులు చేపట్టకపోవడంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయి. ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్న గూడ్సు షెడ్ ప్రాంతంలో ఆ శాఖకు సుమారు రెండెకరాల విశాలమైన సొంత స్థలం ఉంది. భవనాల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ స్థలంలో తుప్పలు, మొక్కలు ఏపుగా పెరిగి పాములకు ఆవాసాలుగా మారిపోయాయి. దీంతో అప్పుడప్పుడు విషసర్పాలు కార్యాలయంలోకి చొరబడి ఎకై ్సజ్ సిబ్బందికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఎకై ్సజ్ శాఖ నుంచి అధిక ఆదాయాన్ని పొందే ప్రభుత్వం ఆ శాఖ కార్యాలయాలకే భవనాలు నిర్మించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి సొంత భవనాలకు శ్రీకారం చుట్టాలని పలువురు కోరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో సిబ్బంది అబ్కారీ శాఖకు భవనాల కొరత అద్దె భవనాల్లోనే డీసీ, ఏసీ కార్యాలయాలు -
● జిల్లాకు పతకాల పంట
● 31 పతకాలు సాధించిన పోలీసులుపార్వతీపురం రూరల్: రక్షణ బాధ్యతల్లోనే కాదు.. క్రీడా మైదానంలోనూ సత్తా చాటారు మన్యం జిల్లా పోలీసులు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియనన్లో జరిగిన శ్రీతొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026శ్రీలో విశాఖ రేంజ్ తరఫున బరిలోకి దిగిన పార్వతీపురం మన్యం జిల్లా సిబ్బంది పతకాల పంట పండించారు. కేవలం తొమ్మిది మంది ఏకంగా 31 పతకాలు (14 స్వర్ణ, 9 రజత, 8 కాంస్య) కొల్లగొట్టి క్రీడాస్ఫూర్తిని రగిలించారు. కానిస్టేబుల్ మధుబాల అత్యధికంగా పది పతకాలతో అదరగొట్టగా.. సురేష్ (8), అరుణ్ కుమార్ (4), త్రినాథ్ (3), నాగభూషణరావు (2) పతకాలు సాధించారు. మనోజ్, రామకృష్ణ, బాలకృష్ణ, శివకుమార్ సైతం వివిధ క్రీడల్లో పతకాలు కై వసం చేసుకున్నారు. నేర పరిశోధనలో మేటి అనిపించుకునే ట్రాకింగ్ జాగిలం శ్రీశాండీశ్రీ సైతం రాష్ట్రస్థాయి జాగిలాల పోటీల్లో మెరిసి కాంస్య ట్రోఫీని ముద్దాడడం విశేషం. క్రీడా విజేతలను ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి సోమవారం అభినందించి, పతకాలతో సత్కరించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలే దివ్య ఔషధమని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ సిబ్బంది రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్పీ థామస్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: పశు సంవర్థకశాఖలో ఖాళీగా ఉన్న నాలుగు పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, సంబంధిత సర్టిఫికెట్ ఉండాలని పేర్కొన్నారు. వీరికి నెలకు రూ. 18,500 గౌరవ వేతనం ఉంటుందని తెలిపారు. రెండు హాస్పటల్ అటెండెంట్ పోస్టులకు 10 వతరగతి ఉత్తీర్ణత ఉండాలని , నెలకు రూ. 15 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని తెలిపారు. అభ్యర్ధుల వయసు 42 సంవత్సరాల లోపు ఉండాలని, రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరమితి సడలింపు వర్తిస్తుందన్నారు. విద్యార్హత మార్కులకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీతో మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారన్నారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా పశుసంవర్థక శాఖ సంచాలకులు వారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తావిజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన సీనియర్స్ పురుషుల ఫుట్‌బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగిన పోటీల్లో 26 జట్లు పాల్గొనగా.. విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన జట్టు అద్భుత క్రీడా ప్రతిభతో తృతీయ స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం ఈస్ట్ గోదావరి – విజయనగరం జట్ల మధ్య జరిగిన పోరు కూడా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కీలక సమయాల్లో విజయనగరం క్రీడాకారులు రాణించడంతో రెండు గోల్స్ తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు రజిని, కార్యదర్శి మహాలక్ష్మి, తదితరులు సోమవారం అభినందించారు. -
రెవెన్యూ సమస్యలే అధికం..
విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ పరమైన సమస్యలే అధికంగా వస్తున్నాయి.. క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలను పరిష్కరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 226 వినతులు రాగా.. అందులో 113 వినతులు రెవెన్యూశాఖకు చెందినవి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూసర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూ సమస్యలను కేవలం రికార్డుల ఆధారంగా కాకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫిర్యాదుదారుడితో మాట్లాడిన అనంతరం నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే 1100 టోల్ ఫ్రీ సేవల ద్వారా వచ్చే వినతుల పరిష్కారంలోనూ జాప్యం ఉండకూడదని జేసీ స్పష్టం చేశారు. శాఖల వారీగా వచ్చిన వినతులు.. రెవెన్యూ – 113, పంచాయతీరాజ్ – 24, డీఆర్డీఏ – 34, విద్యుత్ – 9, గ్రామ సచివాలయాలు – 9, విద్యాశాఖ – 5, మున్సిపల్ –15, డీఎంహెచ్ఓ – 6, ఇతర శాఖలకు సంబంధించిన 15 వినతులు వచ్చాయి. కుమారుడి జీతం బకాయిలు ఇప్పించండి.. విజయనగరం ఫోర్ట్: రామభద్రపురం మండలం ముప్పలపూడి గ్రామానికి చెందిన శీర రాఘవ వ్యవసాయశాఖలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేసి మృతి చెందాడు. దీంతో అతని జీతాల బకాయిలు తనకు చెల్లించాలని అతని తల్లి శీర అన్నపూర్ణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్.. పార్వతీపురం: ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే పీజీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలితో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని.. పరిష్కారంలో అలసత్వం వహించరాదని ఆదేశించారు. ఈ సందర్భంగా మొత్తం 98 అర్జీలు అందగా.. అందులో 31 రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించినవి కాగా 67 వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలున్నాయి. పార్వతీపురం మండలం చలమవలస సమీపంలో ఏర్పాటు చేసిని పౌల్ట్రీఫారం తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గరుగుబిల్లి మండలం చినగుడబ గ్రామానికి చెందిన కె. తాతారావు తన భూమికి సంబంధించిన వన్ వీని మంజూరు చేయాలని కోరారు. పార్వతీపురం మండలం శివన్నదొరవలస గ్రామానికి చెందిన నిమ్మక సరస్వతి తన భర్త పేరున ఉన్న డీ పట్టా భూమిని తన పేరున నమోదు చేయాలని అర్జీ అందజేశారు. అలాగే పార్వతీపురం పట్టణానికి చెందిన గంగాధరరావు తనకున్న జిరాయితీ భూమిని 22 ఏ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ 226 వినతులు స్వీకరించిన అధికారులు సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు : జేసీ సేతు మాధవన్ -
30 అర్జీల స్వీకరణ
విజయనగరం టౌన్: బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించి 30 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా భూ తగాదాలకు సంబంధించినవి 22 అర్జీలు వచ్చాయి. కుటుంబ కలహాలకు సంబంధించి మూడు, మోసాలకు సంబంధించి రెండు, ఇతర అంశాలకు సంబంధించి మూడు ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏడు పనిదినాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తీసుకున్న చర్యలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్వర న్యాయం అందించాలి.. : ఎస్పీ మాధవ్‌రెడ్డి పార్వతీపురం రూరల్: ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సత్వర న్యాయం అందించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు.. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, వేధింపులు, మోసాలకు సంబంధించిన సమస్యలపై ఎస్పీకి నేరుగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రతి ఫిర్యాదుదారుడితో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ.. సమస్య పూర్వాపరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతూ.. గడువు లోగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో మొత్తం 12 వినతులు అందాయి. డీసీఆర్బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సైలు అశోక్ చక్రవర్తి, శిరీషలతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కుష్టు వ్యాధి గుర్తింపునకు ఇంటింటి సర్వే
పార్వతీపురం: కుష్టువ్యాధి గుర్తింపు కోసం జిల్లాలో సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్లో సర్వేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బంది బృందాలు ప్రతి ఇంటినీ సందర్శించి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. వ్యాధి నిర్ధారణయితే ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) అందిరన్నారు. శరీరంపై స్పర్శ తెలియని మచ్చలుంటే సర్వే బృందాలకు తెలియజేసి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. తొలి దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణాధికారి ఎస్కే హఫీజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి, ఎన్‌ఎంఓ రాజేష్‌కుమార్, ఆర్బీఎస్కె పీఓ టి. జగన్ మోహనరావు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ రాంసుందర్రెడ్డివిజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువు దాటిన అర్జీలుంటే సహించేది లేదన్నారు. పరిష్కారం కాని వాటికి సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు మెరుగుపర్చాలని, మున్సిపాలిటీలో గుంతల రోడ్లను వెంటనే పూడ్చాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఆధునిక నైపుణ్యాలు తప్పనిసరి
● డేటా ఐఈఐ వ్యవస్థాపక డైరెక్టర్ తిరుమలేష్విజయనగరం అర్బన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) యుగంలో ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని డేటా ఐఈఐ వ్యవస్థాపక డైరెక్టర్ తిరుమలేష్ కొణతాల సూచించారు. గాజులరేగలోని సీతం కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఇండక్షన్ ప్రొగ్రాంనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్, డిఫెన్స్, బిజినెస్, తదితర రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోందన్నారు. అన్ని విభాగాల విద్యార్థులు ఏఐపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా అవకాశాలను సృష్టించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. డేటా ఐఈఐ ఏఐ ఇంజినీర్ భీమేశ్వరరావు మాట్లాడుతూ.. రోబోటిక్స్, వ్యవసాయం, క్లౌడ్ టెక్నాలజీ, తదితర రంగాల్లో భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా డేటా, ఏఐ, ఆధునిక సాంకేతికతపై ప్రాక్టికల్ అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కందివలసలో పంటలు ధ్వంసం కొమరాడ: మండలంలోని రైతులకు గజరాజల బాధలు వీడడం లేదు. ఎప్పుడు ఎవరి పొలంలో పడి పంటలు ధ్వంసం చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క గజరాజులు ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మండలంలోని కందివలసలో ఆదివారం రాత్రి ఏనుగుల గుంపు పామాయిల్, జొన్న, అరటి, తదితర పంటలను నాశనం చేశాయి. కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగులను తీసుకువచ్చినా అటవీ ఏనుగులను తరలించలేకపోయారని గిరిజన రైతులు వాపోతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో గల విశాఖ డెయిరీ వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కురుపాం మండలం దండుసుర గ్రామానికి చెందిన ఆరిక ఇరమమ్మ (47) మతిస్థిమితం లేక 20 రోజుల కింట ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఇరుమమ్మను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహం వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించి బంధువులకు సమాచారం అందజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మేనల్లుడు కండ్రిక చాలెంజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో జైలుశిక్ష శృంగవరపుకోట: చెక్‌బౌన్స్ కేసులో రైల్వే ఉద్యోగికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఏడు లక్షల రూపాయలు చెల్లించాలని స్థానిక కోర్టు న్యాయమూర్తి బి.కనకలక్ష్మి సోమవారం తీర్పు చెప్పారు. నగదు చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. న్యాయవాది బి.త్రిమూర్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఉంటున్న రైల్వే ఉద్యోగి పోకల రమణ ఎస్.కోట పట్టణానికి చెందిన అనాల మోహనరావు వద్ద ఏడు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను రమణ చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బ్యాంక్‌లో జమ చేయగా బౌన్స్ అయింది. దీంతో అనాల మోహనరావు కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ముద్దాయికి జైలుశిక్ష విధించారు. -
కల్యాణలక్ష్మికి చంద్ర గ్రహణం..
విజయనగరం ఫోర్ట్: రేగిడి ఆముదాలవలస మండలానికి చెందిన ఆర్.హరికి, బి. పావనిలకు ఇటీవల వివాహం జరిగింది. వీరు ప్రభుత్వం ప్రకటించిన పెళ్లికానుక పథకానికి దరఖాస్తు చేసుకున్నా, ఇంతవరకు ఎటువంటి సాయం అందలేదు.అలాగే బొండపల్లి మండలానికి చెందిన ఎ.మీనాక్షికి గంట్యాడ మండలానికి చెందిన పి. భాస్కరరావుతో ఇటీవల వివాహం జరిగింది. వీరు కూడా పెళ్లికానుక పథకానికి అర్హులు. అయితే వీరికి కూడా ప్రభుత్వం ఎటువంటి సాయాన్ని అందించలేదు. వీరే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక మంది నూతన వధూవరులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందని పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సాయం అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆడపిల్ల తల్లిదండ్రులు భావించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. రెండున్నరేళ్లుగా ఒక్కరికి కూడా సాయం అందించకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు పెళ్లికానుక పేరుతో ఆర్థిక సాయం అందిస్తామని కూటమి సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది. దీంతో మహిళలందరూ హామీని నమ్మి వారికి ఓట్లు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెళ్లికానుక ఊసే ఎత్తడం మానేసింది. ఆరు నెలల కిందట పెళ్లికానుక స్థానంలో కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది.కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి సుమారుగా ఆరు నెలలవుతోంది. అయితే ఇప్పటికీ ఆ పథకం గురించి అతీగతీ లేదు. పథకానికి సంబంధించి విధివిధానాలను ఇంతవరకు ప్రకటించలేదు. చంద్రబాబు సర్కార్ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందనే విమర్శలున్నాయి. తాజాగా కల్యాణలక్ష్మి అనే పథకానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇస్తారట. రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం ఇస్తే.. వడ్డీతో సహా తిరిగి తీర్చాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా పేదలకు అందని పెళ్లికానుక కల్యాణలక్ష్మి పేరుతో రూ.లక్ష వరకు రుణం ఇస్తామని ప్రకటన వేలాది మందికి అందని సాయం వైఎస్సార్సీపీ హయాంలో కల్యాణమస్తు పేరుతో ఆర్థిక సాయం2024 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వేలాది వివాహాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేల వరకు వివాహాలు జరిగి ఉంటాయని అంచనా. అయితే ఇందులో ఒక్కరికి కూడా సాయం అందిన దాఖలాలు లేవు. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తయ్యాయి.. మరో రెండేళ్లు సాగదీస్తే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఇక మా పరిస్థితేమిటని లబ్ధిదారులు వాపోతున్నారు. పాలకులు స్పందించి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. -
ప్రాణం కోసం పోరాటం..
చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఒకవైపు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత.. మరోవైపు ప్రాణాల కోసం పోరాటం.. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి అక్షరాలా కోటి రూపాయలు ఉంటేగాని ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన గదల ఈశ్వరరావు కొంతకాలంగా సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతూ చీపురుపల్లిలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాడు. ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించారు. దీంతో అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు గురైనట్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, తక్షణమే ఊపిరితిత్తులు మార్చాలని ఇందుకు సుమారుగా 90 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ఈశ్వరరావు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతున్నాడు. భార్యా, ఇద్దరు చిన్న పిల్లలతో కూడిన ఈ కుటుంబానికి ఇంత భారీ మొత్తంలో వైద్య ఖర్చును భరించే ఆర్థికస్థోమత లేదు. దీంతో దాతల సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. సాయం చేయాల్సిన దాతలు 96400 18559 నంబర్‌ను సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఈశ్వరరావు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు -
విద్యార్థులకు ‘పద్మ పూజిత’ స్కాలర్షిప్లు
మద్దిలపాలెం (విశాఖ): విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించే లక్ష్యంతో పద్మ పూజిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్–2026ను ఆదివారం విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని శంకర ప్యాలెస్‌లో నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 107 దరఖాస్తులు అందగా.. పరిశీలన అనంతరం 77 మంది విద్యార్థులను స్కాలర్షి ప్లకు ఎంపిక చేసి మొత్తం రూ.12.20 లక్షలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతి చదువుతున్న 29 మందికి రూ.2.90 లక్షలు, డిగ్రీ, డిప్లమో, ఫార్మసీ చదు వుతున్న 10 మందికి రూ.1.50 లక్షలు, ఇంటర్, బీటెక్ చదువుతున్న 38 మందికి రూ.7.80 లక్షల మెరిట్ స్కాలర్షిప్లు, ధ్రువీకరణ పత్రాలను ఫౌండేషన్ చైర్మన్ ఆర్.వి.ఎస్.వి.బసవరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య కు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభావంతులైన విద్యార్థులకు సహ కారం అందిస్తున్నామని తెలిపారు. కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. పడాల ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు చేశారు. సానుకూల దృక్పథంతో విద్య ను అభ్యసించాలని పోతినేని నిర్మల సూచించారు. -
తల్లిడిల్లిన మనసు..
● ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి ● లబోదిబోమంటూ రోదించిన తల్లి ● కంటతడి పెట్టిన స్థానికులు కొత్తవలస: చిన్న కొడుకుపై ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. తనకు అండగా నిలుస్తాడని..వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకుంటాడని భావించింది. కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టినట్లు వ్యవహరించింది. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో ఆ తల్లి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. నన్ను ఆదుకుంటావనుకుంటే,..ఒంటరిని చేసివెళ్లిపోయావా నాయనా అంటూ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ విజయకుమార్, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండల కేంద్రంలో సంత మార్కెట్ ఎస్సీ కాలనీకి చెందిన బోని వెంకటేష్ (33) విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తన స్కూటీపై కొత్తవలస నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా దేవరాపల్లి నుంచి ఆర్కే బీచ్‌కు వెళ్లే సింహాచలం డిపోకు చెందిన సిటీ బస్సు అరకు–విశాఖ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూకాలమ్మ గుడి వద్ద వెంకటేస్ స్కూటీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ మితిమీ రిన వేగంతో వస్తూ స్కూటీని ఢీకొట్టడంతో వెంకటేష్ ఎగిరి పడిపోగా రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద వార్త తెలుసుకుని తల్లి కనకమ్మ, అన్న శంకర్లు అక్కడికి చేరుకుని లబోదిబోమంటూ రోదించారు. మృతదేహంపై తల్లి కనకమ్మ పడి రోదించడం చూపరులను కంటితడి పెట్టించింది. మృతుడికి అన్నయ్య శంకర్, ఓ సోదరి, తల్లి కనకమ్మ ఉన్నారు. సోదరు డు శంకర్‌కు సోదరికి వివాహాలు కాగా వెంకటేష్‌కు వివాహం కాలేదు. తల్లి దగ్గరే ఉంటున్నా డు. మృతుడి సోదరుడు శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
అంతర్జాతీయ వేదికపై ‘సురవరం యువకుడు’
సంతకవిటి: మండలంలోని సురవరం గ్రామానికి చెందిన డాక్టర్ బాసా మురళి కళారంగంలో పరిశోధనా దృక్పథంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం నుంచి ప్రారంభమైన ఆయన విద్య, కళా ప్రయాణం నేడు జాతీయ, అంతర్జాతీయ అకడమిక్ వేదికల వరకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన అస్సాం రాష్ట్ల్రంలోని సిల్చార్‌లో ఫెర్ఫార్మింగ్ అండ్ ఆర్ట్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నటన, థియేటర్ పెడగాజి, శరీర ఆధారిత నటనా పద్ధతులు వంటి అంశాలపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు శ్రీలంకలోని జాఫ్నా యూనివర్సిటీలో సర్ పొన్నంబాలెం రామనాథన్ ఫ్యాకల్టీ ఆఫ్ విజవల్ అండ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో జరిగిన మూడో అంతర్జాతీయ రీసెర్చ్ కాన్ఫరన్స్‌లో ఆయన పాల్గొన్నారు. విజవల్ అండ్ ఆర్ట్స్ ఫెర్ఫార్మింగ్లో బోధనా శాస్త్రం, హెల్త్ ప్రాక్టీసెస్ అంశంపై జరిగిన సదస్సులో మురళీ తన పరిశోధనా పత్రం సమర్పించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న మురళికి గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తున్నారు. -
సీఆర్‌జెడ్ భూములను కాపాడండి
పూసపాటిరేగ: చింతపల్లి తీరంలోని పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. ఆదివారం అదే గ్రామంలో పర్యటించిన ఆయన..అక్కడి వివాదాస్పద భూములను మత్స్యకారులతో కలిసి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన..చింతపల్లి తీరంలోని పర్యావరణాన్ని ధ్వంసం చేసేలా సీఆర్జెడ్లోని చెట్లను తొలగించి మత్స్యకారులకు హాని కలిగించేలా చేస్తుండడం దుర్మార్గమన్నారు. ఎన్నో ఏళ్లుగా సీఆర్జెడ్లోని శ్మశానాలు, దేవుని ఆలయాలను తొలగిస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మత్స్యకారుల బోట్లను ఒడ్డున ఉంచేందుకు ఏంకర్‌గా ఉన్న చెట్లను తొలగించారని గ్రామస్తులు మేడ అప్పయ్యమ్మ, మైలపల్లి పైడమ్మ, అమర పోలమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని మత్స్యకారుల వినియోగంలోని సీఆర్‌జెడ్ భూములను రక్షించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో మత్స్యకార నాయకులు బర్రి చినఅప్పన్న, గాంధీ, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. -
సీటు చూపించండి..!
జీతం వద్దువీరఘట్టం: సార్ నమస్తే..నాకు మీ స్కూల్లో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది..ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్..మీరు నాకు జీతం ఇవ్వక్కర్లేదు..మా కంపెనీ వాళ్లే నాకు నెలకు రూ.15 వేలు జీతం ఇస్తారు..నా సీటు ఎక్కడో చెప్పండి అంటూ ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం మండలంలోని ఓ జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎంకు తనకు ఉద్యోగం వచ్చిందనే జాయినింగ్ ఆర్డర్ చూపించాడు. సారు నేను సోమవారం వస్తాను. ఉద్యోగంలో జాయిన్ అవుతానని హెచ్ఎంకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సదరు హెచ్ఎం ఎవరీ వ్యక్తి..ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కాసేపు నివ్వెరపోయాడు..కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కుమ్మరిగుంట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ‘స్ఫూర్తి ఔట్సోర్సింగ్ ఏజెన్సీ’ ద్వారా స్కూల్లో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిందని చూపించిన జాయినింగ్ ఆర్డర్ చూసిన హెచ్ఎం మాట్లాడుతూ ఇటువంటి ఉద్యోగాలు ఇక్కడలేవని ఆ వ్యక్తిని పంపించేశారు.అయితే ఆ వ్యక్తి మాత్రం నేను సోమవారం వస్తాను. నా కుర్చీ ఎక్కడో చెప్పండి అని చెప్పి వెళ్లిపోవడంపై హెచ్ఎం కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృమూర్తికి, డీఈఓ పి.బ్రహ్మాజీరావుకు తెలియజేశారు.ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారులు వెంటనే స్పందించారు.అటువంటి జాయినింగ్ ఆర్డర్లు తెస్తే ఎవ్వరినీ జాయిన్ చేసుకోవద్దని హెచ్ఎంకు సూచించారు. అవి ఫేక్ ఆర్డర్లు.. గత రెండేళ్లుగా కొన్ని బోగస్ సంస్థలు నిరుద్యోగుల కు గాలం వేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నామంటూ నిరుద్యోగులను ఈ ఉచ్చులోకి లాగుతున్నాయి. ఓ పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సదరు పాఠశాలల్లో జాయిన్ అయ్యేవారికి రెండు నెలల పాటు జీతాలు ఇవ్వడం,అంతలోనే బోర్డు తిప్పేయడం రెండేళ్ల క్రితం ఇటువంటి బోగస్ ఉద్యోగాల బాగోతం వీరఘట్టం మండలంలోని పలు హైస్కూల్స్‌లో వెలుగు చూసింది. వారంతా సదరు బోగస్ కంపెనీల పేరుతో ఇటువంటి ఫేక్ ఆర్డర్లు సృష్టిస్తూ అమాయక నిరుద్యోగులను దోచుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నా పలువురు నిరుద్యోగులు ఇటువంటి వారి ఉచ్చులో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. బోగస్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరైనా చెబితే అటువంటి వారిని నమ్మవద్దు. గతంలో ఇదే విధంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు అక్రమగా వసూలు చేసిన సంఘటనలు వెలు గు చూశాయి. నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఎవరైనా జాయినింగ్ ఆర్డర్లు తెస్తే ప్రధానోపాధ్యాయులు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయండి. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం స్ఫూర్తి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరిట ఇచ్చిన జాయినింగ్ ఆర్డర్హైస్కూల్లో తాను స్వచ్ఛందంగా పనిచేస్తానని ఆ వ్యక్తి ఇచ్చిన లెటర్ సార్ నాకు మీ స్కూల్లో ఉద్యోగం వచ్చింది ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్డరు ఇచ్చింది ఫేక్ అపాయింట్మెంట్తో పాఠశాలకు వచ్చిన వ్యక్తి నివ్వెరపోయిన హెచ్ఎం -
ప్రజా పంపిణీ అస్తవ్యస్తం
రామభద్రపురం: కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవ స్థ అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పకడ్బందీగా సాగిన ఇంటి వద్దకే రేషన్ విధానానాన్ని రద్దు చేసి వాహనదారుల పొట్టకొట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు నిరుపేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకులలోనూ కోత విధించింది. జిల్లాలో రేషన్ 1254 దుకాణా లు ఉండగా వాటి పరిధిలో ఉన్న 5,70,980 కార్డులకు 9,02,06 మెట్రిక్ టన్నుల బియ్యం 11 ఎంఎల్ఎస్ గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలకు నెల నెలా ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ సరుకు లే ఆసరా. అయితే రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం పొందుతున్న సరుకులతో పాటు అదనంగా రాగులు, కందిపప్పు, గోధుమ పిండి పంణీ చేస్తామని చెప్పి ఇప్పుడేమో ఇచ్చే సరుకుల్లోనే కోత విధిస్తోంది. కేవలం బియ్యం, పంచదారతో మాత్రమే సరిపెడుతున్నారు. కొద్ది నెలలు కంది పప్పు ఇచ్చి అదీ పూర్తిగా ఎత్తేశారు. అలాగే రాగులైతే ఈ కోటాలో కొంత మందికే పరిమితం కాగా పలు చౌక దుకాణాలకై తే స్టాకే రాకపోవడం శోచనీయం. గోధుమ పిండి విషయానికొస్తే గత నెల వరకు ఇచ్చి ఈ నెల కోటాలో పూర్తిగా కోత విధించారు. గత నెల గోధుమ పిండి పంపిణీ చేసి ఈ నెల ఎందుకు ఇవ్వలేదంటూ కార్డుదారులు నిలదీస్తుండడంతో సరుకులు పంపిణీ చేసే డీలర్లకు తలనొప్పిగా మారుతోంది. రాగులు కూడా గోదాంలో అరకొరగా స్టాకు ఉండడంతో ముందొచ్చిన డీలర్లకు ఇచ్చేశాం.వచ్చే నెల చూద్దామంటూ గోదాం ఇన్చార్జిల నుంచి సమాధానం వస్తున్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాపుల ద్వారా కందిపప్పు,వంట నూనె, గోధుమ పిండి పంపిణీ చేయాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ డీలర్లకు క్యూఆర్ కోడ్ తంటాలు.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో అక్రమా ల కట్టడికి కొత్తగా క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకా రం చుట్టింది. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి సంబంధిత అధికారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయా లి. ఆ తర్వాతనే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. రేషన్ డీలర్లు కూడా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం తీసుకోచ్చేటప్పుడు తమకు ఇస్తున్న బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే రేషన్ దుకాణానికి తెచ్చి కార్డుదారుల కు పంపిణీ చేయాలి. ఈ విధానంతో అటు స్టాకు పాయింట్లలో గానీ,రేషన్ షాపుల్లోగానీ బియ్యం సక్రమంగా కచ్చితమైన తూకం ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అయితే ఈ విధానంతో ప్రతి బస్తా(50 కిలోలు)ను రేషన్ షాపుల వద్ద దించే హమాలీలు క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసేందుకు గంటల సమయం పడుతోంది. బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతోంది.అలాగే రేషన్ డీలర్లు ప్రతి బస్తా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే గాని కార్డుదారులకు పంపిణీ సాధ్యం కాదు. ప్రతి నెలా 15వ తేదీలోపు నిత్యావసరాల సరుకులను పంపి ణీ చేయాల్సి ఉంది. కొత్త విధానంతో ఈ ప్రక్రి య ఆలస్యం అవుతోంది. ఈ విధానం తమకు ఇబ్బందిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ తొలుత డీలర్లకు శిక్షణ ఇచ్చి ఆపై కొత్త విధానం అమలుకు పూనుకుంటే మేలని, దీని వల్ల సాంకేతిక సమస్యలు తలనొప్పి తెప్పిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా స్థానిక రేషన్ షాపుల డీలర్లు ఆందో ళనకు దిగారు. క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.ప్రభుత్వం మండలాల్లోని రేషన్‌కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీకి సరఫరా చేయలేదు.గత నెలలో అదనంగా ఉందని పంపిణీ చేశాం.గోధుమ పిండి పంపిణీ విషయంపై గోదాం ఇన్చార్జిలు, సీఎస్డీటీతో చర్చిస్తాను. అలాగే రేషన్ షాపుల్లో అక్రమాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం క్యూఆర్‌కోడ్ స్కానింగ్ చేసే కొత్త విధానం అమలు చేసింది. దీన్ని విధిగా అమలు చేయాల్సిందే.ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ డీలర్లు తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చినట్లు నా దృష్టికి రాలేదు. –మురళీనాథ్, డీఎస్వో, రామభద్రపురం -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు దేశిక్రామ్
గుమ్మలక్ష్మీపురం: అండర్ – 10 చైల్డ్ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న నిమ్మల దేశిక్రామ్ (జొల్లగూడ గ్రామం) ఎంపికై నట్లు కోచ్ పత్తిక బాలరాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ నెల 4న విజయనగరంలోని కస్పా హైస్కూల్లో జరిగిన అండర్ – 10, అండర్ – 12 విభాగం ఫెన్సింగ్ ఇంటివిడ్యువల్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి సెలక్షన్ ట్రయల్స్ ఫెన్సింగ్ క్రీడా పోటీలలో దేశిక్ రామ్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడన్నారు. అలాగే ఈ నెల 5, 6వ తేదీల్లో విజయవాడలోని శ్రీ అలపతి రామారావు, అనుమోలు లక్ష్మణరావు ఫంక్షన్ హాల్లో(హనుమాన్‌పేట) జరిగిన 7వ ఏపీ స్టేట్ చైల్డ్ (అండర్–10) ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో దేశిక్ రామ్ బంగారు పతకం కై వశం చేసుకుని, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ నెలలోనే జమ్ముకశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో దేశిక్రామ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థినిని పలువురు అభినందించారు. -
ఇండియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం
రాజాం సిటీ: స్థానిక పాలకొండ రోడ్డులో గల ఇండియన్ బ్యాంక్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా బ్యాంక్ నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. స్ట్రాంగ్ రూమ్, లాకర్ల గది వైపు మంటలు వెళ్లకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలతో పాటు విలువైన పత్రాలు కాలి బూడిద కాగా.. లాకర్లు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ ఇన్చార్జి ఎస్సై వై.గోవిందరావు తెలిపారు. -
ప్రాణాలతో చెలగాటం..
పార్వతీపురం రూరల్: రైలెక్కి గమ్యం చేరాల్సిన ప్రయాణికులు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారుతోంది. స్టేషన్లో నిలిచి ఉన్న గూడ్స్ రైళ్ల కింద నుంచే.. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వ్యాగన్ల చక్రాల సందుల్లోంచి అత్యంత ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఒక పక్క ఏ క్షణాన కదులుతుందో తెలియని మృత్యుశకటం లాంటి గూడ్స్ రైలు.. మరో పక్క తమ రైలు అందుకోవాలనే ఆరాటం.. ఈ క్రమంలో పసిపిల్లల చేతులు పట్టుకుని, లగేజీలతో రైలు కింద నుంచి దూరుతూ ప్రయాణికులు చేస్తున్న ఈ సాహసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ఆస్కారం ఉందని అక్కడి దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. -
విజయనగరం
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వంటింట్లో ధరల మంట..!రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. –8లోవిజయనగరం గంటస్తంభం: మార్కెట్లో నిత్యావసరాల ధరల భగభగలతో సామాన్యుడి బతుకు బండి గతి తప్పుతోంది. ఒక్కసారిగా పెరిగిన ఉల్లిపాయలు, పంచదార, బియ్యం ధరలు చాలవన్నట్లు కూరగాయలు కూడా అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. పేదలకు చుక్కలు చూపిస్తున్న బియ్యం ధర ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు రూ.1,300 పలికిన 25 కిలోల బస్తా ఇప్పుడు రూ.1700 దాటిపోయింది. నెలకు రెండు బస్తాలు అవసరమయ్యే నాలుగైదు మంది ఉన్న కుటుంబానికి కేవలం బియ్యం కోసమే అదనంగా రూ.800పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్క బియ్యం, నూనెలే కాదు.. కందిపప్పు, పంచదార, బెల్లం ధరలు సైతం పరుగులు పెడుతున్నాయి. పిల్లలకు పాలు, పండ్లు, చిరుతిళ్లు పెట్టడం సంగతి దేవుడెరుగు.. కనీసం మూడు పూటలా తిండి దొరకడమే గగనమైపోయిందని గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కన్నీరుమున్నీరవుతున్నారు. నడ్డి విరిచిన ధరలు గత రెండేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం సన్‌ఫ్లవర్ నూనైపె కిలోకు ఏకంగా రూ.72కు పైగా బాదారు. స్థానిక కిరాణా కొట్లలో పెరిగిన ధరల తీరు చూస్తే సామాన్యుడికి బతకాలన్న ఆశే చచ్చిపోతోంది. కూరగాయల సెగ మార్కెట్లో ప్రస్తుతం టమాటో కిలో రూ.50 పలుకుతుండగా మిగిలిన ఏ కూరగాయలైనా కిలో రూ. 40 నుంచి మొదలవుతున్నాయి. వంటల్లో ఎంతో కీలకమైన అల్లం, పచ్చిమిర్చి ధరలు కూడా ఆకాశాన్నంటుతుండడంతో ఏమీ కొనలేని..ఏమీ తినలేని దుస్థితిలో నలిగిపోతున్నారు. -
యువతతోనే దేశాభివృద్ధి..
గజపతినగరం రూరల్ (జామి): దేశానికి ఉజ్వల భవిష్యత్ యువతతోనే సాధ్యమవుతుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. యువత బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. జామి మండలం అన్నంరాజుపేట గ్రామంలో ఆదివారం రాత్రి చేపట్టిన ‘పల్లెనిద్ర‘ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ దురలవాట్లకు దూరమయ్యేలా చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. గ్రామ సందర్శనలు, పల్లెనిద్ర, సంకల్పం వంటి కార్యక్రమాల ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతున్నారని తెలిపారు. మహిళలు, చిన్నారుల పట్ల గౌరవంగా నడుచుకోవాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దన్నారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని స్పష్టం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, సబ్ ఇన్స్పెక్టర్ వీరజనార్ధన్ పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ -
నేడు పీజీఆర్ఎస్
విజయనగరం గంటస్తంభం: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందు కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ ఆడిటోరి యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరి గే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేయవచ్చన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల కు సంబంధించిన సమస్యలపై పీజీఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజ లు తమ అభిప్రాయాల ను కూడా తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. -
● గోతులు తవ్వి పూడ్చుతున్న పశుమాంస విక్రయదారులు ● ఇబ్బందులు పడుతున్న జేఎన్టీయూ జీవీ విద్యార్థులు
విజయనగరం టౌన్: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 50–55 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి విజయనగరం రైల్వేస్టేషన్‌కి దగ్గరలో ఆదివారం మృతి చెందాడు. మృతుడి శరీరంపై తెలుపు, నీలం రంగు ఉన్న పుల్‌హ్యాండ్స్ షర్ట్, ఎరుపు,పసుపు, నీలం రంగు గల రగ్గు కప్పుకుని ఉన్నాడు. ఆచూకీ తెలిసి న వారు ఫోన్ 9247585742 నంబర్‌ను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వీఎన్.మూర్తి కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ విజయనగరం వర్సిటీ విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొండపై విశ్వవిద్యాలయం కొనసాగుతోంది. అయితే విశ్వవిద్యాలయం వెనుక భాగాన కొండ దిగువన గతంలో పశు కబేళా నిర్వహించేవారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అనంతరం అక్కడ పశు కబేళా మూసివేశారు. అయితే ఇప్పటీకీ పశుమాంస విక్రయదారులు కొంతమంది పశు కళేబరాలను, మాంసం వ్యర్థాలను అక్కడికి తరలించి పడేస్తున్నారు. దీంతో జేఎన్టీయూ ఇంజినీరింగ్ తరగతుల నిర్వహణ సమయంలో కుళ్లిన పశు వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కొండకు ఆనుకుని బొండపల్లి మండల పరిధిలోని రెడ్డిపేట, డోలపేట, జియ్యన్నవలస గ్రామాలు ఉన్నాయి. కుళ్లిన వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి పశు మాంస వ్యర్థాలను తరలించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు. -
భోగాపురంలో దారుణం..
● డబ్బులు ఇవ్వలేదని యువకుడి చేతులు కట్టి బైక్‌తో ఈడ్చుకెళ్లిన వైనం ● రంగంలోకి దిగిన పోలీసులు పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి చేతులు కట్టి ద్విచక్ర వాహనంతో ఈడ్చుకెళ్లిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ ఏఆర్ దామోదర్ భోగాపురం పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగాపురం గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ మహేష్ నుంచి రామచంద్రపేటకు చెందిన ఏల్లా రాజేష్ 10 వేల రూపాయలకు బైక్ కొనుగోలు చేశాడు. ట్రయల్‌కు వెళ్తూ భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కారును ఢీ కొట్టాడు. దీంతో భోగాపురం పెద్దవీధికి చెందిన బైక్ మెకానిక్ లెంక శ్రీరామ్, బైక్ అమ్మకం చేసిన మహేష్ తరఫున మధ్యవర్తిగా వ్యవహరించి ఆరు వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చాడు. అయితే ప్రమాదం చేసిన బాధితుడు రాజేష్ డబ్బులు ఇవ్వకుండా పారిపోవడంతో శ్రీరామ్ హెడ్ కానిస్టేబుల్‌కు రూ.6 వేలు చెల్లించి బైక్ తీసుకెళ్లాడు. ఇదంతా జరిగి నెల రోజులైంది. ఈ క్రమంలో ఈ నెల ఐదో తేదీన భోగాపురంలో రాజేష్‌ను మహేష్, తదితరులు అటకాయించి షెడ్లో బంధించారు. రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను ఇవ్వలేకపోవడంతో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో బాధితుడు రాజేష్ మెడకు, చేతులకు తాళ్లు కట్టి బైక్‌పై ఈడ్చుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితులు లెంక శ్రీరామ్, మహేష్, సూర్యనారాయణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాధితుడ్ని రక్షించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఏఆర్ దామోదర్ భోగాపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
9న భోగాపురంలో బీజేపీ భారీ బహిరంగ సభ
పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలో ఈనెల 9న నిర్వహించనున్న బీజేపీ భారీ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా స్థల పరిశీలనలో భాగంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాడు రాజేష్‌వర్మ స్థానిక కొమ్మూరు అప్పుదొర కళా ప్రాంగణాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వేదిక సమాయత్తం, కార్యకర్తలు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్ వసతులపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజేష్‌వర్మ మాట్లాడుతూ..భోగాపురం మండలంలో తొలిసారిగా బీజేపీ ఆధ్వర్యంలో ఇంతటి భారీ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. సభను జయప్రదం చేసేందుకు కార్యక్రమంలో స్థానిక నాయకుడు అడపా ప్రసాద్, విజయనగరం బీజేపీ జనరల్ సెక్రటరీ పతివాడ రాజేష్, భోగాపురం బీజేపీ మండల అధ్యక్షుడు దిక్కు అప్పలరాజు, యువమోర్చా అధ్యక్షుడు రాజాన రమణ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గరుగుబిల్లి: మండలంలోని ఉల్లిభద్ర సమీపంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామానికి చెందిన గంట మహేష్ (35) పార్వతీపురం నుంచి ద్విచక్ర వాహనంపై ఖడ్గవలస వైపు వెళ్తుండగా.. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఎదురుగా ఎర్రగుడి వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న గరుగుబిల్లి ఎస్సై షేక్ ఫకృద్దీన్ కేసు నమోదు చేసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు చిన్నమేరంగి సీఐ తిరుపతిరావు ప్రత్యేక పర్యవేక్షణలో ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆయా బృందాలు సంఘటన జరిగిన మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నాయని చెప్పారు. ట్రాక్టర్ ఢీ కొని మహిళ.. నెల్లిమర్ల రూరల్: మండలంలోని పూతికపేట గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనపై ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గజపతినగరం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఒడ్డు నరసమ్మ (41) తన కుమారుడు బన్నీ, మేనళ్లుడు రాకేష్‌తో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై జరజాపుపేటలో ఉన్న తన అక్క ఇంటికి వస్తుండగా.. పూతికపేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నరసమ్మకు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ఇద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. నరసమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
భోగాపురంలో దారుణం.. యువకుడ్ని బైక్‌కు తాళ్లతో కట్టేసి
విజయనగరం: జిల్లాలోని భోగాపురంలో దారుణం చోటు చేసుకుంది. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదని ఓ కస్టమర్‌ను తాళ్లతో కట్టేసి, బైక్‌తో ఈడ్చుకెళ్లి నడిరోడ్డుపై తిప్పిన అమానవీయ ఘటన వెలుగుచూసింది. రామచంద్రరాజు పేటకు చెందిన ఎల్లా రాజేష్ అనే యువకుడు బైక్ రిపేర్ చేయించుకున్నాడు. అనంతరం డబ్బులు ఇవ్వలేదనే కారణంతో మెకానిక్ మహేష్‌తో సహా మరో నలుగురి కలిసి.. రాజేష్‌ను హింసించారు. రాజేష్‌ను కట్టేసి బైక్‌కు తాళ్లతో కట్టి ఊరేగించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మెకానిక్ మహేష్‌తో సహా మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కింద పలు సెక్షన్ల నమోదు చేశారు. ఏపీకి భారీ వర్ష సూచన -
రోడ్డెక్కిన ఏపీ సచివాలయ ఉద్యోగులు.. భారీగా ట్రాఫిక్ జామ్
విశాఖపట్నం: సచివాలయ ఉద్యోగులు రోడ్డెక్కారు. ద్వారకా బస్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే అన్ని దారులను ఉద్యోగులు దిగ్బంధించారు. పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తమ సమస్యలు పరిష్కరిచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీవో నం.11ను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. డిప్యూటేషన్లు వద్దు.. ప్రమోషన్లు కావాలి అంటూ నినదించారు. 2 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలని అంటున్నారు. ప్రొబేషన్ కాలానికి సంబంధించిన 9 నెలల బకాయిలతో పాటు ఒక వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని చెప్పారు. ప్రతి ఉద్యోగికి కనీస మూల వేతనం రూ.30 వేలకు తగ్గకుండా ప్రమోషన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు మూడు నెలల్లోగా అన్ని ప్రయోజనాలు అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం చేపట్టాలని వారు కోరారు. అలాగే, సాయంత్రం 5 గంటల తర్వాత వాట్సాప్ సందేశాల ద్వారా ఉద్యోగులను వేధించడం ఆపాలని అనన్నారు. సెలవు రోజుల్లో విధులు నిర్వహించినప్పుడు పరిహార సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే జోన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనను ఉద్ధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. -
గురువులే భావితరాల శిల్పులు
విజయనగరం అర్బన్: భావి తరాలను తీర్చిదిద్దడంతో పాటు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారిక శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే ఉపాధ్యాయులకు నిజమైన గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రత్యేక ప్రతిభ, ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యేలు పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగు తల్లి, మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి, మానవ వనరుల వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. విద్యావంతుల కృషితో దేశం హరిత, శ్వేత, సమాచార సాంకేతిక విప్లవాలను సాధించి ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చాటించదన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, భావి సమాజాన్ని నిర్మించే మహత్తర బాధ్యత అని అన్నారు. 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 90 మందిని మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యా రంగానికి వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారని వారు కొని యాడారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి దిశానిర్దేశం చేయాలి: మంత్రి కొండపల్లి జిల్లా విద్యా ప్రగతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : కలెక్టర్ 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి, గురువు–శిష్య సంబంధం, విద్యా ప్రాముఖ్యతను ప్రతిభింబించే గీతాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీఈఓ యు.మాణిక్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్రం ఒక్కటే...
● ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు ● ఇద్దరే పిల్లలు ● పెదనడిపల్లి అంగన్వాడీ కేంద్రం తీరు! పూసపాటిరేగ: మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో ఇద్దరు అంగన్వాడీ కార్యకర్తలు... ఇద్దరు చిన్నారులతో అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది. శనివారం ఉదయం ఒక కార్యకర్త, ఇద్దరు చిన్నారులు మాత్రమే కేంద్రంలో వుంటూ నిర్వహిస్తున్నారు. రెండో అంగన్వాడీ కార్యకర్త ఎటువంటి అనుమతి లేకుండానే కేంద్రానికి రాకుండా గైర్హాజరయ్యారు. అసలు ఇద్దరే పిల్లలు ఉన్న ఈ కేంద్రంలో ఇద్దరు కార్యకర్తలు ఏం చేస్తారన్నది అసలు ప్రశ్న. ఈ తంతును చూసి స్థానికులు విస్తుపోతున్నారు. చాలా అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గడంతో కేంద్రాలు నామమాత్రంగానే నడుస్తున్నాయి. కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కొరతగా వుండటం, భవనాలు లేకపోవడం, ఇరుకు అద్దె గదులలో కేంద్రాలు నిర్వహించడంతో కేంద్రానికి చిన్నారులను పంపించడానికి తల్లిదండ్రులు వెనుకాడుతున్నారనే పరిస్థితులు వున్నాయి. మండల పరిధిలో కొత్తకొప్పెర్ల, పేరాపురం ఎస్సీ కాలనీ కేంద్రాలు అంగన్వాడీ కార్యకర్తలు లేకుండానే నిర్వహిస్తున్నారు. అదనంగా కార్యకర్తలు వున్న చోట ఖాళీగాను కార్యకర్తలు కాలయాపన చేస్తున్నారు. కేంద్రాలను పర్యవేక్షించాల్సిన ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణ లోపం వలనే కేంద్రాలలో కార్యకర్త పనితీరు మసగబారుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించి గాడిలో పెట్టాలని పలువురు చిన్నారులు తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై భోగాపురం ఐసీడీఎస్ సెక్టార్ పీఓ లావణ్య స్పందిస్తూ అనుమతి లేకుండా అంగన్వాడీ కేంద్రానికి గైర్హాజరు అయిన కార్యకర్తపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
విద్యార్థుల భవిష్యత్ మార్చేది ఉపాధ్యాయులే..
● పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ ● 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారంసీతంపేట: విద్యార్థుల భవిష్యత్‌ను చదువు ద్వారా తీర్చిదిద్ది, వారి జీవితాల్లో మార్పు తీసుకురాగలిగేది ఉపాధ్యాయులేనని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ, వారిలో మంచి విలువలు, క్రమశిక్షణా జ్ఞానాన్ని పెంపొందించాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఐటీడీఏ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ప్రస్తుతకాలంలో సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను ఉపాధ్యాయులు నిరంతరం అవగాహన చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన బోధనా పద్ధతులను అందిపుచ్చుకుని విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించాలని తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఏపీఓ జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, ఈఈ రమాదేవి, ఏఓ సునీల్, జీసీడీఓ రాములమ్మ, సీఎంఓ చిరంజీవులు, ఏటీడబ్ల్యూఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు గల్లంతు..
● కళ్లముందే ఎండిపోతున్న పత్తి మొక్కలు ● లబోదిబోమంటున్న రైతులు ● ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న అన్నదాత..రామభద్రపురం: ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్న రైతులు ఆశలు అడియాసలయ్యాయి. నెలల తరబడి వర్షాల్లేకపోవడంతో కళ్లముందే పత్తి మొక్కలు ఎండిపోతున్నా.. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులు తలలు పట్టుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,204 హెక్టార్లు కాగా.. ఈ ఏడాది 2,291 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. పత్తి సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తుండడంతో సాధారణ సాగు కంటే 87 హెక్టార్లలో సాగు పెరిగింది. ఇందులో ఒక్క రామభద్రపురం మండలంలోనే 1320 హెక్టార్లలో పత్తి సాగవుతోంది. అయితే రెండు నెలలుగా వర్షాల్లేకపోవడంతో పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. మామూలుగా పత్తి పంటలో ఈ పాటికే ఒకసారి పత్తి తీస్తారు. అయితే పంట వేసి 90 రోజులవుతున్నా కిలో దిగుబడి కూడా రాలేదు. నాలుగు అడుగుల మేర పెరగాల్సిన మొక్కలు కనీసం అడుగు ఎత్తు కూడా పెరగలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బాల ఏసు విగ్రహం ధ్వంసం
బొబ్బిలి: పట్టణంలోని యాదవవీధి కూడలిలో కొలువై ఉన్న బాల ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. ప్రహారీ ఉన్న బాల ఏసు మందిరలోకి చొరబడి విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమై పికెట్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి సమీప వీధుల్లో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. సీఐ కె. నారాయణరావు, ఎస్సై డి. కొండలరావు సంఘటనపై స్థానికులతో మాట్లాడుతూ.. వివరాలు తెలుసుకుంటున్నారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇటువంటి చర్యలు దుండగులు పాల్పడుతన్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ అధ్యక్షుడు మునకాల శ్రీనివాస్ అన్నారు. మత విద్రోహ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని బొబ్బిలి క్రైస్తవ సంఘాల సమాఖ్య ఐక్యవేదిక నాయకుడు కురమాన జోగారావు డిమాండ్ చేశారు. -
రాజ్యాంగం కల్పించిన బాధ్యత ఓటు హక్కు : ఆర్డీఓ
బొబ్బిలి: ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన భారత పౌరుడుకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా గుర్తించాలని ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావు అన్నారు. పట్టణంలోని రాజా కళాశాలలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు పొందేందుకున్న ఫారం ఏ దరఖాస్తు పత్రాలను అందజేసి పూరించే విధానాన్ని తెలియజేశారు. తహసీల్దార్ ఎం.శ్రీను, ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ బలివాడ గౌరీశంకర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రీసర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : జేసీ విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియలను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్ అంశాలు, పాసుపుస్తకాల ప్రక్రియపై సమీక్షించారు. సెప్టెంబరు నెలకు సంబంధించి 29 గ్రామాల్లో 17,888 ఖాతాలకుగాను ఇప్పటివరకు 2,030 ఖాతాలకు మాత్రమే ఈ–కేవైసీ పూర్తయిందని, ఇది 11.35 శాతంగా ఉందని తెలిపారు. అక్టోబరు నెలకు సంబంధించి 80 గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న పాసుపుస్తకాల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ–కేవైసీ, ఫైనల్ ఆర్ఓఆర్, 22ఏ లేయర్, చెక్‌మెమో, గుడ్ ఫర్ ప్రింటింగ్ దశల్లో పెండింగ్‌లు లేకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రీసర్వేలో నాలుగు, ఐదు, ఆరో విడతల పనుల పురోగతిని జేసీ సమీక్షించారు. నాలుగో విడతలో వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో, జేసీ లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న గ్రామాలను పరిశీలించారు. ఐదో విడతలో వెక్టరైజేషన్, గ్రౌండ్ ట్రూతింగ్, ఈ–కేవైసీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆరో విడతలో గ్రౌండ్ ట్రూతింగ్, నోటీసుల జారీ, పెండింగ్ ఖాతాలపై సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి అర్హులైన వారికి భూ హక్కు ప్రతాలు అందించాలని, ప్రజలకు ఎలాంటి జాప్యం కలగకుండా క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ స్పష్టం చేశారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల తనిఖీవిజయనగరం లీగల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను ఎక్సైజ్ కోర్టు జడ్జి సీహెచ్ శ్రీవిద్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యటనలో భాగంగా బీసీ కాలనీలోని ప్రీ మెట్రిక్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్, రాజీవ్‌నగర్ కాలనీలోని పోస్ట్‌మెట్రిక్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్, నటరాజ కాలనీలోని పోస్ట్‌మెట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, వీటీ అగ్రహారంలోని పోస్ట్‌మెట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యాభ్యాసం, ఆరోగ్య పరిస్థితి, భోజనం మెనూ, తాగునీరు, మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వంటశాల, భోజనశాల, స్టోర్‌రూమ్, మరుగుదొడ్లు, స్నానాల గదులు, పడక గదులతో పాటు హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వసతిగృహాల నిర్వహణను మరింత మెరుగుపరచాలని నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. -
ఖజానాకు గండి పడొద్దు
● నిర్దేశిత లక్ష్యాలు చేరాల్సిందే : కలెక్టర్ విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని వృద్ధిపరచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. తన చాంబర్లో రిజిస్ట్రేషన్, రవాణా, గనులు భూగర్భ ఖనిజ శాఖ, ఎకై ్సజ్, అటవీ, వాణిజ్య పన్నులు తదితర ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ప్రగతిని సమీక్షించిన కలెక్టర్, అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కొన్ని శాఖల ద్వారా ఆదాయం తగ్గడానికి గల కారణాలను ఆరా తీశారు. ప్రతి శాఖకు ఇచ్చిన ఆదాయ లక్ష్యాన్ని అధిగమించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తప్పనిసరిగా తమ లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ అపర్ణ, డీఎఫ్ఓ సోమసుందర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, గనుల శాఖ డీడీ సూర్యచంద్రరావు, సీనియర్ ఎంవీఐ దుర్గాప్రసాదరావు, సబ్ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు. ● అన్ని శాఖలకూ ఏ+ లక్ష్యం ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల్లో(కేపీఐ) అన్ని శాఖలు ఏ+ గ్రేడ్ సాధించేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా పనితీరును పరిశీలించిన కలెక్టర్.. నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరేందుకు కేపీఐలు కీలకమని పేర్కొన్నారు. త్రైమాసిక నివేదికల్లోని 54 శాఖలు, అర్ధసంవత్సర నివేదికల్లోని 62 శాఖల పనితీరును సమీక్షించారు. బీ, సీ గ్రేడ్లలో ఉన్న శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్.. వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. బీ, సీ గ్రేడ్లతో పాటు ఏ గ్రేడ్‌లో ఉన్న శాఖలు కూడా ఏ+ సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ పి.బాలాజీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా టెండర్లు
పార్వతీపురం రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన నిత్యావసరాలను అందించేందుకు జీసీసీ సరుకుల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ముగిసింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థలకు అవసరమైన సరుకుల సరఫరా కోసం పార్వతీపురం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో పీఓ ఆర్. వైశాలి, తదితర అధికారులు ఈ టెండర్ల ప్రక్రియను శనివారం పకడ్బందీగా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు అందే సరుకుల్లో నాణ్యతతో పాటు, సరఫరాలో సమయపాలనకు పెద్దపీట వేశారు. ఈ ప్రక్రియలో సరఫరాదారులు సమర్పించిన పత్రాలు, కోట్ చేసిన ధరలు, సరుకుల నాణ్యతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా బేరీజు వేశారు. పోటీ ధరలకు, నిర్దేశిత స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్న బిడ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. సరుకుల సరఫరాలో నాణ్యతా లోపాలున్నా, జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదని ఎంపికై న సరఫరాదారులకు అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు సీతంపేట: మండలంలోని కిట్టాలపాడు జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. తొత్తడి గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై నిమ్మక పవన్, సునీత, అనూషా వస్తున్నారు. పత్తికగూడ మలుపు వద్దకు వచ్చేసరికి సీతంపేట నుంచి పాలకొండ వైపు వెళ్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఆటో అద్దం తగిలి కిందపడ్డారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. -
12 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
కురుపాం: పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డులోని ఓ హోటల్లో అనధికారికంగా నిల్వ ఉంచిన 8 ఫుల్ గ్యాస్ సిలిండర్లు, ఓ స్వీట్ స్టాల్లో 4 గ్యాస్ సిలిండర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్ ఎస్సై రామారావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, కురుపాం సివిల్ సప్లైస్ డీటీ రమణారావు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ.. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, తదితర వాణిజ్య సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని సూచించారు. గృహ అవసరాలకు రూపొందించిన సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. -
పెళ్లి సందడి మరువకముందే..
● రోడ్డు ప్రమాదంలో నవ వరుడి మృతి ● పెళ్లింట తీవ్ర విషాదం ● కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులుసంతకవిటి: కోటి కలలతో, బంధుమిత్రుల సందడి మధ్య నూతన జీవితంలోకి అడుగు పెట్టిన వారం రోజుల్లోనే.. వరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కోసూరు నారాయణరావుకు(పవన్) (20) అదే గ్రామానికి చెందిన హేమలతతో ఆగస్టు 30న వివాహం జరిగింది. తమ బంధువుల ఇంటిలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు నారాయణరావు తన స్నేహితుడు అంబటి జగదీష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై పొందూరు మండలం రాపాక గ్రామం వెళ్లాడు. అక్కడ నుంచి చిలకపాలెంలో ఉన్న తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్లి, తిరిగి వస్తుండగా పొందూరు మండలం లోలుగు వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణరావు అక్కడికక్కడే మృతి చెందగా.. జగదీష్‌కు గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఇంట విషాధ వాతావరణం నెలకొంది. కాళ్ల పారాణి ఆరక ముందే భర్త దూరమవడంతో నవ వధువు, కుటుంబ సభ్యులు కన్నీరమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఎల్‌నినో దెబ్బకు.. రైతు కుదేలు..!
–8లోపెళ్లయిన వారం రోజులకే వరుడు మృతికోటి కలలతో, బంధుమిత్రుల సందడి మధ్య నూతన జీవితంలోకి అడుగు పెట్టిన వారం రోజుల్లోనే.. వరుడు మృతి చెందాడు.విజయనగరం ఫోర్ట్: ఎల్‌నినో ప్రభావం జిల్లా రైతాంగంపై తీవ్ర స్థాయిలో పడింది. ఎల్‌నినో కారణంగా ఇంతటి ఘోర పరిస్థితి ఉంటుందని రైతులు కూడా ఉహించి ఉండరు. ఆలస్యం అయినా వర్షాలు పడతాయని రైతులు ఇన్నాళ్లు భావించారు. కాని వాన జాడ కరువవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంట విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం మాట దేవుడెరుగు.. తిండి గింజలు కూడా కరువవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన అర్ధ శతాబ్ద కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటల సాగుకు వేలాది రుపాయిలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు పంటలు పూర్తిగా ఎండిపోవడంతో తమ పరిస్థితి ఏంటో తెలియడం లేదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ● రైతు కుదేలు.. ఇప్పటి వరకు సాగు చేసిన పంటలు, ముఖ్యంగా వరి పంటకు రైతులు వేలాది రుపాయిలు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఆ పంటలు నీరు లేక ఎండిపోవడంతో పెట్టుబడి కూడా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఎకరం వరి పంట సాగుకు వరి విత్తనాలకు, దమ్ము, నారు తీయడానికి, నాట్లు వేయడానికి, ఎరువులకు ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.9 వేలు ఖర్చు పెట్టారు. మూడు ఎకరాలు ఉన్న వారు అయితే రూ.24 నుంచి రూ. 27 వేలు వరకు ఖర్చు చేశారు. ఐదెకరాలు ఉన్న వారు రూ.40 వేల నుంచి రూ.45 వేలు వరకు ఖర్చు చేశారు. ఎలినినో ప్రభావంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ● 69,879 హెక్టార్లకే పరిమితం.. జిల్లాలో వరి పంట సాధారణ విస్తీర్ణం 1,00,251 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 69,879 హెక్టార్లు మాత్రమే సాగైంది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 11, 318 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 8799 హెక్టార్లలో సాగైంది. చోడి పంట 43 హెక్టార్లకు 26 హెక్టార్లు సాగైంది. వేరుశనగ 284 హెక్టార్లకు 89 హెక్టార్లు, నువ్వులు 5252 హెక్టార్లకుగాను 2667 హెక్టార్లు, పత్తి 2204 హెక్టార్లకుగాను 2291 హెక్టార్లు, గోగు 254 హెక్టార్లకుగాను 121 హెక్టార్లు, చెరుకు 3813 హెక్టార్లకుగాను 1721 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వర్షపాతం (మి.మీ.)170.8123.5137.5 187.996.358.1జూలైజూన్ఆగస్టు పశుగ్రాసానికి కొరతే.. పంటలు ఎండిపోతుండడంతో పశుగ్రాసానికి కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వరి నూర్పులు తర్వాత వచ్చే వట్టి గడ్డి దొరకని పరిస్థితి. పశుగ్రాసం సాగు చేయడానికి కూడా బోర్లు ఉన్న చోట తప్ప మిగతా చోట్ల వీలు కాని పరిస్థితి. ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. ఎండిపోతున్న నారుమడులు ప్రస్తుత ఖరీఫ్‌లో సమయం మించి పోతుందని భావించిన రైతులు చెరువులు, గుంతల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజిన్లు ద్వారా తోడి వరి పంట సాగుకు పూనుకున్నారు. అదేవిధంగా నారుమడులను బతికించుకున్నారు. ప్రస్తుతం చెరువులు, గుంతల్లో కూడా నీరు లేకపోవడంతో నారుమడులు ఎండిపోతున్నా బతికించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో నారుమడులు, నాట్లు వేసిన మడులు కళ్లముందే ఎండిపోతున్నా ఏమి చేయలేని స్థితిలో రైతులు కొట్టుమిట్టుడుతున్నారు. వర్షాభావంతో ఎండుతున్న పంటలు వేలాది రుపాయిలు పెట్టుబడులు పెట్టిన రైతులు నీరు లేక ఎండిపోతున్న నారుమడులు పశుగ్రాసం కొరత కూడా తప్పేలా లేదు.. అన్నదాత ఆందోళన -
పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
కొత్తవలస: వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న మండల కేంద్రం కుమ్మరవీధికి చెందిన గంగవరపు కేశవను సీఐ టి.వి.విజయకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం స్థానిక కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..గతేడాది డిసెంబర్లో మంగళపాలెంలో గల శివాలయంలో.. ఈ ఏడాదిలో విశాఖపట్నం రోడ్డులో గల దుర్గాదేవి గుడిలోను.. అలాగే కుమ్మరి బంజిరీ కాలనీలో గల ఒక ఇంట్లో జరిగిన దొంగతనాల్లో కేశవ నిందితుడని చెప్పారు. అప్పటినుంచి ఆయన పరారీలో ఉండగా.. కొత్తవలస రైల్వేస్టేషన్ వద్ద అతడ్ని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై జోగారావు పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన అభిమానం
● ఘనంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ● ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం జిల్లా కేంద్రంలో ఽఘనంగా జరిగాయి. తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మజ్జి శ్రీనివాసరావు, భార్య పుష్ఫాంజలి, కుమార్తె సిరిసహస్ర, అల్లుడు ప్రదీప్‌నాయుడు, కుమారుడు మోహిత్‌తో కలిసి విజయనగరం ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా.. పూజలు అనంతరం అమ్మవారి దీవెనలు అందజేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన కార్లు, బైక్‌లతో స్థానిక ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మజ్జి శ్రీనివాసరావు, ప్రదీప్‌నగర్, ఎత్తుబ్రిడ్జి, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, బాలాజీ జంక్షన్, కోట జంక్షన్ మీదుగా దాసన్నపేటలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో భాగంగా భారీగా భాణసంచా కాల్చారు. తీన్మార్తో సందడి చేశారు. జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న మజ్జి శ్రీనివాసరావును మహిళా నాయకులు హారతులిచ్చి దిష్టి తీయగా... పార్టీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర ప్రారంభించారు. పోటెత్తిన అభిమానం జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన నాయకులతో జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పార్టీ యువ నాయకురాలు బొత్స అనూషలతో కలిసి మజ్జి శ్రీనివాసరావు భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వారు పుష్ఫగుచ్ఛాలు, దుశ్శాలువాలు, కేక్‌లతో మజ్జి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీవాసరావు, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, జిల్లా యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌశిక్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, రాష్ట్ర కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, ఆమదాలవలస ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాలల సంరక్షణే ధ్యేయం..
● జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందువిజయనగరం రూరల్: బాలల సంరక్షణ, పునరావాసం, సామాజిక పునః సమీకరణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే జువైనెల్ జస్టిస్ (బాలల సంరక్షణ, రక్షణ) చట్టం – 2015 ప్రధాన ఉద్దేశమని విజయనగరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు అన్నారు. జువైనెల్ జస్టిస్ చట్టం వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హైకోర్టు, జువైనెల్ జస్టిస్ కమిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో ‘జువైనెల్ జస్టిస్ చట్టం – 2015: దశాబ్దపు అమలు – ముందడుగు’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సంప్రదింపుల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు మాట్లాడుతూ.. బాలల పునరావాసం కేవలం సంరక్షణ కేంద్రం నుంచి బయటకు తీసుకురావడంతోనే ముగియదని, కుటుంబం, విద్య, సమాజం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలతో వారిని తిరిగి అనుసంధానించడంతోనే సంపూర్ణ పునరావాసం సాధ్యమవుతుందన్నారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్, హైకోర్టు, జువైనెల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ చల్లా గుణరంజన్, ఏపీ జువైనెల్ జస్టిస్ కమిటీ సభ్యులు బి.దేవానంద్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో డ్రైవర్ మృతి
సాలూరు/గుర్ల: సాలూరు మండలం కొదమ పంచాయతీ లొద్ద జలపాతం రోడ్డు సమీపంలో శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఓ డ్రైవర్ మృతిచెందగా, ఇద్దరు గాయపడ్డారు. సాలూరు రూరల్ ఎస్ఐ రవీంద్రరాజు తెలిపిన వివరాల ప్రకారం... లొద్ద జలపాతం రోడ్డు పనుల నేపథ్యంలో ఓ కంటైనర్ అక్కడ ఉండిపోయింది. ఆ కంటైనర్‌ను లారీపై తీసుకెళ్లేందుకు విజయనగరం జిల్లా గుర్లకు చెందిన డ్రైవర్ మొయిద ఆనందరావు (50), కంకణాల ఈశ్వరరావు(సంతోష్), గంట్యాడ మండలం లక్కిడాంకు చెందిన సంగం వెంకటరావు అక్కడికి చేరుకున్నారు. కంటైనర్‌ను తరలించేందుకు సాలూరు నుంచి క్రేన్, బొబ్బిలి నుంచి ట్రాలీని తీసుకువచ్చారు. క్రేన్ సహాయంతో కంటైనర్‌ను ఎత్తి ట్రాలీపై ఉంచే ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడి ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలను క్రేన్ తాకింది. అంతే.. కంటైనర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో కంటైనర్‌ను చేతులతో పట్టుకున్న ముగ్గురిలో కంకణాల ఈశ్వరరావు, సంగం వెంకటరావు గాయాలతో బయటపడగా, ఆనందరావు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం, మృతుడుని పోస్టుమార్టం కోసం సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మొయిద శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలిసులు కేసు నమోదుచేశారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె సాయి ప్రశాంతి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తుండగా, సుస్మిత డిగ్రీ, అనూష ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మృతుడి తండ్రి అప్పారావు వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఇంటిపెద్ద మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు 90 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 90 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసింది. విద్యారంగంలో విశిష్ట సేవలందించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. అవార్డులకు ఎంపికై న వారిలో ఉపాధ్యాయ కేటగిరీ వారీగా ప్రధానోపాధ్యాయులు ఐదుగురు, స్కూల్ అసిస్టెంట్లు 56 మంది, ఎస్జీటీలు 29 మంది ఉన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై, ఎంపికై న ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేస్తారన్నారు. సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి బొబ్బిలి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. బొబ్బిలి లోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయం వద్ద సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వడంటూ శుక్రవారం నిరసన తెలిపారు. డీఆర్ బకాయిలు చెల్లించాలని, మధ్యంతర భృతిని 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు రౌతు రామ్మూర్తినాయుడు, సెక్రటరీ ఎల్.జగన్నాథం, బి.సత్యనారాయణ, సంగమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న పక్షవాతం కేసులు
● నెలకు 1200 నుంచి 1500 నమోదు ● మద్యం, పొగతాగేవారిలో అధికం ● వయసుతో సంబంధం లేకుండా వస్తున్న వ్యాధి● ఒక్క సారిగా తలనిరుత్తుత, నడవలేక పోవడం, తడబడడం ● ఒక్కసారిగా చూపు మసకబారడం ● ముఖం ఒక వైపు వంగిపోవడం, నవ్వలేక పోవడం ● ఒక చెయ్యి బలహీనంగా ఉండడం, లేవలేకపోవడం ● మాటలు అడ్డంగా రావడం, గందర గోళంగా మాట్లాడడం● మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ● పొగ, మద్యం తాగడం ● తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం, కాలుష్యం ● గర్భ నిరోధక మాత్రలు వాడడం ● గుండె జబ్బులు ● శారీరక శ్రమ లేక పోవడంవిజయనగరం ఫోర్ట్: అనేక మంది ఇటీవల కాలంలో స్ట్రోక్(పక్షవాతం) బారిన పడుతున్నారు. రోజురోజుకు పక్షవాతం బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గతంలో 55, 60 ఏళ్ల దాటిన వారు స్ట్రోక్‌కు గురయ్యేవారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తక్కువవయసు వారు కూడా పక్షవాతం బారిన పడుతున్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చాలి స్ట్రోక్ గురైన వ్యక్తిని నాలుగున్నర గంటల లోగా ఆస్పత్రిలో చేర్పించాలి. సి.టి స్కాన్ ద్వారా ఏరకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్ (రక్తనాళాల్లో గడ్డలు) గా నిర్ధారించిన వారికి ద్రోంబలైజ ఇంజక్షన్ చేస్తారు. అవసరమైతే 12 గంటలలోపు క్యాథ్ ల్యాబ్‌కు తీసుకువెళ్లి రక్తనాళాల్లో గడ్డలు తొలగిస్తారు. ఈరకమైన చికిత్స వల్ల రోగికి వైకల్యం రాకుండా చూడగలుగుతారు. స్ట్రోక్‌కు గురైన వారిలో 85 శాతంమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ రాగా 15 శాతం హెమరైజ్ స్ట్రోక్‌కు గురవుతారు. పక్షవాతానికి గురైన రోగులకు రిహాబిలిటేషన్ చాలా ముఖ్యం. కనీసం మూడు నుంచి ఆరు నెలలు జాగ్రత్తగా ఉంటూ పిజియోథెరపీ చేయించుకోవాలి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పక్షవాతం రోగులుస్ట్రోక్ లక్షణాలు పక్షవాతం రావడానికి కారణంఅవగాహన పెంచుకోవాలి ప్రతి ఒక్కరూ పక్షవాతం పట్ల అవగాహన పెంచుకోవాలి. స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటలు లోగా ఆస్పత్రిలో చేర్పించాలి. దీని వల్ల ప్రాణనష్టం, వైకల్యం బారిన పడకుండా చూడవచ్చు. బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. స్ట్రోక్ తీవ్ర సమస్య అయినప్పటికీ 80 శాతం వరకు నివారించవచ్చు. మద్యం, పొగ తాగడం మానుకోవాలి. రోజుకు కనీసం 15 నుంచి 25 నిమిషాల పాటు వ్యాయమం చేయాలి. ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించికుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ ఏడున్నర గంటల పాటు నిద్ర పోవాలి. డాక్టర్ ఎస్.వెంకటేష్, అసిస్టెంట్ ప్రొపెసర్, న్యూరోమెడిసిన్ విబాగం , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ చెక్ చేసుకుంటూ ఉండాలి మందులు వాడడం మానకూడదు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి పొగ, మద్యం తాగండం మానివేయాలి పొగతాగడం రక్తనాళాలను దెబ్బతీస్తుంది మద్యం స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది ప్రతిరోజు 30 నిమిషాల పాటు నడవడం, వ్యాయమం చేయాలి. దీని వల్ల మెదడుకు ఆరోగ్యంగా ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధాన్యం, యోగా విశ్రాంతి ద్వారా ఒత్తిడిని జయించవచ్చు హృదయ సమస్యలను పట్టించుకోవాలి స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. -
గురుపూజోత్సవం సాక్షిగా.. పీఈటీలతో ఆటలు!
సాక్షి, పార్వతీపురం మన్యం: గురుపూజోత్సవం (సెప్టెంబర్ 5) సందర్భంగా పాఠశాల విద్యా శాఖ ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికపై వ్యాయామ ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాల స్థాయి నుంచే ఇష్టమైన క్రీడారంగంలో సానబెట్టి.. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించేలా తీర్చిదిద్దుతున్న పీఈటీ, పీడీలకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. తమ ఆవేదనను బహిరంగంగా వ్యక్తపరుస్తూ, కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు జాబితాను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన విషయం విదితమే. మొత్తం 79 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా.. వీరికి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అవార్డులను అందజేయనున్నారు. ఇందులో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు కూడా లేకపోవడాన్ని ఏపీ పీఈటీ, ఎస్ఏపీఈ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. 12 వేల మందిలో ఒక్కరూ లేరా..? రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో అన్ని మేనేజ్మెంట్లు కలిపి సుమారు 12 వేల మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరిలో ఒక్క వ్యాయామ ఉపాధ్యాయునికి కూడా ఉత్తమ అవార్డుకు ఎంపిక చేయలేదు. ఇది తీవ్రంగా బాధిస్తోందని పీడీలు వాపోతున్నారు. ఇది క్రీడల పట్ల వివక్షగా భావించవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. నేడు క్రీడా రంగంలో పాఠశాల స్థాయిలోనే వివిధ పోటీల్లో బంగారు, రజత, కాంస్య పతకాలు విద్యార్థులు సాధిస్తున్నారంటే అది ఎవరి కారణంగానో ప్రభుత్వం గుర్తించలేకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థి దశలో ఏ క్రీడకు ఎవరు సరిపోతారో అని పరీక్షించి, ఫండమెంటల్ రూల్స్ నేర్పించి క్రీడాకారుని భవిష్యత్‌కు పునాదులు వేసేది ఈ వ్యాయామ ఉపాధ్యాయుడు కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, క్రీడలలో తర్ఫీదుతో పాటు.. పాఠశాలలో జరిగే ప్రతీ కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై వేసుకొని అహర్నిశలు వ్యాయామ ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని చెబుతున్నారు. ● జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా.. సైన్స్‌ఫేర్, బదిలీల కౌన్సిలింగ్, జాతీయ పండుగలకు.. ఇలా అన్నింట్లోనూ పీఈటీ, పీడీ సేవలను వినియోగించుకుని.. అవార్డులకు మాత్రం తాము అర్హులం కాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు వాపోతున్నారు. స్కూల్ అసిస్టెంట్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్, సోషల్‌కు 10వ తరగతి మార్కుల ఆధారంగా అవార్డులు ఇస్తున్నారు... పీఈటీ, ఎస్ఏ పీఈలకు, ఎస్‌జీఎఫ్‌కు సంబంధించి సర్టిఫికెట్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడలలో రాష్ట్రానికి పతకాలు కావాలి.. ఆ క్రీడలలో తర్ఫీదు ఇచ్చే పీఈటీ, ఎస్ఏపీఈలకు గుర్తింపు అవసరం లేదా? అని ఏపీ పీఈటీ, ఎస్ఏపీఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ప్రవీణ్ కిరణ్ ప్రశ్నించారు.వ్యాయామ ఉపాధ్యాయులకు ‘లీప్’తో ఎలా? లీప్ యాప్ ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. నిత్యం తరగతి గదుల్లో ఉండే ఉపాధ్యాయులకు అది సాధ్యపడుతుంది. ఆటలు, ఇతర కార్యక్రమాలతో నెలలో సగం రోజులకు పైగా పీఈటీ, పీడీలు బయట ప్రాంతాల్లోనే ఉంటారని.. అటువంటిది లీప్ యాప్ ఎలా వినియోగించగలరని పార్వతీపురం మన్యం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం చెబుతోంది. అధికారులు ఆ మాత్రం కూడా గ్రహించలేరా అని సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. లీప్ యాప్‌లో అన్నీ బాగుండి.. వారు పాఠశాలల్లో ఏమీ చెప్పకపోయినా ఫర్వాలేదా అని అంటున్నారు. ‘రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన కోటా లేదు. అందువల్లే ప్రతి సారీ మాకు నష్టం జరుగుతోంద‘ని మన్యం జిల్లాకు చెందిన ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు ‘సాక్షి’కి తెలిపారు. ఇదే విధానం కొనసాగితే.. తన ఉద్యోగ జీవితంలో అవార్డు అందుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఒక్కరూ లేరా? క్రీడలు అంటే ప్రభుత్వానికి అలుసా.. ఉత్తమ ఉపాధ్యాయులుగా తమను ఎంపిక చేయకపోవడంపై ఆవేదన చెందుతున్న పీఈటీ, పీడీలు -
రైళ్లలో ఆకస్మిక తనిఖీలు
ఠివిజయనగర టౌన్: రైళ్లలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ఒడిశా నుంచి విశాఖ వరకూ వచ్చే రైలు నంబర్ 58503 ప్యాసింజర్ ట్రైన్లో రైల్వే లోకల్ పోలీస్, ఈగల్, జీఆర్పీ సిబ్బంది సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ శుక్రవారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి ప్రధానంగా ఒడిశా రాష్ట్రం నుంచి రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతోందనే సమాచారంతో ప్రత్యేకంగా రైళ్లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టామన్నారు. ప్రత్యేక బృందం గజపతినగరం రైల్వేస్టేషన్లో ఎక్కి విజయనగరం వరకూ ప్రయాణించి బృందాలుగా ఏర్పడి అన్ని బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారన్నారు. తనిఖీల్లో పాల్గొన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరుపై గజపతినగరం సీఐ ఎస్.సన్యాసినాయుడు ముందుగా వివరించి, వారు నిర్వర్తించే విధులు గురించి దిశానిర్దేశం చేశారన్నారు. రైళ్లలో అన్ని బోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి బ్యాగ్‌లను, లగేజీ, సూట్‌కేసులను పరిశీలించామన్నారు. అయితే ఎటువంటి నిషేధిత పదార్థాలు లభించలేదన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 లేక 100కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ప్రజలను ఎస్పీ కోరారు. తనిఖీల్లో గజపతినగరం సీఐ ఎస్.సన్యాసినాయుడు, ఎస్సై కిరణ్‌కుమార్, ఆండ్ర ఎస్సై సీతారామ్, బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి, జీఈర్పీ, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్రికి కొరివి పెట్టిన కూతురు
మక్కువ/సీతానగరం: కన్న కూతురికి కన్యాదానం చేయాలనేది ప్రతి కన్న తండ్రి కల. అయితే ఆ కన్న తండ్రి కల రోడ్డు ప్రమాదం రూపంలో ఆవిరైపోయింది. తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా చిన్న కూతురు భువనేశ్వరి తండ్రికి కొరివి పెట్టడంతో అక్కడున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే..మక్కువకు చెందిన లౌడ శ్రీనివాసరావు(55) కురుపాం మండలంలో లైన్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. గురువారం విధులు ముగించుకుని, సీతానగరం మండల కేంద్రంలోని ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న స్నేహితుడి వద్ద రాత్రి పడుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో లేచి, మక్కువ వెళ్తానని చెప్పి బయల్దేరి వెళ్లగా గుర్తు తెలియని వాహనం చినభోగిలి గ్రామం సమీపంలో ఢీకొని తలమీద నుంచి వెళ్లిపోవడంతో అక్కడక్కడే శ్రీనివాసరావు మతిచెందాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పంచనామా నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. శ్రీనివాసరావుకు భార్య ఉమావెంకటలక్ష్మి, పెద్ద కూతురు నాగశ్వేత, చిన్న కూతురు భువనేశ్వరి ఉన్నారు. ఈ ఆదివారం పెద్దకుమార్తె పెళ్లి నిశ్చితార్థానికి, పెళ్లి ముహూర్తాల కోసం మగపెళ్లివారు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంతలో విధి కన్నెర్ర చేయడంతో కన్న కూతురి పెళ్లి చూడకుండానే ఆ తండ్రి కడలోకానికి చేరుకున్నాడు. పెద్ద కుమార్తె బీటెక్ పూర్తి చేయగా చిన్నకుమార్తె భువనేశ్వరి ఎంఎస్సీ పూర్తిచేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. భార్య ఉమావెంకటలక్ష్మి గృహిణి. శోకసంద్రంలో మక్కువ శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ మావుడి తిరుపతినాయుడు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వందలాదిమంది మండల ప్రజలు ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు అంతిమయాత్రలో వేలాదిమంది కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, స్థానికులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. కన్నకూతురి పెళ్లి చూడకుండానే తండ్రి కడలోకానికి గుర్తు తెలియని వాహనం ఢీకొని లైన్ఇన్స్పెక్టర్ మృతి కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు, గ్రామస్తులు, బంధువులు -
స్కూల్ గేమ్స్‌పై నీలినీడలు
● ఇప్పటివరకు జరగని నూతన కార్యదర్శుల నియామకం ● ఆలస్యంగా జరుగుతున్న ప్రక్రియతో నష్టపోతున్న క్రీడాకారులువిజయనగరం: విద్యార్థి దశ నుంచే బాలబాలికలు క్రీడలపై దృష్టి సారించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) పోటీలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రతి ఏడాది ఆగస్టు చివరి వారం/ సెస్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సంబందించిన క్యాలెండర్‌ను అధికారంగా విడుదల చేసే అధికారులు ఈ ఏడాది సంబంధిత పోటీల నిర్వహణకు జిల్లాస్థాయి కార్యదర్శులను ఇప్పటి వరకు నియమించకపోవడం విశేషం. దీంతో ఈ ఏడాది స్కూల్‌గేమ్స్ పోటీలు ప్రభుత్వం నిర్వహిస్తుందా..? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలకు సంబంధించి 2024 వరకు కార్యదర్శి ఒక్కరే ఉండేవారు. రెండేళ్ల పదవీ కాలానికి నిర్వహణ బాధ్యత తీసుకునేవారు. వ్యాయామ ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారి నామినేట్ చేసేవారు. ముందుగా రూపొందించిన ప్రణాళికతో పలు క్రీడల్లో ప్రతి విదా పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభచూపించేందుకు అవకాశముండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కాలానికి ఒక సీ్త్ర, ఒక పురుష వ్యాయామ ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి జిల్లా నుంచి నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు కార్యదర్శుల పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్రస్థాయి నుంచి పిలుపురాకపోవడం గమనార్హం. నియామకాల జాప్యంతో తూతూమంత్రంగా పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలకు సంబంధించి కార్యదర్శుల నియామక ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో పోటీల నిర్వహణకు అవసరమైన సమయం లేక తూతూమంత్రంగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించే పరిస్థితి. నలుగురు దరఖాస్తు చేసుకున్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శుల ని యామకానికి జిల్లా నుంచి నలుగురు వ్యాయామ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వారి జాబితాను ఉన్నతాధికారులకు పంపించాం. అక్కడి నుంచి పిలుపు వస్తే నలుగురు ఉపాధ్యాయులు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. అనంతరం నూతనంగా ఇద్దరు కార్యదర్శుల నియామకం జరుగుతుంది. – యు.మాణిక్యం నాయుడు, జిల్లా విద్యాశాఖ అధికారి, విజయనగరం -
అన్నదాతల ఆక్రందన
● ట్రెంచ్‌కటింగ్ పనుల పేరుతో వరి పంట విధ్వంసం ● చెరువుల ఆక్రమణల తొలగింపు పేరిట భూముల్లో ట్రెంచ్‌కటింగ్ ● పంటసాగు మధ్యలో ఉందని ప్రాధేయపడిన అన్నదాతలు ● పనులు అడ్డుకుంటే జైలుకేనని హెచ్చరించిన అధికారులు సాలూరు: మండలంలోని పారన్నవలస, శివరాంపురం గ్రామాల్లో చెరువులను ఆనుకుని వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల ఆక్రందనను అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని పారన్నవలస, శివరాంపురం గ్రామాల్లో చెరువుల పక్కన వరి పంట సాగుచేస్తున్న అన్నదాతలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాదికూడా చెరువు పరిసర ప్రాంతాల్లో వరి నాట్లు వేశారు. ప్రస్తుతం పంట ఏపుగా పెరిగి మరో రెండు నెలల్లో చేతికి అంది వచ్చే దశలో ఉంది.ఇటువంటి సమయంలో చెరువుల ఆక్రమణల తొలగింపు పేరుతో వీబీజీరాంజీ అధికారులు పంట సాగవుతున్న ప్రాంతంలోనే ట్రెంచ్‌కటింగ్ పనులు చేపట్టారు. వరి పంటను నాశనం చేసి చంపేస్తారా? చెరువుల ఆక్రమణల తొలగింపునకు తాము అడ్డేమీ కాదని రైతులు స్పష్టంచేస్తున్నారు. ఈ విషయం సాగు ముందే చెప్పి ఉండి ఉంటే తాము ఇన్ని వేల రుపాయలు పెట్టుబడి పెట్టి చెమటోడ్చి పంట సాగుచేసే వారిమి కాదని రైతులు వాపోతున్నారు. ఈ ట్రెంచ్‌కటింగ్ పనులు గ్రామాల్లోని మిగిలిన చెరువుల్లో చుట్టూ పంటలు లేని నేపథ్యంలో అక్కడ పూర్తిచేసి, చివరిగా ఇక్కడికి వస్తే ఈ లోపు పంట చేతికి వస్తుందని తరువాత అధికారులు నిబంధనల మేరకు చెరువుల ఆక్రమణల తొలగింపు చేసుకోవాలని విన్నవించుకుంటున్నారు.పంటసాగు మధ్యలో పంటను విధ్వంసం చేయవద్దని అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ పనులు అడ్డుకుంటే బెయిల్ కూడా లేకుండా జైల్లో పెడతామని అధికారులు బెదిరించారని రైతులు వాపోయారు.44 చెరువుల్లో పనులు చేపట్టాం చెరువుల ఆక్రమణల తొలగింపులో భాగంగా, మండలంలో 240 చెరువులుండగా, 44 చెరువుల్లో రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసి పూర్తిచేసి వీబీజీరాంజీ పనుల నిమిత్తం ఇచ్చాం. ఆ చెరువుల్లో పనులు చేపట్టాం. సుమారు 25 చెరువుల్లో పనులు పూర్తికావస్తున్నాయి. పనులను అడ్డుకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. కృష్ణారావు, వీబీజీరాంజీ ఏపీఓ -
గోశాల అన్నారు..గోప్యంగా ఉంచారు
● రాజాంలో రెండురోజుల క్రితం ఆవులు పట్టుకున్న అధికారులు ● ఫైన్ పేరుతో రైతుల వద్ద వసూళ్లురాజాం: పట్టణంలోని ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా సంచరిస్తున్న గోవులను రెండురోజులు క్రితం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, రాజాం పట్టణ సీఐ డి.నవీన్‌కుమార్‌లు పట్టుకున్న విషయం పాఠకులకు విదితమే. వాటిని సింహాచలం గోశాలకు తరలిస్తున్నట్లు అధికారులు పట్టుకున్న సమయంలో వెల్లడించారు. ఈ ఘటన జరిగి రెండురోజులు గడిచినా ఈ ఆవులను గోశాలకు తరలించకుండా పట్టణానికి దగ్గరలో ఉన్న మర్రివలస గ్రామంలో ఓచోట దాచిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఆవుల యజమానులు తమ గోవులను తమకు అప్పగించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయానికి రాగా, గోశాలకు పంపించేశామని మున్సిపల్ సిబ్బంది చెప్పడంతో రైతులు సింహాచలం గోశాల వివరాలు తీసుకుని ఆరాతీశారు. అక్కడికి ఆవులు రాలేదని తెలియడంతో ఇక్కడ వెతకడం ప్రారంభించారు. చివరకు రాజాం సమీపంలో శ్రీకాకుళం రోడ్డులోని మర్రివలసలో ఓ రైతు కళ్లంలో ఆవులు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లి తమ ఆవులను వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం చేయగా, ఆ రైతుల నుంచి మున్సిపల్ సిబ్బంది అపరాధ రుసుం వసూలు చేయడం ప్రారంభించారు. ఒక్కో ఆవుకు రూ.4వేల నుంచి రూ. 5 వేలు వసూలు చేయడంతో ఆగ్రహించిన రైతులు తమ గోడును బయటపెట్టారు. దీంతో ఈ విషయం శుక్రవారం పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. గోశాలకు పంపిస్తున్నామని చెప్పిన ఆవులను స్థానికంగా దాచిపెట్టడం వెనుక ఏదో మతలబు ఉందని, రైతుల వద్ద అపరాధ రుసుం పేరుతో వసూలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు. సింహాచలం గోశాలలో ఖాళీ లేకనే.. ఇదిలా ఉండగా ఈ విమర్శలపై కమిషనర్ రామచంద్రరావు వెంటనే స్పందించారు. రెండురోజుల క్రితం 35 గోవులను పట్టుకున్నామని వాటిలో 30 గోవులను మాత్రమే లారీకి ఎక్కించామని, మిగిలిన ఐదు ఆవులను లోకల్‌గా విడిచిపెట్టామని తెలిపారు. ఈ 30 ఆవులను సింహాచలం గోశాలకు తరలించేందుకు ఏర్పాటుచేయగా, అక్కడ ఖాళీ లేదని అధికారులు చెప్పడంతో మర్రివలసలో వాటిని భద్రపరిచి, రాజాంలో గోశాల ఏర్పాటుకు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకుంటున్నామని చెప్పారు. ఈలోగా ఇక్కడ ఆవులు ఉన్న విషయం తెలుసుకున్న రైతులు తమ గోవులు ఇచ్చేయాలని కోరగా, అపరాధ రుసుం విధించామని, 18 ఆవులకు సంబంధించి రూ.53 వేలు వచ్చాయని, 12 గోవులు భద్రంగానే ఉన్నాయని కమిషనర్ అన్నారు. వాటికి సంబంధించి రైతులకు కంప్యూటరైజ్డ్ రశీదులు ఇస్తున్నామని వివరించారు. రైతులకు ఫైన్ వేయకుంటే మళ్లీ ఆవులను రోడ్డుమీదకు వదిలేస్తారని, స్థానిక ఎమ్మెల్యే సలహా మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గోవుల నిమిత్తం వెళ్లిన రైతుల్లో మీసాల రూప, బంకి పాపినాయుడు తదితరులు మాట్లాడుతూ తమ వద్ద బలవంతంగా ఒక్కో ఆవుకు రూ.4 వేలు మించి వసూలు చేశారని ఆరోపించారు. -
గోమాతకు పునర్జన్మ
● నెల్లిమర్లలో ఆవుకు శస్త్రచికిత్స ● ‘గర్భంలో చనిపోయిన దూడను తొలగించి ప్రాణాలు కాపాడిన పశువైద్యులు నెల్లిమర్ల: పట్టణంలోని సాలివీధికి చెందిన కోలా రామకృష్ణ అనే రైతుకు చెందిన తొలిచూడి ఆవు, ఈనలేక రామతీర్థం జంక్షన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో పడిపోయింది. జనసంచార మార్గంలో ఇరుగ్గా ఉండడంతో మూడు రోజుల క్రితమే కడుపులోనే దూడ చనిపోయి, ఉబ్బిపోయింది.స్థానికుల సమాచారంతో యజమాని దానిని ఇంటికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుపై పడిపోవడంతో, వెంటనే భోగాపురం పశు అంబులెన్న్స్ను రప్పించి ఇంటి సమీపానికి చేర్చారు. సతివాడ పశువైద్యుడు డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్, రామతీర్థం పశు వైద్యుడు డాక్టర్ డి.సురేష్, అంబులెన్స్ డాక్టర్లు అమృత, లక్ష్మిలతో పాటు నెల్లిమర్ల, భోగాపురం పశువైద్య సిబ్బంది దాదాపు 4 గంటల పాటు శ్రమించి ఆవుకు శస్త్రచికిత్స నిర్వహించారు. గర్భంలో చనిపోయిన దూడను బయటకు తీసి ఆవు ప్రాణాలను కాపాడారు.సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో ఆపరేషన్ విజయవంతమై ఆవు క్షేమంగా ఉందని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి. చక్రవర్తి తెలిపారు. చూలు నిండిన సమయంలో పాడిరైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
అగ్నికి ఆహుతైన దాబా
బొబ్బిలి: పాత బొబ్బిలి సమీపంలో ఉన్న మోడీ దాబా బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్ని ఆహుతైంది. పట్టణానికి చెందిన మోడీ శ్రీనివాసరావు నిర్వహిస్తున్న దాబా బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైంది. దాబాలో రెల్లిగడ్డితో వేసిన గుడెసెలు ఉండడంతో క్షణాల్లోనే మంటలు అంటుకుని బూడిదైంది. గుర్తు తెలియని వ్యక్తులే దాబాకు నిప్పు పెట్టి ఉంటారని నిర్వాహకులు అనుమానిస్తున్నారు. గురువారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీల్లోని వివరాలతో సంఘటనపై పరిశోధన చేస్తున్నారు. సుమారు రూ.ఐదు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సిమెంటు బస్తాల మాయంపై విచారణ పాలకొండ రూరల్: హౌసింగ్ శాఖ ద్వారా గృహ నిర్మాణ లబ్ధిదారులకు అందించాల్సిన సిమెంట్ బస్తాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గత హౌసింగ్ ఏఈ సుధారాణిపై శాఖా పరమైన విచారణ జరిగింది. సాలూరుకు చెందిన హౌసింగ్ డీఈఈ సోమేశ్వరరావు నేతృత్వంలో గురువారం అధికారులు స్థానిక నగర పంచాయతీ పరిధి భాసూరువారి వీధి సచివాలయంలో హౌసింగ్ రికార్డులు తనిఖీ చేపట్టారు. పట్టణ సచివాలయాల ఎమినిటీ కార్యదర్శులకు తెలియకుండా తమ లాగిన్ల నుంచి తప్పుదారిన సిమెంటు బస్తాలు దారి మళ్లినట్టు అందించిన ఫిర్యాదుతో వారి నుంచి కూడా వివరాలు సేకరించామని డీఈఈ తెలిపారు. తాము గుర్తించిన అంశాలను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. డీఈఈ వెంట ప్రస్తుత పాలకొండ హౌసింగ్ ఏఈ వినోద్ ఉన్నారు. విజయనగరం టౌన్: జిల్లాలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ఉత్సవ కమిటీలు ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ నెల 14న నిర్వహించనున్న వినాయక చవితి పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాల నిర్వహించే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ క్లిక్ చేసి, నిర్దేశించిన అనుమతులు పొందాలన్నారు. సింగిల్ విండో విధానంతో ప్రజలు సులభంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనానికి అనుమతులు పొందవచ్చన్నారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్‌ను ప్రింట్ తీసి, లామినేషన్ చేసి, ఉత్సవ మండపంలో తనిఖీలకు వచ్చే అధికారులు పరిశీలించేందుకు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా నిర్వహించుకోవడానికి పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య రామభద్రపురం: మండల కేంద్రంలోని ఓ వ్యక్తి మద్యానికి బానిసై భార్యతో గొడవలు పడి గడ్డి మందు తాగి గురువారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని కనిమెరక వీధికి చెందిన గేదెల రమేష్(39) రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. రోజూ విపరీతంగా మద్యం తాగుతూ భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంతో పాటు భార్యతో గొడవలు పడేవాడు. దాంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రమేష్ బుధవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యా యత్యానికి పాల్పడ్డాడు. వాంతులు చేసుకుంటుండగా సోదరి కనిమెరక లక్ష్మి గమనించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధమ చికిత్ప నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పారా వాలీబాల్ పోటీలకు రాష్ట్ర జట్ల ఎంపిక
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న పారా వాలీబాల్ సీ్త్ర, పురుషుల పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్ల ఎంపిక పోటీలు గురువారం ముగిశాయి. జిల్లా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన ఎంపిక పోటీలకు వివిధ జిల్లాలకు చెందిన 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి ఎంపిక పోటీలు నిర్వహించగా... అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను పురుషుల జట్టులోకి, 14 మంది క్రీడాకారిణులను సీ్త్రల జట్టులోకి ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్లో జరిగే జాతీయ స్థాయి పారా వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. పారా వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బి.శివదత్త, విజయనగరం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా పారా వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులోనే భార్య హత్య
బొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామంలో గత నెల 31 రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి భర్త బుంగ రామముత్యాలు భార్యను హతమార్చినట్టు తేలిందని గజపతినగరం సీఐ సామంతుల సన్యాసినాయుడు తెలిపారు. దీనికి సంబంధించి బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామముత్యాలు అదే గ్రామానికి చెందిన బుంగ సంధ్యను ఎనిమిదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి బాబు, పాప ఉన్నారు. కొద్ది సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య సఖ్యత దెబ్బతిని తగాదాలు జరుగుతున్నాయి. నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చే రామముత్యాలు భార్య సంధ్యను డబ్బుల కోసం వేధించడంతో పాటు అత్తమామలను కూడా వేధించేవాడు. ఈ క్రమంలో గత నెల 31 రాత్రి పది గంటల సమయంలో ఇంటికి మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో భార్య సంధ్యను రామముత్యాలు ముక్కు మూసి ఊపిరి ఆడకుండా చేసి గోడకు బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పిపోయి పడిన సంధ్య అక్కడికక్కడే మృతి చెందినట్టు సీఐ తెలిపారు. మృతురాలి తల్లి ఈశ్వరమ్మ తన కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన అల్లుడే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినట్టు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో సంధ్య తలను బలంగా గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి మృతి చెందినట్టు నివేదిక వచ్చినట్టు తెలిపారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. నిందితుడు రామముత్యాలు హత్య చేసిన తరువాత పరారీ కాగా పోలీసులు నిఘా పెట్టి ఈ నెల 2వ తేదీ బుధవారం బొండపల్లి సమీపంలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. వివరాలు వెల్లడించిన సీఐ -
పాసింగ్ అవుట్ పరేడ్ విజయవంతంగా నిర్వహించాలి : ఎస్పీ
విజయనగరం టౌన్: పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న పాసింగ్ అవుట్ పరేడ్ రిహార్సల్స్‌ను ఎస్పీ ఎఆర్.దామోదర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్‌లో భాగంగా నిర్వహించిన కవాతు, ప్లాటూన్ల కదలికలు, కమాండ్లకు స్పందన, మార్చింగ్ పద్ధతి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. రిహార్సల్స్‌లో పాల్గొన్న శిక్షణార్ధుల పరేడ్ తీరును పరిశీలించి, అవసరమైన సూచనలు, సలహాలను అందించారు. పరేడ్‌లో ప్రతి ఒక్కరూ సమన్వయంతో, పూర్తి క్రమశిక్షణతో పాల్గొనాలన్నారు. పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప అవకాశమని, శిక్షణలో జ్ఞానం, నైపుణ్యాలను విధి నిర్వహణలో సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, బాధితుల సమస్యలను సానుభూతితో వినడం, చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం ప్రతి పోలీస్ సిబ్బంది ప్రధాన కర్తవ్యమన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, శిక్షణా సిబ్బంది, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రీసర్వేలో వేగమే కాదు.. పారదర్శకత ముఖ్యం : జేసీ
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత, కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. గురువారం రీసర్వే, పట్టాదారు పాస్‌బుక్కులు, ఈ–కేవైసీ, వెబ్‌ల్యాండ్–2 పోర్టింగ్, ప్రింటింగ్ పురోగతిపై వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 487 గ్రామాలు రీసర్వే పరిధిలో ఉండగా, ఫేజ్–1, 2, 3లో 111 గ్రామాలు పూర్తయ్యాయి. ఫేజ్–4లోని 126 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్, వెక్టరైజేషన్ పూర్తియినందున తదుపరి దశలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అక్టోబర్‌లో చేపడుతున్న 80 గ్రామాల్లో 52,597 ఖాతాలను సంబంధించి 81,458.77 ఎకరాలు నమోదయ్యాయని, 32,136 డ్రాఫ్ట్ పీపీబీల్లో 26,086 ఖాతాలకు ఈ–కేవైసీ పూరై చేసుకోగా, మరో 3 గ్రామాలు ప్రింటింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. సిద్ధంగా ఉన్న గ్రామాలను వెంటనే తదుపరి దశకు తీసుకెళ్లాలని, పెండింగ్ పనులను రోజువారీగా పర్యవేక్షించాలని జేసీ ఆదేశించారు. ప్రోగ్రెస్ రిపోర్టులకు, వాస్తవ పెండింగ్‌కు తేడా ఉండటంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తప్పుడు గణాంకాలతో కాలయాపన చేయకుండా వాస్తవ డేటానే నివేదించాలని తుది హెచ్చరిక జారీ చేశారు. సర్వేయర్లు, తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, రీసర్వే ద్వారా భూ యాజమానులకు కచ్చితమైన, పారదర్శకమైన రికార్డులు అందించడమే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. -
స్పెషల్ ఆఫీసర్ మాటున... రూ.కోట్ల దోపిడీకి స్కెచ్!
● ప్రైవేటు కంపెనీలకు మున్సిపల్ నిధులు ధారాదత్తం ● స్పెషల్ ఆఫీసర్ సంతకంతో భారీ ప్రాజెక్టుల ఆమోదం! ● అడ్డగోలు వడ్డీ దోపిడీ.. బ్యాంకుల కంటే నాలుగింతల అదనం ● ఏకంగా 5.69 శాతం అధిక వడ్డీ భారం ● ప్రజల ఆస్తులు ఎస్క్రో ఖాతాలోకి.. ● నగర ప్రజలపై ‘హైబ్రీడ్’ భారం వేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర! విజయనగరం అర్బన్: తన సొంత కాళ్లపై నిలబడుతూ ఏటా రూ.కోట్ల ఆదాయాన్ని సముపార్జించుకుంటున్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కన్ను పడింది. పట్టణ వాసుల సొమ్మును, వారి ఆస్తుల భద్రతను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ అడ్డగోలు ‘హైబ్రీడ్’ స్కెచ్ వేసింది. రోడ్డు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కుల సమగ్ర అభివృద్ధి పేరుతో ‘హైబ్రీడ్ యాన్యుటీ మోడల్’ (హెచ్ఏఎం)ని తీసుకొస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ జారీ చేసిన రహస్య ఉత్తర్వులు ఇప్పుడు పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, ఎన్నుకోబడిన పాలకమండలి లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, స్పెషల్ ఆఫీసర్లతో ‘అత్యవసర’ సంతకం చేయించి మున్సిపాలిటీల ఆర్థిక మూలాలను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది. ప్రైవేటు ఏజెన్సీలోకి రూ.కోట్లు కుమ్మరించే కుట్ర విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్నులు, ప్రకటనల రుసుంలు, నీటి పన్నులు, వివిధ అనుమతుల ద్వారా విజయనగరం కార్పొరేషన్ ఏడాదికి రూ.150 కోట్లకు పైగా ఆదాయాన్ని గడిస్తోంది. ఈ నిధులతో మున్సిపాలిటీయే సొంతంగా రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టే వెసులుబాటు స్పష్టంగా ఉంది. అయితే ఈ ప్రజాధనాన్ని ప్రైవేటు కాంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్లించడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రూ.7,469.46 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు తెచ్చినట్లు మున్సిపల్ శాఖ ఇటీవల ప్రకటించింది. నగరంలో సామాన్య ప్రజలు తమ కష్టార్జితంతో నిర్మించుకున్న ఇళ్లు, కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ కోసం చెల్లించే బీపీఎస్, ఎల్ఆర్ఎస్, రుసుములు, ఎంఐజీ, ఎస్ఐజీ లేఅవుట్ల అమ్మకాల నిధులను కార్పొరేషన్ నుంచి లాక్కొని నేరుగా ప్రైవేటు కాంట్రాక్టర్ ఇచ్చే ‘ఎస్క్రో ఖాతా’లో జమ చేయాలని జీఓలో స్పష్టం చేశారు. అంటే, కార్పొరేషన్‌కు రావాల్సిన ప్రధాన ఆదాయ మార్గాలన్నీ ముందే ప్రైవేటు ఏజెన్సీల జేబుల్లో వెళ్లిపోతాయి. ఈ ప్రాజెక్టు ఒప్పందంలో జరిగిన అక్రమాలు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని అగ్రగామి బ్యాంకుల సగటు ఎంసీఎల్ఆర్ (బ్యాంకుల రుణ వడ్డీ రేటును నిర్ణయించే కీలక ప్రమాణమైన) 1.25 శాతం మాత్రమే ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు బహుమతిగా ఇస్తున్న వడ్డీ రేటు ఏకంగా 5.69 శాతం. ప్రైవేట్ కంపెనీలు పెట్టే 60 శాతం పెట్టుబడికి ప్రభుత్వం పది సంవత్సరాల్లో 40 త్రైమాసికాల్లో 5.69 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది బ్యాంకుల కంటే నాలుగింతలు అదనంగా వడ్డీ కట్టిస్తూ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. ప్రైవేటు సంస్థలతో ఉన్న ‘కమిషన్ల’ లాలూచీ కోసమే ఈ స్థాయిలో వడ్డీలు చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి.. స్పెషల్ ఆఫీసర్‌తో సంతాలు! ఇంతటి భారీ దోపిడీ పథకానికి ఆమోదం తెలిపేందుకు ప్రస్తుతం ప్రజాప్రతినిధుల పాలకమండలి లేకపోవడమే ప్రభుత్వానికి కలిసివచ్చింది. ప్రజల పక్షాన ప్రశ్నించే మేయర్, కార్పొరేటర్లు ఉంటే ఈ అన్యాయాన్ని కౌన్సిల్లో తిప్పికొడతారనే ఉద్దేశంతోనే, ‘అత్యవసర తీర్మానాలు చేయాలి’ అంటూ స్పెషల్ ఆఫీసర్లకు ఐఏఎస్ అధికారి ద్వారా ఆదేశాలు పంపించారు. ప్రజాభిప్రాయాన్ని బొందపెట్టి, నగరం భవిష్యత్తును ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వద్ద కుదువపెట్టే ఈ ‘హైబ్రీడ్ నిర్ణయాన్ని పట్టణ వాసులు, పౌర సంఘాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ప్రజలు, ఆస్తులపై తీవ్ర ప్రభావం కార్పొరేషన్ నిధులన్నీ ప్రైవేట్ ‘యాన్యుటీ’ వాయిదాలకే సరిపోతే, రేపు నగరంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, ఉద్యోగులు–కార్మికులల జీతభత్యాలు చెల్లించడానికి సొమ్ములేని పరిస్థితి వస్తుంది. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ బాధ్యతలను పదేళ్ల పాటు ప్రైవేటు ఏజెన్సీలకే కట్టబెడం వల్ల వారు నిర్వహణ సరిగ్గా చేయకపోయినా ప్రశ్నించే హక్కు కార్పొరేషన్‌కు ఉండదు. ఎస్క్రో ఖాతాల ద్వారా కార్పొరేషన్ ఆదాయం మొత్తం ప్రైవేట్ పరం అయ్యాక, లోటును భర్తీ చేసుకునేందుకు విజయనగరంలోని 3 లక్షల మంది ప్రజలపై అదనపు ఆస్తి పన్నులు, యూజర్ ఛార్జీల భారం మోపడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక మున్సిపల్ అధికరాలు పట్టించుకోక, ప్రైవేటు ఏజెన్సీలు అరకొర నిర్వహణతో వదిలేస్తే, నగరంలో పౌరుల ఆస్తుల విలువ దెబ్బతినే ప్రమాదం ఉంది. -
కంచేరులో భూవివాదం!
● సన్‌రే రిసార్ట్సు యజమాని రాజబాబుపై బాధితుల ఆరోపణ ● రాజబాబు ఫిర్యాదుతో బాధితులపై కేసులు ● ఇదేం న్యాయం అంటూ బాధితుల ఆందోళన పూసపాటిరేగ : భోగాపురం మండలం కంచేరు రెవెన్యూ పరిధిలో భూ వివాదం నేపథ్యంలో భూహక్కుదారులు ఆందోళనకు దిగారు. కంచేరు రెవెన్యూ పరిధిలో తమ భూములలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కంచేరు రెవెన్యూ పరిధిలో కాకర్లపూడి సుగణకుమారికి చెందిన 15.455 ఎకరాల భూమిని 2021 మార్చిలో ఎలాన్ కన్‌స్ట్రక్సన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు అభివృద్ధికి ఒప్పందం ద్వారా అప్పగించారు. భూమిని అభివృద్ధి చేసి ఒప్పందం మేర వాటాలు పంచుకునేలా, 36 నెలలులో అభివృద్ధి పూర్తి చేయాలనే నిబంధనలతో ఒప్పందం చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. అయితే ఒప్పంద గడువు పూర్తయినప్పటికి ఆయా భూములలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను పలుమార్లు సంప్రదించి, భూమిని తిరిగి అప్పగించాలని కోరినట్లు తెలిపారు. స్పందన లేకపోవడంతో గత నెల 26న కంపెనీకి లీగల్ నోటీసు ఇచ్చినప్పటికి సమాధానం రాలేదని బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31న తమ భూములు వద్దకు వెళ్లి అభివృద్ధి పనులు చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. తమని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, స్టేషన్లో రాత్రి పొద్దుపోయే వరకు ఉంచి కేసులు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు. కేసులు నమోదైన వారిలో ఇద్దరు న్యాయవాదులు కూడా వున్నారన్నారు. తమ భూములను అభివృద్ధి కోసం ఇచ్చి ఒప్పందం ప్రకారం పనులు జరగలేదని ప్రశ్నించినందుకు తమపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలని బాధితులు కోరారు. సమావేశంలో తిరుమలరాజు శాలిని, తిరుమలరాజు జయకర్, తిరుమలరాజు దినకరవర్మ, తిరుమలరాజు సాకేత్ తదితరులు పాలొన్నారు. -
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం: ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్త సమ్మె చేయటానికి వెనుకాడేది లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో పని చేస్తున్న 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ జోనల్ సెక్రెటరీ బీకే మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీలో థర్డ్ పార్టీ విధానం వల్ల కార్మికులు చాలా నష్టపోతున్నారని ప్రతి ఒక్క కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రూ.4000 వరకు కోత విధిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎ.అశోక్ మాట్లాడుతూ కార్మిక శాఖ నిర్ణయించిన జీతాలు రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఏ కార్మికుడు అందుకునే పరిస్థితి లేదన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారించకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విజయనగరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో ప్రెసిడెంట్ కేఎన్ స్వామి, ఏపీపీటీడీ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు తిరుపతిరావు, జిల్లా ట్రెజరీ శివ అత్యధిక సంఖ్యలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ డిమాండ్ -
కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్మికుల బైఠాయింపు
● జిల్లా పంచాయతీ అధికారి హామీతో.. ● ఆందోళన విరమించిన పంచాయతీ కార్మికులువిజయనగరం గంటస్తంభం: పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన 36 గంటల నిరసనలో భాగంగా గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.21వేల వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ అలవెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి బయటకు వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. బకాయి వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని, వాహనాల మరమ్మతులు, పనిముట్లు, రక్షణ పరికరాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పది రోజుల్లో ఎంపీడీవోలు, యూనియన్ పత్రినిధులతో సమావేశం నిర్వహించి స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని, వేతనాల పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు ధర్నా విరమించారు. హామీలు అమలు కాకపోతే మళ్లీ పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. -
సెప్టెంబర్ 5లోపు పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలి
● పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయాలి ● ఏపీజేఏసీ జిల్లా సమావేశంలో డిమాండ్ విజయనగరం గంటస్తంభం: ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏపీ జేఏసీ విజయనగరం జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్‌లు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు బుధవారం ఏపీఎన్జీజీఓ హోంలో ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ ఎ.సురేష్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పీఆర్సీ కమిటీకి చైర్మన్‌ను నియమించి వెంటనే ఐఆర్ మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం కొన్ని సమస్యలను పరిష్కరించినందున ఇప్పటివరకు వేచిచూసే ధోరణితో ఉన్నామని, అయితే, ఉద్యోగుల్లో సంయమనం పాటించే ఓపిక కూడా నశిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను బాధ్యతగా అమలు చేయాలని, చర్చల ద్వారా మిగిలిన సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గాలను ప్రభుత్వం ప్రకటించాలని, లేనిపక్షంలో రాష్ట్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా అన్ని తాలూకాల జేఏసీ నాయకులు సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. ఏపీ జేఏసీ రాష్ట్ర స్థాయిలో పెద్ద వ్యవస్థ కావడంతో రాష్ట్ర నాయకత్వం అన్ని అంశాలను పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. సమావేశంలో జేఏసీ సెక్రటరీ జనరల్ ఎన్.వి.పైడిరాజు, కో–చైర్మన్ టి.శ్రీధర్‌బాబు, కోశాధికారి కె.చంద్రశేఖర్‌తో పాటు వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పత్రినిధులు పాల్గొన్నారు.


